





Best Web Hosting Provider In India 2024

ఈ బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ కొత్త సీజన్‌ను ముందే చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఇక్కడ మీ ఓటు వేయండి
ప్రైమ్ వీడియోలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 4 జులై 2న వస్తుందని అనౌన్స్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఈ కొత్త సీజన్ ను ముందే చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్.
పంచాయత్ వెబ్ సిరీస్ మేకర్స్ మరోసారి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. గతేడాది మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీ రివీల్ చేయడానికి సొరకాయల ప్రయోగం చేసిన వాళ్లు.. ఇప్పుడు ఓటు వేయండంటూ మరో ఆఫర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందు చెప్పిన జులై 2 కంటే ముందే ఈ పంచాయత్ 4వ సీజన్ చూడాలనుకుంటే ఇలా చేయండంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
పంచాయత్ సీజన్ 4 ముందే వస్తుందా?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ (Panchayat). ఇప్పుడు నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 2న తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. కానీ గురువారం (జూన్ 5) ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేస్తూ.. ముందే తీసుకురానున్నట్లు హింట్ ఇచ్చారు.
అయితే అలా జరగాలంటే అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. అది ఎలా అంటే.. ఈ కొత్త సీజన్ ను జులై 2 కంటే ముందే చూడాలనుకుంటే.. panchayatvoting.com లోకి వెళ్లి ఓటు వేయాలని ఈ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేసిన జితేంద్ర కుమార్ రిక్వెస్ట్ చేశాడు. ఆ ఓటింగ్ ఎలా చేయాలో ఓ ఫన్నీ వీడియో ద్వారా మేకర్స్ తెలిపారు.
మంజు దేవి vs క్రాంతి దేవి
పంచాయత్ నాలుగో సీజన్లో ఫులేరా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలుసు కదా. ఈసారి ఆ గ్రామానికి కొత్త సర్పంచ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలను గుర్తు చేసేలా ఈ వీడియో రూపొందించారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం సర్పంచ్ గా ఉన్న మంజు దేవి, కొత్తగా పోటీ చేస్తున్న క్రాంతి దేవి ఈ వీడియోలో తమ ప్రచారం కోసం రెండు పాటలను రెడీ చేసుకోవడం చూడొచ్చు. వాటిలో తమను గెలిపిస్తే ఊరి కోసం ఏం చేస్తారో చెప్పారు.
చివర్లో ఎంట్రీ ఇచ్చిన జితేంద్ర.. ఈ హామీలు సరే గానీ పంచాయత్ ప్రేక్షకుల కోసం ఏమిస్తారు అని అడుగుతాడు. అప్పుడు మంజు దేవి ముందుకు వచ్చి తమను గెలిపిస్తే నాలుగో సీజన్ ను జులై 2 కంటే ముందే తీసుకొస్తామని హామీ ఇస్తుంది. ఇక క్రాంతి దేవి మరో అడుగు ముందుకేసి తనను గెలిపిస్తే అంతకంటే ముందే తీసుకొస్తామని చెబుతుంది. మరి ఈ సిరీస్ ను ముందుగానే ప్రైమ్ వీడియోలోకి రావాలంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో ప్రేక్షకులే తేల్చుకోవాల్సి ఉంది.
సంబంధిత కథనం