మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కేసు, మే 28న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు

Best Web Hosting Provider In India 2024

మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కేసు, మే 28న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మే 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ముందు నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేనని కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు.

మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కేసు, మే 28న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు

తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఏసీబీ నోటీసులు

“ఫార్ములా ఈ-రేస్ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపులు అయినప్పటికీ, నేను కచ్చితంగా ఏసీబీకి సహకరిస్తాను. నేను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యూకే, యూఎస్ఏ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. తిరిగి రాగానే విచారణకు హాజరవుతాయని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశాను”-కేటీఆర్

ఈడీ ఛార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరు

రాజకీయ ప్రతీకార దాహానికి, దానిని సాధించడానికి ఎలాంటి సంకోచం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న తీరుకు అభినందించాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 48 గంటల క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు కనిపించిందన్నారు.

బీఆర్ఎస్ చూసి భయం

“24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్ర నాయకులతో సఖ్యతగా కనిపిస్తారు. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నా బీజేపీ నాయకులు ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి చౌకబారు ప్రతీకార రాజకీయాల్లో తనను తాను నిరూపించుకుంటున్నారు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని భయపెడుతుందని నాకు తెలుసు. అందుకే ఈ ప్రయత్నాలన్నీ” – కేటీఆర్

కేటీఆర్ కు నోటీసులపై కవిత రియాక్షన్

‘తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం

కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది.

మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ప్రతీకార రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు ఆయన అభద్రతకు స్పష్టమైన సంకేతం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కల్పిత కేసులు కోర్టులో నిలబడవు లేదా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవన్నారు. తాము కేటీఆర్ తో నిలబడతామని, అంతిమంగా సత్యం గెలుస్తుందని ట్వీట్ చేశారు.

Bandaru Satyaprasad

TwittereMail
బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

KtrAcbFormula E Race CaseBrsTelangana NewsTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024