గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ప్రభావతిని చెట్టుకు కట్టేసి కొడతామన్న బస్తీ ఆడవాళ్లు- మీనాపై గుణ రివేంజ్ ప్లాన్!

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ప్రభావతిని చెట్టుకు కట్టేసి కొడతామన్న బస్తీ ఆడవాళ్లు- మీనాపై గుణ రివేంజ్ ప్లాన్!

 

గుండె నిండా గుడి గంటలు జూన్ 4 ఎపిసోడ్‌లో పూల దండలు కట్టడానికి మీనా ఇంటికి బస్తీ వాళ్లు వెళ్తారు. మీనాను పని మనిషి అని ప్రభావతి అనడంతో బస్తీ వాళ్లు గొడవకు దిగుతారు. చెట్టుకు కట్టేసి కొడతామంటూ దుమ్ముదులుపుతారు. రోహిణి అప్పు తీర్చడం తెలిసి మనోజ్ ప్రేమగా భార్యను హగ్ చేసుకుంటాడు.

 
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 4 ఎపిసోడ్‌
 

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఆటోలో మీనాతో బాలు వస్తాడు. వీళ్లిద్దరి మధ్య దూరం ఉంది. ఎలాగైనా కలపాలని అనుకుంటుంది మీనా చెల్లెలు. తను ఎక్కడ కూర్చోవాలనేదానిపై బాలుతో సరదాగా గొడవ పడుతుంది. ఇద్దరు పంచ్‌లు వేసుకుంటారు. అక్కడ చోట ఎక్కడుందని మీనా చెల్లెలు అంటుంది.

 

కాల్ చేసి వద్దను

మీ అమ్మ అంటే ఆలోచించాలు గానీ నీకేంటీ పిట్టలా ఉన్నావ్ అని బాలు మెల్లిగా అంటాడు. బావ ఏదో తిడుతున్నాడు అని చెప్పిన మీనా చెల్లెలు మీనాను ముందు దిగమంటుంది. దాంతో మీనా దిగుతుంది. ఏం చేస్తుందే మీ చిన్నగంప అని బాలు అంటాడు. నువ్వెళ్లి బావ పక్కన కూర్చో. బావ లోపలికి జరుగు అని మీనా చెల్లెలు అంటుంది. దాంతో బాలు పక్కన మీనా కూర్చొంటుంది.

అమ్మ ఎక్కడ అని మీనా అడిగితే.. ఇంటికి వస్తానంది అని మీనా చెల్లెలు చెబుతుంది. అమ్మో అక్కడికా. వద్దు మనమున్నాంగా. కాల్ చేసి వద్దని చెప్పు అని మీనా అంటుంది. రోడ్డుపై గుంతలు ఎక్కువ ఉండటంతో బాలు, మీనా ఒకరికొకరు తాకుతుంటారు. అది చూసి సంతోషించిన మీనా చెల్లెలు మీరిద్దరు ఇలాగే కలిసి ఉండాలి అనుకుంటుంది. మరోవైపు ప్రభావతి ఇంటికి మీనా అంటూ కొంతమంది ఆడవాళ్లు వస్తారు.

పూలకొట్టు పెట్టినప్పుడు వచ్చాం గుర్తు పట్టారా అని వాళ్లు అంటే.. అప్పుడొచ్చారా. గుర్తు పెట్టుకోడానికి మీరేమైనా సినిమా యాక్టర్సా అని ప్రభావతి అంటుంది. మీరేమైనా సినిమా యాక్టరా మేము గుర్తుపెట్టుకోలేదా అని అందులో ఒకామే అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్. అసలు ఎందుకు వచ్చారు అని ప్రభావతి కోప్పడుతుంది. మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చిందిగా. పని చేయడానికి రమ్మంది అని ఆమె చెబుతుంది.

