





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి నేరుగా వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠగా సాగే మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
స్టోలెన్ సినిమా ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది. వివిధ ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమైన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది.
మీర్జాపూర్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలో ‘స్టోలెన్’ చిత్రం తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీకి తేజ్‍పాల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే కొన్ని ఫిల్మ్ ఫెస్టివళ్లలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ప్రశంసలు దక్కించుకుంది. అయితే, ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
స్టోలెన్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
స్టోలెన్ సినిమా జూన్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు (మే 26) అధికారికంగా వెల్లడించింది. “ఓ తప్పిపోయిన బాలిక. కాలానికి ఎదురెళ్లే థ్రిల్లింగ్ రేస్. జూన్ 4న ప్రైమ్‍లో స్టోలెన్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అభిషేక్ బెనర్జీకి గాయాలైనట్టుగా ఓ పోస్టర్ రివీల్ చేసింది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో..
స్టోలెన్ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‍బోర్న్‌లోనూ స్క్రీనింగ్ జరిగింది. జపాన్‍లో స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ డిజిటల్ సినిమా ఫెస్టివల్‍లో ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డును ఈ చిత్రం గెలుచుకుంది. జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలోనూ ఈ మూవీ ప్రదర్శితమైంది. ఇప్పుడు జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్టోలెన్ వచ్చేస్తోంది.
స్టోలెన్ చిత్రంలో అభిషేక్ బెనర్జీతో పాటు శుభమ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీని గ్రిప్పింగ్ నరేషన్‍తో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు డైరెక్టర్ తేజ్‍పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అనురాగ్ కశ్యప్, కిరణ్ రావ్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే ప్రొడ్యూజ్ చేశారు.
స్టోలెన్ స్టోరీలైన్
ఓ రైల్వే స్టేషన్‍లో తల్లి నుంచి ఓ పాపను దండగులు ఎత్తుకుపోవడాన్నిచూస్తారు గౌతమ్ (అభిషేక్ బెనర్జీ), రామన్ (శుభం). ఆ పాపను వెతికి కనిపెట్టాలని ఆ ఇద్దరు అన్నదమ్ములు నిర్ణయించుకుంటారు. అందుకు చేసే ప్రయత్నంలో వీరు ప్రమాదాలను, సవాళ్లను ఎదుర్కొంటారు. అసలు ఆ పాపను ఎత్తుకెళ్లింది ఎవరు? గౌతమ్, రామన్ ఆ పాపను కాపాడారా? వారికి ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురయ్యాయనే అంశాలు స్టోలెన్ సినిమాలో ఉంటాయి.
స్టోలెన్ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, శుభంతో పాటు హరిశ్ ఖన్నా, మియా మల్జేర్, షైదుల్ రహమాన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జూన్ 4 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేయవచ్చు. ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రశంసలు దక్కించుకున్న చిత్రానికి ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి.
సంబంధిత కథనం