రేపు ఓటీటీలోకి రెండు సినిమాలు, ఓ సిరీస్.. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, సూపర్ హీరో జానర్లలో..

Best Web Hosting Provider In India 2024

రేపు ఓటీటీలోకి రెండు సినిమాలు, ఓ సిరీస్.. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, సూపర్ హీరో జానర్లలో..

ఓటీటీలోకి రేపు ఓ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం అడుగుపెట్టనుంది. అలాగే ఓ సూపర్ హీరో మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది.

రేపు ఓటీటీలోకి రెండు సినిమాలు, ఓ సిరీస్.. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, సూపర్ హీరో జానర్లలో..

ఓటీటీలో కొత్త కంటెంట్ చూద్దామని అనుకుంటున్న వారికి రేపు (మే 28) రెండు కొత్త చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. కన్నడ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అజ్ఞాతవాసి స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఓ పాపులర్ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ వెబ్ సిరీస్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. రేపు ఓటీటీలోకి రానున్న రెండు చిత్రాలు, సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

అజ్ఞాతవాసి (జీ5)

కన్నడ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ‘అజ్ఞాతవాసి’ మూవీకి థియేట్రికల్ రిలీజ్‍లో పాజిటివ్ టాక్ వచ్చింది. రంగనాయన రఘు, పావన గౌడ, సిద్ధు మూలిమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మోస్తరు హిట్ కొట్టింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. రేపు (మే 28) జీ5 ఓటీటీలో అజ్ఞాతవాసి చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఈ అర్ధరాత్రే స్ట్రీమింగ్ షురూ అవుతుంది.

అజ్ఞాతవాసి మూవీకి జనార్దన చిక్కన్న దర్శకత్వం వహించారు. ఓ మర్డర్ కేసు చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీ నరేషన్ డిఫరెంట్‍గా ఉంటుంది. రంగనాయన రఘు పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ఈ మూవీలో రఘు, పావన, సిద్ధుతో పాటు శరత్ లోహితస్వ, రవిశంకర్ గౌడ, యమున శ్రీనిధి కూడా కీలకపాత్రలు పోషించారు.

అజ్ఞాతవాసి స్టోరీలైన్

అజ్ఞాతవాసి సినిమా కథ 1990ల బ్యాక్‍డ్రాప్‍లో నల్కేరి అనే గ్రామంలో సాగుతుంది. పాతికేళ్లుగా హత్యే జరగని రికార్డు ఉండే ఆ గ్రామంలో ఓ ఘటన జరుగుతుంది. భూస్వామి అయిన శ్రీనివాసయ్య (శరత్ లోహితస్వ) హత్యకు గురవుతాడు. ఈ కేసును ఇన్‍స్పెక్టర్ గోవిందు (రంగనాయన రఘు) విచారణ చేపడతాడు. రోహిత్ (సిద్ధు), పంకజ (పావన గౌడ)పై అనుమానం ఉంటుంది. అసలు శ్రీనివాసయ్యను ఎవరు చంపారు? వారిద్దరిపై ఎందుకు అనుమానం వచ్చింది? వేరే వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మిస్టరీని గోవిందు ఎలా ఛేదించాడనేది అజ్ఞాతవాసి సినిమాలో ఉంటుంది. ఈ మూవీని రేపటి నుంచి జీ5లో చూడొచ్చు.

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్ (హాట్‍స్టార్)

హాలీవుడ్ సూపర్ హీరో సినిమా ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్’ ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఆంథోనీ మాకీ, డెనీ రెమీరెజ్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్ర సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి జులియస్ ఓనా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 28) జియో హాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది.

ఇప్పటికే ప్రైమ్ వీడియో సహా కొన్ని ఓటీటీల్లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూవరల్డ్ చిత్రం రెంటల్ విధానంలో వచ్చింది. అయితే, రేపు జియోహాట్‍స్టార్ ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హాట్‍స్టార్ సబ్‍స్క్రైబర్లు రెంట్ లేకుండా ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.

ఎఫ్1: ది అకాడమీ (నెట్‍ఫ్లిక్స్)

ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ‘ఎఫ్1: ది అకాడమీ’ రేపు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఎఫ్1 రేసులో అమ్మాయి పోటీపడడం ఈ డాక్యు సిరీస్‍లో ఉంటుంది. లీసా కేయన్ ఈ సిరీస్‍కు షోరన్నర్‌గా ఉన్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024