



Best Web Hosting Provider In India 2024
రుతుపవనాల రాకను చెప్పే జగన్నాథుడి ఆలయం.. నీటి చుక్కలతో వర్షాల అంచనా!
భారతదేశంలో ఎన్నో గుళ్లు. వాటికి ప్రత్యేకమైన చరిత్ర. కొన్ని ఆలయాల మిస్టరీ అయితే ఇప్పటికీ అంతుపట్టదు. అలాంటి వాటిలో ఒకటి రుతుపవనాల రాకను చెప్పే జగన్నాథుడి ఆలయం.
మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో పురాతన ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇక వాటి శిల్ప కళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతం. వందల, వేల ఏళ్ల కిందటి ఇంజినీరింగ్ వ్యవస్థ ఇప్పటికీ అర్థం కాదు. చాలా ఆలయాలు మిస్టరీగానే ఉన్నాయి. సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే అనేక ఆలయాలు భారత్‌లో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరానికి దగ్గరలో ఉన్న బెహతా గ్రామంలోని ఆలయం కూడా ఉంది.
ఈ ఆలయం వర్షం వస్తుందని ముందే చెబుతుంది. రుతుపవనాల రాకను ముందుగానే అంచనా వేస్తుంది. పురాతన కాలం నుండి ఈ ఆలయంలో జగన్నాథుడిని పూజిస్తున్నారు. అందుకే దీనిని జగన్నాథ ఆలయం లేదా మాన్‌సూన్ టెంపుల్ అంటారు. స్థానికులు మాత్రం ఈ ఆలయం దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైనదని చెబుతున్నారు. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు.
ఈ ఆలయం ముందు నుండి చూస్తే పూర్తి గోపురంలా కనిపిస్తుంది. వర్షాల రాకను ముందే తెలియజేస్తుంది. గోపురంలోని రాయి తడిసిపోయి.. ఆలయంలో నీరు పడటం మెుదలైతే రుతుపవనాలు వస్తున్నాయని అర్థం. చుక్కలు తక్కువగా పడితే అది సాధారణ వర్షానికి సంకేతం అని భావిస్తారు. మరిన్ని చుక్కలు పడటం ప్రారంభిస్తే మంచి వర్షం పడుతుందని అంచనా. ఈ ఆలయం చెప్పే రుతుపవనాల అంచనా బట్టి స్థానిక రైతులు విత్తనాలు వేస్తారు.
ఈ నీటి చుక్కల పరిమాణం చాలా సంవత్సరాలుగా రుతుపవనాలు బాగుంటాయా లేదా బలహీనంగా ఉంటాయా అని చెబుతోందని ఆలయ పూజారి చెప్పారు. ఈసారి పైకప్పు నుంచి మంచి మొత్తంలో చుక్కలు పడ్డాయి. రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. వర్షపాతం చాలా బాగుంటుందని చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వర్షం మెుదలైన వెంటనే ఈ ఆలయంలో పైకప్పు లోపలి భాగం ఎండిపోతుంది. ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఎన్నోసార్లు వచ్చి పరిశోధనలు చేశారు. కానీ ఈ మిస్టరీని తెలుసుకోలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. గుడి నిర్మాణం గురించి కూడా సరైన సమాచారం లేదు.
Best Web Hosting Provider In India 2024
Source link