ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో ఒకే ఒక్క తెలుగు మూవీ..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో ఒకే ఒక్క తెలుగు మూవీ..

Hari Prasad S HT Telugu

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియో సోమవారం (జూన్ 2) రిలీజ్ చేసింది. సినిమాల జాబితాలో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉండగా.. మరో రెండు మలయాళ సినిమాలు చోటు దక్కించుకున్నాయి.

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో ఒకే ఒక్క తెలుగు మూవీ..

ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మే 26 నుంచి జూన్ 1తో ముగిసిన వారానికిగాను ఈ లిస్ట్ వచ్చేసింది. టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. అంతేకాదు వాటికి వచ్చిన వ్యూస్ వివరాలను కూడా తెలిపింది.

టాప్ 5 సినిమాలు ఇవే

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాలో రెండు మలయాళం, ఒకటి తెలుగు, రెండు హిందీ మూవీస్ చోటు దక్కించుకున్నాయి. వీటిని కేవలం ఇండియన్ ఆడియెన్స్, కనీసం అరగంట పాటు చూసిన వ్యూస్ ఆధారంగా రూపొందించారు. వీటిలో తొలి స్థానంలో ఉన్నది మాత్రం మలయాళం రివేంజ్ థ్రిల్లర్ తుడరుమ్ (Thudarum). ఈ సినిమాకు గత వారం 2.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో తెలుగుతోపాటు మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక రెండోస్థానంలో సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ ఉంది. ఈ సినిమాకు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మూడోస్థానంలోనూ ఇదే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సల్మాన్ ఖాన్, రష్మిక సినిమా సికందర్ ఉంది. ఈ సినిమాకు 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

నాలుగో స్థానంలో మరో మలయాళం మూవీ చోటు దక్కించుకుంది. సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మరణమాస్ మూవీకి 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో హిందీ సినిమాయే అయిన ది డిప్లొమాట్ నిలిచింది. జాన్ అబ్రహం లీడ్ రోల్లో నటించిన ఈ రియల్ స్టోరీకి 1.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే

ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే టాప్ 5లో నాలుగు జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నవే ఉండటం విశేషం. వీటిలో అత్యధికంగా ఈ ఓటీటీలో ఉన్న క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్ కు 8.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. తొలి స్థానంలో ఈ సిరీసే చోటు దక్కించుకుంది. రెండో స్థానంలో జియోహాట్‌స్టార్ లోనే వచ్చిన హార్ట్ బీట్ సీజన్ 2 ఉంది. దీనికి 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

మూడోస్థానంలో జియోహాట్‌స్టార్ లోని ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 వెబ్ సిరీస్ 2.1 మిలియన్ల వ్యూస్ తో ఉంది. నాలుగో స్థానంలో ఇదే ఓటీటీలో ఉన్న హై జునూన్ డ్రీమ్ డేర్ డామినేట్ 2 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఐదోస్థానంలో గతవారమే సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చిన కంఖజురా వెబ్ సిరీస్ 1.8 మిలియన్ల వ్యూస్ సాధించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024