 

బస్తీ వాళ్లతో గొడవ

అదే ఒక పని మనిషి. మీరంతా దానికింద మీరు పనిచేయడానికి వచ్చారా అని ప్రభావతి అంటుంది. ఏయ్.. ఏమన్నావ్. మా మీనా పని మనిషా అని ప్రభావతిని కొట్టడానికి అన్నట్లుగా ఒకామే అంటుంది. ఈ కడుపుకు మీనా పెట్టింది తింటున్నారుగా. అలా అనడానికి నోరెలా వచ్చింది. మీ కోడలిని పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడుతావా అని బస్తీవాళ్లు అంటారు.

ఏంటీ మీద మీదకు వస్తున్నారు అని ప్రభావతి అంటుంది. మీనా అంటే ఏమనుకున్నావ్. మా బస్తీలో మా అమ్మాయిలా చూస్తాం. ఎంతమంచి మనసు గల పిల్లో తెలుసా. పూలకొట్టుకు నీ పేరు పెట్టుకుంది. కాస్తా కూడా ఇంగితజ్ఞానం లేదా నీకు. మీనాను పని మనిషి అన్నావ్. మిమ్మల్ని వంట మనిషి అంటే ఊరుకుంటారా. కక్కుసులు కడిగే మనిషి అంటాం ఊరుకుంటావా అని ప్రభావతితో బస్తీ వాళ్లు గొడవకు దిగుతారు.

మీనాలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. మీనా అత్తవి కాబట్టి బతికిపోయావ్ ఇంకొకరు అయితే నాలిక కోసి పడేస్తాం ప్రభావతికి ఇచ్చిపడేస్తారు బస్తీవాళ్లు. మీనా నాలుగు రాళ్లు సంపాదిస్తుంది. నువ్వేం చేస్తున్నావ్. తని కూర్చొంటున్నావ్ అని అంటారు. తిని కూర్చుని పొగరెక్కి మాట్లాడుతుంది అని ఒకామే అంటుంది. నా ఇంటికి వచ్చి అని ప్రభావతి అంటుంటే.. ఆపమ్మా చచ్చేముందు పట్టుకెళ్తావా అని అంటారు.

 

బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లుంది

ఒకామే ఆపుతుంది. ఇదే మాట మన బస్తీకొచ్చి మీనాను అంటే ఊరుకుంటామా చెట్టుకు కట్టేసి కొడతాం. నేనైతే నాలుక బయటకు లాగి పూలదండలా కుట్టేసేదాన్ని. ఇప్పుడు అను. మీనా గురించి ఒక్క మాట తప్పుగా అను అని బస్తీ వాళ్లు వార్నింగ్ ఇస్తారు. అమ్మో ఆ మీనా వీళ్లందరికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్లుంది. అన్నంత పని చేసేలా ఉన్నారు. దాని సంగతి వచ్చాక చెబుతా అని భయపడి లోపలికి వెళ్లిపోతుంది ప్రభావతి.

తర్వాత రోడ్డు మీద మనోజ్‌ను చూసి పార్క్ ఫ్రెండ్ కనిపించి మీ భార్య నీ డబ్బు వడ్డీతో కట్టేసింది. నువ్ గాలోడివి అయినా నీ వైఫ్ గ్రేట్ బ్రూ. అలాంటి వైఫ్ దొరకడం నీ అదృష్టం అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో వెళ్లి రోహిణిని ప్రేమగా చూసి హగ్ చేసుకుంటాడు. నువ్ ఎంత మంచి వైఫూ తెలిసింది. నా ఫ్రెండ్ కనిపించాడు. నా అప్పు తీర్చేశావని చెప్పాడు. నా నుంచి నీకు రూపాయి రాలేదు. కానీ, నువ్వు నాకు అప్పులు లేకుండా చేస్తున్నావ్ అని మనోజ్ అంటాడు.

నీ ప్రాబ్లమ్ వస్తే నేను తీర్చాలి. నాకు వస్తే నువ్వు తీర్చాలి. డీల్ ఓకేనా అని రోహిణి అంటుంది. నా మీద కోపం లేనట్లేనా అని మనోజ్ అడుగుతాడు. నీ మీద నాకు కోపం వచ్చే అర్హత ఉందా. నువ్ అబద్ధం చెప్పావ్. కానీ, నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నా అని మనసులో గిల్టీగా ఫీల్ అవుతుంది రోహిణి. నీ మీద ఎందుకు కోపం ఉంటుంది. ఏదైనా నాకు చెప్పు. దాచకు. ఇకనుంచి మన మధ్య సీక్రెట్స్ వద్దు అని రోహిణి అంటుంది.

