బ్రహ్మముడి జూన్ 7 ఎపిసోడ్: కావ్యను కాపాడిన అప్పు, రౌడీలకు కోటింగ్- ఎల్లుండే యామినితో రాజ్ పెళ్లి- ఇంట్లోవాళ్లకు ఏడుపు!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 7 ఎపిసోడ్: కావ్యను కాపాడిన అప్పు, రౌడీలకు కోటింగ్- ఎల్లుండే యామినితో రాజ్ పెళ్లి- ఇంట్లోవాళ్లకు ఏడుపు!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 7 ఎపిసోడ్‌లో అడవిలో పండ్లు తిని మత్తులో నిద్రపోతారు కావ్య, రాజ్. అది చూసిన రౌడీలు వచ్చి కావ్యను చంపబోతుంటే అప్పు వచ్చి కాపాడుతుంది. రౌడీలను చెట్టుకు కట్టేసి ఎంక్వైరీ చేస్తుంది అప్పు. ఎల్లుండే యామినితో రాజ్ పెళ్లి అని వైదేహి చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 7వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అడవిలో దొరికిన పళ్లను రాజ్ తీసుకొచ్చి కావ్యకు ఇస్తాడు. అవి తిన్న రాజ్, కావ్య ఇద్దరికి మత్తు వస్తుంది. తల తిరుగుతుంది. కన్యాకుమారి కనపడద దారి అనే పాట వస్తుంటే ఇద్దరు మత్తులో తూగుతారు. మత్తులో తూగిన రాజ్, కావ్య అక్కడే నిద్రపోతారు. వాళ్లను కిల్లర్ గ్యాంగ్ చూస్తుంది. లేట్ ఎందుకు లేపేద్దామని కత్తి పట్టుకుని ముందుకు వెళ్తాడు కిల్లర్.

కావ్యను పినీష్ చేసి ఉంటారు

మరోవైపు అప్పు వాళ్లు రాజ్, కావ్యను వెతుకుతుంటారు. కావ్యను యామిని ఆర్డర్ ఇచ్చిన కిల్లర్ పొడిచినట్లు చూపిస్తారు. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం దుగ్గిరాల ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. మీరు ఎంత ప్రయత్నించినా వాళ్లు మీకు దొరకరు. యామిని చెప్పినదాని బట్టి చూస్తే ఆ రౌడీలు కావ్యను ఫినీష్ చేసి ఉంటారు. కావ్య శవం ముందు కూర్చుని రాజ్ ఏడుస్తూ ఉంటాడు అని రుద్రాణి అనుకుంటుంది.

అపర్ణ కంగారుపడుతుంటే అప్పు పోలీసులను తీసుకెళ్లిందిగా. అప్పు కచ్చితంగా తీసుకొస్తుంది అని సుభాష్ అంటాడు. అలా అబద్ధం చెబుతున్నావా. నిన్ను నువ్ మోసం చేసుకుంటున్నావా. వెళ్లింది ఏమైనా రాణి రుద్రమదేవినా. నిన్న గాక మొన్న జాయిన్ అయింది అప్పు. అప్పుడేమే శ్రీశైలం వెళ్లి రాజ్ తప్పిపోయాడు. ఇప్పుడు ఇద్దరు తప్పిపోయారు. వాళ్లకు ఏదో జరిగే ఉంటుంది. అప్పుకు తెలిసి కూడా చెప్పకుండా తిరుగుతుంటుంది అని రుద్రాణి అంటుంది.

నోట్లో పాయిజన్ పోస్తా

ఏదైనా మంచి ఫినాయిల్‌తో శుభ్రం చేసుకో. ఇంకొక్క మాట మాట్లాడితే నోట్లో పాయిజన్ పోస్తాను. వెళ్లు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి వెళ్లిపోతుంది. కానీ, అపర్ణ మాత్రం మరింత టెన్షన్ పడుతుంది. మరోవైపు కిల్లర్ కాల్ చేయలేదని యామిని కంగారుపడుతుంది. రాత్రి కావ్యను ఏమో చేయబోతున్నావ్ ఏంటే అది అని తల్లి వైదేహి అడుగుతుంది.

ఆ కావ్యను డైరెక్ట్ పంపించేస్తున్నాను. కావ్యను చంపమని రౌడీలకు సుపారీ ఇచ్చాను అని యామిని చెబుతుంది. దాంతో వైదేహి షాక్ అవుతుంది. ప్రతిసారి అది అడ్డుపడుతుంది. అందుకే శాశ్వతంగా తప్పిద్దామని ఇలా చేశా. ఈపాటికి రౌడీలు కావ్యను చంపేసి ఉంటారు అని కాల్ చేస్తుంది యామిని. కానీ, కాల్ కలవకపోవడంతో కోపంగా వెళ్లిపోతుంది.

