ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024


ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Anand Sai HT Telugu

ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల

్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వారి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ మెయిన్స్ పరీక్షను 2025 ఏప్రిల్ 10, 12 తేదీల్లో నిర్వహించారు. పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 40 నిమిషాల సమయం ఇచ్చారు. పరీక్షలో ఒక ప్రశ్నకు తప్పు సమాధానం ఇస్తే 1/4వ వంతు మార్కులను నెగెటివ్ మార్కింగ్ గా మినహాయిస్తారు. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షను 2025 ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1 తేదీల్లో నిర్వహించారు. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు 2025 మార్చి 28న విడుదలయ్యాయి.

ఎస్బీఐ క్లర్క్ ఖాళీలు

1. జనరల్ కేటగిరీ-5870 పోస్టులు

2.ఈడబ్ల్యూఎస్-1361 పోస్టులు

3.ఓబీసీ-3001 పోస్టులు

4.ఎస్సీ-2118 పోస్టులు

5.ఎస్టీ-1385 పోస్టులు

ఎంపిక విధానం

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆన్‌లైన్ మెయిన్ పరీక్షకు పిలుస్తారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్థానిక భాష పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపే సమయంలో స్థానిక భాషను పరీక్షిస్తారు.

ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ ఎలా చెక్ చేయాలి

1. మొదట మీరు sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన రిజల్ట్ ట్యాబ్ మీ క్లిక్ చేయాలి.

3. తర్వాత ఎస్బీఐ క్లర్క్ మెయిన్ రిజల్ట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

4. దీని తరువాత ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2025 పీడీఎఫ్ ఫైల్ మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.

5. తర్వాత ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2025 పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి.

6. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం మీ ఫలితాన్ని ప్రింట్ తీసుకోండి.

7. పూర్తి పేరు మరియు రోల్ నంబర్, పొందిన మార్కులు, అర్హత స్థితి, కట్-ఆఫ్ మార్కులు చూసుకోవాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link