




Best Web Hosting Provider In India 2024
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు అలర్ట్! అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 అడ్మిట్ కార్డ్ న్యూస్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 2025 జూన్ 5 నుంచి 24 వరకు జరుగుతుంది. హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జూన్ 5 నుంచి ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పరీక్షలను నిర్వహించనుంది. అంతకు ముందు బోర్డు అడ్మిట్ కార్డును విడుదల చేస్తుంది. సంబంధిత వర్గాల ప్రకారం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 అడ్మిట్ కార్డులు జూన్ 1 లేదా 2వ తేదీల్లో అందుబాటులోకి వస్తాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ప్రాంతీయ ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది?
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు.
“ఎగ్జామ్ సిటీ- డేట్ ఇంటిమేషన్ లింక్‌లో పేర్కొన్ని పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ-కాల్ లెటర్స్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు,” అని నోటిఫికేషన్లో ఉంది.
ఎగ్జామ్ సిటీ- తేదీ, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థుల కోసం ట్రావెల్ అథారిటీ డౌన్లోడ్ కోసం లింక్ అన్ని ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లలో పరీక్ష తేదీకి 10 రోజుల ముందు నుంచే ఇవ్వడం జరిగింది. పరీక్ష గురించి నోటిఫికేషన్ పేర్కొంది.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 పరీక్ష..
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1ను జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. సీబీటీ 1 పరీక్ష వ్యవధి 90 నిమిషాలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. జనరల్ అవేర్ నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 30 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
ఆ తర్వాత రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వర్తించే విధంగా), డాక్యుమెంట్ వెరిఫికేషన్/ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంస్థలో 8113 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ 1736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 ఖాళీలు ఉన్నాయి.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డు 2025: ఎల డౌన్లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మీ ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో, సీఈఎన్ 05/2024 కింద ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ అవ్వడానికి, సబ్మిట్ చేయడానికి మీ ఆధారాలను నమోదు చేయండి.
- మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- తదుపరి అవసరాల కోసం దానిని డౌన్లోడ్ చేసి, ప్రింటౌట్ తీసి పెట్టుకోండి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్బీల అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link