నేరుగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా-వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి రియాక్షన్

Best Web Hosting Provider In India 2024

నేరుగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా-వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి రియాక్షన్

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

ఏపీలో అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని మాజీ సీఎం జగన్ చెబుతున్నారని, స్కామ్ లేనప్పుడు తాను టీడీపీ నేతతో ఏం చర్చిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్ కోటరీ తనను రెచ్చగొడుతున్నారన్నారు.

నేరుగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా-వైసీపీ వీడియోపై విజయసాయి రెడ్డి రియాక్షన్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు ముందు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..టీడీపీ నేతతో భేటీ అయ్యాయని వైసీపీ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసింది. ఈ వివాదంపై విజయసాయి రెడ్డి స్పందించారు.

“నేను మౌనంగా ఉండడం వైసీపీలోని కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ కు నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు.

బలి పశువును చేద్దాం అని ప్రయత్నాలు

రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ కు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను.

కోటరీ వెన్నుపోటు పొడిచింది

2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో. కోటరీ నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారు.

సాయిరెడ్డి ప్రశ్నలు

ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?” అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

ఘట్టమనేని ఇంటికి

తాను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లానని, తనకు స్వర్గీయ కృష్ణ కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. అందరూ తన కుమార్తె వివాహానికి వచ్చారన్నారు. తాను వెళ్లే సమయానికి టీడీపీ నేత టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు.

స్వయంగా లోకేశ్, చంద్రబాబునే కలుస్తా

మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని విజయసాయి రెడ్డి అన్నారు. తాను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానన్నారు. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్, చంద్రబాబునే కలుస్తా కానీ వేరేవాళ్లతో ఎందుకు చర్చిస్తానన్నాకుయ వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేనని చెప్పారు.

స్కామ్ లేనప్పుడు ఏం చర్చిస్తాను

“లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశా? అని జగన్ కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు”-మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

Bandaru Satyaprasad

TwittereMail
బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

టాపిక్

Andhra Pradesh NewsAp PoliticsYsrcpVijayasai ReddyTdpYs Jagan
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024