దుర్గగుడిలో ఆ సమయంలో వీఐపీ దర్శనాలు రద్దు.. పూర్తి వివరాలు అందిస్తేనే వీఐపీ దర్శనాలకు అనుమతి

Best Web Hosting Provider In India 2024

దుర్గగుడిలో ఆ సమయంలో వీఐపీ దర్శనాలు రద్దు.. పూర్తి వివరాలు అందిస్తేనే వీఐపీ దర్శనాలకు అనుమతి

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

విజయవాడ ఇంద్రకీలాద్రి వీఐపీ ప్రోటోకాల్‌ దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుండటంతో వాటిని క్రమబద్దీకరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 11.30 నుంచి 1.30వరకు వీఐపీ దర్శనాలకు ఎవరిని అనుమతించరు.

దుర్గగుడిలో వీఐపీ దర్శనాలపై ఆంక్షలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మ వారి నైవేద్యం విరామం కోసం ఇకపై ప్రతి రోజు ఉదయం 11.30 నుండి 1.30 వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో శీనా నాయక్‌ ప్రకటించారు.

దుర్గగుడిలో అమ్మవారికి నైవేద్యాలను సమర్పించే సమయంలో క్యూ లైన్లను ఎక్కడికక్కడ నిలిపి వేస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అదే సమయంలో వీఐపీ దర్శనాల కోసం వస్తుండటంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుండటంతో దర్శనాలను క్రమబద్దీకరిస్తున్నట్టు ప్రకటించారు.

అమ్మవారి దర్శనం కోసం వచ్చే వీఐపీలు ముందస్తు సమాచారం ప్రోటోకాల్‌ విభాగానికి అందించాలని, అన్ని వివరాలతో కూడిన ఫార్మాట్ లో వివరాలు తెలియ చేయాల్సి ఉంటుందని వివరించారు.

జూన్‌ 3, 4, 5 తేదీల్లో మల్లేశ్వరాలయంలో నవగ్రహ మండపం పున:ప్రతిష్ట

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణం లో నిర్మించిన నవగ్రహ మండపం పునః ప్రతిష్ట కార్యక్రమం జూన్ 3,4,5 లో జరుగుతుందని అధికారులు వివరించారు.

దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఈవో తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న అన్నదానం భవనం, లడ్డు తయారీ భవనం దసరా నాటికి వినియోగంలోకి తీసుకు వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుపుతున్నట్టు వివరించారు. రాతి యాగశాల, పూజా మండపములు శ్రావణ మాసం లోగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం…

నగరంలో నుండి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పున్నమి ఘాట్ నుండి బస్సులు ఏర్పాటు చేసి, కొండ పైన ట్రాఫిక్ ఇబ్బంది పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈవో వివరించారు.

వాహనాల మీద వచ్చే వారు సీతమ్మ వారి పాదాలు ప్రాంతంలో పార్కింగ్ కు 4 ఎకరాల్లో హోల్డింగ్ ఏరియా సిద్ధం చేస్తున్నామని, అవసరమైతే కుమ్మరి పాలెం సెంటర్ లోని టీ.టీ. డీ స్థలం లో కూడా హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

దుర్గాఘాట్ ను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాద్ పధకం ద్వారా కేంద్రం సహాయంతో ఆలయాలను అభివృద్ధి చేయడానికి దేవదాయ మంత్రి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు కృషి చేస్తున్నారని, త్వరలో ఢిల్లీ నుండి సమాచారం రావొచ్చని వివరించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Kanaka Durga Temple VijayawadaVijayawadaTeluguTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024