తెలంగాణ టెట్ హాల్ టికెట్లపై అప్డేట్ – ఈనెల 15 నుంచి పరీక్షలు

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ టెట్ హాల్ టికెట్లపై అప్డేట్ – ఈనెల 15 నుంచి పరీక్షలు

 

తెలంగాణ టెట్ పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9న తేదీన విడుదల కానున్నాయి. జూన్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఈసారి మొత్తం 1,83,653 మంది అప్లికేషన్ చేసుకున్నారు.

 
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2025
 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 9వ తేదీన విడుదల చేయనుంది. మరోవైపు ఈ నెల 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి.

 

మొత్తం 1,83,653 దరఖాస్తులు..!

ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్‌-1కు 63,261 , పేపర్‌-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.

ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలతో సులభంగా పొందవచ్చు.

జూలై 22న టెట్ ఫలితాలు…

తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్‌ తుది ఫలితాలను ప్రకటిస్తారు.

అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

 
 

Best Web Hosting Provider In India 2024