 

బ్యాంక్ లోన్

ఈ పెళ్లి నాకు రెండో జన్మ. ఇక నేను ఏ సీక్రెట్ దాచను అని రోహిణి చెబుతుంది. బ్యాంక్ లోన్ గురించి అని మనోజ్ అంటే అది నేను చూసుకుంటా అంటుంది రోహిణి. మరోవైపు తన మాటలతో మౌనికను బాధపెడుతాడు సంజు. నేను నీకు పెట్టే టార్చర్ సరిపోవట్లేదనుకుంటా. నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తా. దాంతో నువ్ పుట్టింటికి వెళ్లాలి. నీ బాలు అన్న వాడిని అస్సలు వదిలిపెట్టను అని సంజు అంటాడు.

మీరు ప్రతికారంతో రగిలిపోతున్నారు. ఓసారి పాజిటివ్‌గా ఆలోచించండి. ఒక్కసారి ప్రేమగా ఉండండి. అప్పుడు అర్థం అవుతుందని మౌనిక అంటుంది. నా నుంచి నీ వాళ్లను కాపాడుకోడానికి ఈ ప్రయత్నం ఏం ఫలించదు అని చెప్పేసి వెళ్లిపోతాడు సంజు. మరోవైపు ఇంటికి బాలు వాళ్లు వస్తారు. వాకిట్లో పూలు కడతామని అనుకుంటారు. గుమ్మంలో ఇదేంటీ ఇక్కడ కడతారా అని ప్రభావతి గొడవ చేస్తే బాలు కౌంటర్ వేస్తాడు.

మీ అమ్మ చెప్పింది కరెక్టేరా అని సపోర్ట్ చేసిన సత్యం ఇక్కడ ఎందుకు వచ్చిపోయేవాళ్లకు ఇబ్బంది. మంచిగా హాల్లో కట్టుకోండి అని అంటాడు. నువ్ సూపర్ నాన్న అని బాలు అంటాడు. ఇంట్లో హాల్లో పూలు వేసి పని స్టార్ట్ చేస్తారు బస్తీ వాళ్లు. మనింట్లో మనకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు అని మనోజ్ అంటాడు. బాలు, మీనా ఏం చదువుకోకపోయిన ఒక్కరాత్రిలో రెండున్నర లక్షల పని చేయబోతున్నారు అని సత్యం అంటాడు.

 

గుణ రివేంజ్ ప్లాన్

దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు నుంచి విడిపించాలి అని ప్రభావతి అనుకుంటుంది. మరికొన్ని పూలు తీసుకురావాలని మీనా, బాలు వెళ్తారు. వీళ్లందరికి టీ పెట్టమని ప్రభావతికి సత్యం చెబుతాడు. దాంతో వంటింట్లోకి వెళ్లిన ప్రభావతి కామాక్షికి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. తర్వాత టీ పెడుతుంది ప్రభావతి. ఈ పని అంతా ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పెడతాం. మంచి మార్కెట్ అవుతుందని సుమతి చెబుతుంది.

మంచి ఐడియా ఇచ్చిందని సత్యం మెచ్చుకుంటాడు. ఆ ఫొటోలను మనోజ్‌ను తీయమంటాడు సత్యం. కెనడా వెళ్లడానికి ప్రిపేర్ కావాలని మనోజ్ అంటే అదేంకాదు తీయమని చెబుతాడు సత్యం. మరోవైపు మీనా చేసే ఐదు వందలు మాలలు మండపానికి చేరకూడదని, ఇదే పర్ఫెక్ట్ రివేంజ్ అని ప్లాన్ చేస్తాడు గుణ. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Best Web Hosting Provider In India 2024