




Best Web Hosting Provider In India 2024

హ్యాపీ బర్త్‌డే మై లేడీ.. శోభితకు చై విషెస్.. ఫొటో వైరల్.. క్యూట్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు
నాగచైతన్య తన భార్య, నటి శోభిత ధూళిపాళ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు క్యూట్ అండ్ సింపుల్ విషెస్ తెలియజేశారు. ఫొటో పోస్టు చేశారు. ఈ ఫొటోకు ఫ్యాన్స్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
నటి శోభిత ధూళిపాళ నేడు (మే 31) తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె భర్త, నటుడు నాగచైతన్య ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక అందమైన ఫొటో పంచుకున్నారు. దీంతో అభిమానులు ఈ క్యూట్ జంటపై కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ ఫొటో వైరల్ గా మారింది.
నాగచైతన్య విషెస్
శోభితతో కలిసి దిగిన ఫొటోను నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. శోభితను చైతన్య దగ్గరగా పట్టుకుని సెల్ఫీకి ఫోజులివ్వడం ఆ ఫొటోలో కనిపించింది. చై బ్లాక్ టీ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి కనిపించగా.. శోభిత వైట్ ట్యాంక్ టాప్, మ్యాచింగ్ షేడ్స్ లో అదరగొట్టింది. ‘హ్యాపీ బర్త్ డే మై లేడీ’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు చైతన్య.
క్యూట్ కపుల్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెయిర్ పై ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు. ‘ఎంత క్యూట్ కపుల్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరొకరు ‘చాలా అందమైన జంట’ అని పేర్కొన్నారు. మరో అభిమాని ‘మీ ఇద్దరినీ ఆరాధిస్తాం’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘అత్యంత ప్రతిభావంతురాలు. చమత్కారం, అందమైన శోభితకు జన్మదిన శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ‘దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆ ఈవెంట్ లో
ఈ నెల ప్రారంభంలో ముంబయిలో జరిగిన వేవ్స్ 2025 సమ్మిట్ లో నాగ చైతన్య, శోభిత కలిసి కనిపించారు. బ్రౌన్ గోల్డ్ ఎంబ్రాయిడరీ చీరలో అలంకరించిన బ్లౌజ్ తో శోభిత అద్భుతంగా కనిపించింది. ఆమె తన జుట్టును సొగసైన బన్ లో కట్టుకుని, ఎరుపు రంగు సింధూరాన్ని ప్రదర్శిస్తూ కనిపించింది.
నాగచైతన్య, శోభిత 2024 డిసెంబర్ 4న వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో అభిమానులు కొత్త వధూవరులను చూసి మురిసిపోకుండా ఉండలేకపోయారు.
సినిమాలు ఇలా
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమాలో నాగ చైతన్య యాక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్య హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న వేటువం సినిమాలో శోభిత హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
సంబంధిత కథనం