రాను రాను నా కూతురు ప్రేమ పైశాచికంగా తయారవుతుంది అని వైదేహి అనుకుంటుంది. మరోవైపు రాజ్ నిద్రలేస్తాడు. రౌడీలు చెట్టుకు కట్టేసి ఉంటారు. రౌడీలను చూసి సంతోషంతో కావ్యను లేపుతాడు రాజ్. మీరు కామన్ కళావతి గారు కాదు సింగం కళావతి గారు. మీరు చేసిన పనికి పిచ్చోడిని అయిపోయాను. రాత్రంతా మనల్ని చేస్ చేసిన రౌడీలను కట్టేశారు అని రాజ్ అంటాడు.

అప్పు ఎంట్రీ

నేను కట్టేయలేదు అని కావ్య అంటుంది. మరి ఎవరు కట్టేశారు అని ఇద్దరు అనుకుంటే నేను అని అప్పు చెబుతుంది. దాంతో జరిగింది చెబుతుంది అప్పు. ఈ రౌడీలు మీ వెంట ఎందుకు పడ్డారు అని అప్పు అడిగితే గొడవ గురించి చెబుతుంది కావ్య. తర్వాత రాజ్, కావ్య వెళ్లిపోతారు. ఎవరు అటాక్ చేయమని మీకు చెప్పారు అని అప్పు అడుగుతుంది. రౌడీలు సైలెంట్‌గా ఉండటంతో స్టేషన్‌కు తీసుకెళ్లి కోటింగ్ ఇవ్వమని చెబుతుంది అప్పు.

ఇంటికి కావ్య వెళ్తుంది. నా మనవడు ఉండగా కావ్యకు ఏం కాదు అని ఇందిరాదేవి అంటే..కాపాడటం కాదు నాచేత ఏవో పిచ్చి కాయలు తినిపించాడు అని చెబుతుంది. ఏంటీ పిచ్చి కాయలా అని ఇందిరాదేవి షాక్ అవుతుంది. దాంతో కావ్య జరిగింది చెబుతుంది. సరే, నా మనవడు ఐ లవ్యూ యు చెప్పాడా అని ఇందిరాదేవి అడుగుతుంది. కనీసం ఐ లైక్ యూ అని కూడా చెప్పలేదని కావ్య అంటుంది.

వీడేంటే సిక్స్ కొడతాడనుకున్న ప్రతిసారి డకౌట్ అవుతున్నాడు అని ఇందిరాదేవి డల్ అవుతుంది. రాత్రి ఉన్న టెన్షన్‌కు లవ్ ప్రపోజ్, డ్యూయెట్‌కు ఏమైనా ఛాన్స్ ఉందా, కంగారుపడ్డామో తెలుసా అని కావ్య అంటుంది. నిన్న రాత్రి జరిగింది, ఇప్పుడు చెప్పేది చూస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది అని ప్రకాశం అనుమానిస్తాడు. అసలు ఆ రౌడీలు ఎవరు. ఆ గొడవ వల్లే రాత్రంతా మిమ్మల్ని వెతకరు. ఇంకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని సుభాష్ అంటాడు.

రేపు ఇచ్చే సర్‌ప్రైజ్

అది నేను కనిపెడతా అని అప్పు అంటుంది. అప్పుకు దొరికితే అప్పడమే అని స్వప్న అంటుంది. కల్యాణ్ వచ్చి అప్పుకు కంగ్రాట్స్ చెబితే ఇందిరాదేవి కౌంటర్ వేస్తుంది. దాంతో అంతా నవ్వుతారు. అది చూసిన రుద్రాణి ఎంత నవ్వుకుంటారో నవ్వుకోండి. రేపటి నుంచి ఎలాగు ఏడవాల్సిందే కదా. రేపు యామిని ఇచ్చే సర్‌ప్రైజ్‌కు మీ గుండెలు పగిలిపోతాయ్ అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు రాజ్ యామిని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో డెకరేషన్ జరుగుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. ఏంటిదని అడుగుతాడు. బ్యాండ్ మేళం సెలబ్రేషన్స్ ఉన్నాయని యామిని తండ్రి అంటాడు. అప్పుడే మర్చిపోయారా ఎల్లుండే మీ పెళ్లి అని యామిని తల్లి వైదేహి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024