




Best Web Hosting Provider In India 2024

త్రివిక్రమ్ మెచ్చిన ఓటీటీ థ్రిల్లర్ మూవీ- 8.3 రేటింగ్- మైండ్ బ్లాక్ క్లైమాక్స్ ట్విస్ట్- తెలుగులో స్ట్రీమింగ్!
మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మెచ్చిన ఓటీటీ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఆ సినిమానే అరువి. తమిళంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8.3 రేటింగ్ ఉంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న అరువి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు, డైలాగ్స్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించే ఆయన మూవీస్‌కు అభిమానులే కాదు తెలుగు ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తుంటారు.
అదితి బాలన్ మెయిన్ లీడ్ రోల్
ఇక త్రివిక్రమ్ సినిమాలు అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్‌నే ఓ ఓటీటీ సినిమా కట్టిపడేసింది. ఆ మూవీనే అరువి. 2016లో తమిళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం అరువి. అదితి బాలన్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు.
35 కోట్ల కలెక్షన్స్
కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.3 రేటింగ్ దక్కించుకుంది. అలాగే, అరువి మూవీపై ఎంతోమంది సినీ పెద్దలు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇఖ ఫ్రెష్ కంటెంట్ ఎంతో చెప్పే రొట్టెన్ టొమాటోస్ సంస్థ 86 శాతం తాజా కంటెంట్ అని అరువి సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది.
అరువి ఓటీటీ స్ట్రీమింగ్
అలాంటి అరువి ఓటీటీలో అందుబాటులో ఉంది. అది కూడా తెలుగు భాషలో అరువి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అరువి ఓటీటీ రిలీజ్ అయింది. తమిళం, తెలుగు, మలయాళం మూడు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అరువి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అరువి అనే అమ్మాయి ఎదుర్కొనే మానసిక సంఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
అరువి క్లైమాక్స్ ట్విస్ట్
ఇక అరువి మూవీలోని క్లైమాక్స్ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవుతుందని ఎంతోమంది రివ్యూవర్స్ చెప్పారు. ఊహించని ట్విస్టుతో, ఒక చిన్న పాయింట్‌తో క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను చూసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్లుగా డైరెక్టర్ త్రివిక్రమ్ తెలిపారు.
చివరి 20 నిమిషాలు
ఓ ఇంటర్వ్యూలో అరువి సినిమా గురించి డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “తమిళ్‌లో అరువి. అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మొదలుపెడితే.. వావ్ అనిపించేలా చేసింది. చివరికి వచ్చేసరికి అయితే ఇంటర్నేషనల్ సినిమాను దాటేసి వెళ్లిపోయింది. అసలు చివరి 15, 20 నిమిషాలు అన్‌బిలేవబుల్‌గా (నమ్మలేకుండా) ఉంటుంది” అని అన్నారు.
స్పాయిల్ చేయడం ఇష్టం లేదు
“ఆ సమస్య మీద అంతసేపు కూర్చోబెట్టడం అనేది.. మీకు (యాంకర్) తెలుసు కదా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంది చూడాలనుకుంటారు కదా. స్పాయిల్ చేయడం ఇష్టం లేదని” అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. త్రివిక్రమ్ మాటలకు యాంకర్ అవును అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
మరి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు వావ్ అనిపించేంత నచ్చిన అరువి సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగులో చూసేయండి. ఇకపోతే అరువి మూవీలో అదితి బాలన్‌తోపాటు ప్రదీప్ ఆంటోనీ, లక్ష్మీ గోపాలస్వామి, శ్వేత శేఖర్, కవిత భారతి, మొహమ్మద్ అలీ బైగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం
టాపిక్