





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 7: దశరథ్ను నాన్న అని పిలిచిన దీప.. షాకై కొట్టబోయిన జ్యోత్స్న.. అడ్డుకున్న కార్తీక్
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 7: శౌర్యతో కాల్ మాట్లాడుతుంటే దీప నుంచి ఫోన్ లాక్కుంటుంది జ్యోత్స్న. మంతు తాగుదామని కాశీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన శ్రీధర్‌పై స్వప్న ఫైర్ అవుతుంది. దశరథ్ను నాన్న అంటుంది దీప. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జూన్ 7, 2025) ఎపిసోడ్లో.. దాసును జ్యోత్స్న కొట్టడం కళ్లారా చూశానని, ఆ బాధను మనసులోనే మోస్తున్నానని కార్తీక్‌తో దశరథ్ చెబుతాడు. ఒకవేళ నేను పోతే ఈ నిజం నాతోనే పోకూడదు అని అంటాడు. నీకేం అవుతుంది మామయ్య.. ఇప్పుడు నేను ఉన్నా కదా అని కార్తీక్ చెబుతాడు. “ముందు దాసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. వాడికి గతం గుర్తొస్తే జ్యోత్స్న వాడిని ఎందుకు చంపాలనుకుందో తెలుస్తుంది రా” అని దశరథ్ అంటాడు. “దీప నీ కూతురు, అది మీకు చెప్పకుండా దాసును జ్యోత్స్న చంపాలనుకుంది. ఆ విషయం మీకు ఇప్పుడే చెప్పను” అని లోలోపల ఆలోచిస్తాడు కార్తీక్. కన్నతండ్రిని కాబట్టి జ్యో చేసిన పనితో బాధను గుండెల్లో మోస్తున్నా.. నిజం తెలిస్తే మీ అత్తయ్య పరిస్థితి ఆలోచించు అని దశరథ్ బాధగా చెబుతాడు.
జ్యోత్స్న నీ టైమ్ దగ్గర పడింది
ముందు నిజాలు తెలుసుకున్న తర్వాతే ఏం చేయాలో ఆలోచిద్దామని దశరథ్ అంటాడు. ముందు దాసును కనిపెట్టేందుకు ప్రయత్నించు అని చెబుతాడు. అలాగే అంటాడు కార్తీక్. నా వల్ల కాకుంటేనే మీకు చెబుతానని, దాసు మామయ్యకు ఏం కాదని చెబుతాడు. మీరేం పాపం చేశారని ఇంత బాధ అనుభవించాలి అంటూ కార్తీక్ బాధపడతాడు. ఇంకెంతో కాలం నిన్ను బాధపెట్టను, జ్యోత్స్న నీ టైమ్ దగ్గర పడిందని మనసులో అనుకుంటాడు.
దీప ఫోన్ లాక్కున్న జ్యోత్స్న
అమ్మానాన్న అని కార్తీక్, దీప కోసం శౌర్య అరుస్తుంది. బయటికి వెళ్లారని చెప్పా కదా అని అనసూయ అంటుంది. అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారో తెలుసా అని కాంచనను శౌర్య అడుగుతుంది. వాళ్లు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని మారాం చేస్తుంది. ఎక్కడికైనా వెళ్లిపోతానని బెదిరిస్తుంది. దీంతో దీపకు ఫోన్ చేసి శౌర్యకు ఇస్తుంది కాంచన. శౌర్యనే కాల్ చేసి ఉంటుందని దీప అనుకుంటుంది. శౌర్య.. అమ్మ గుర్తొచ్చిందా అని దీప అడుగుతుంది. ఎక్కడ ఉన్నారని శౌర్య అడుగుతుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోత్స్న.. దీప ఫోన్ లాక్కుంటుంది. వర్క్ టైమ్‌లో ఫోన్ మాట్లాడేందుకు వీలులేదని కర్కశత్వం చూపుతుంది. మాట్లాడేందుకు నా పర్మిషన్ తీసుకోవాలని, వర్క్ ఫినిష్ చేసిన తర్వాతే ఫోన్ అని జ్యో అంటుంది. నువ్వు మరీ ఇంత మూర్ఖంగా తయారయ్యేవేంటి.. శౌర్య ఎంత బాధపడుతుందో అని దీప అనుకుంటుంది. అమ్మ జ్యో వాళ్ల ఇంట్లో ఇందా.. ఫోన్లో జ్యో గొంతు వినిపించిందని కాంచనతో శౌర్య అంటుంది.
అందరూ వచ్చేయండి
ఆ తర్వాత కార్తీక్‌కు శౌర్య ఫోన్ చేస్తుంది. అమ్మ.. జ్యో వాళ్ల ఇంట్లో ఉందా అని శౌర్య అడుగుతుంది. నీకెవరు చెప్పారని కార్తీక్ అడిగితే.. అమ్మకు కాల్ చేస్తే జ్యో మాట వినిపించి కాల్ కట్ అయిందని చెబుతుంది. ఆడుకొని త్వరగా పడుకో అని కార్తీక్ అంటాడు. త్వరలో పంపించండని కూతురిని అడ్డుపెట్టుకొని చెబుతున్నాడని శివన్నారాయణ వెటకారంగా అంటాడు. నేను అక్కడికి వస్తానని శౌర్య అడుగుతుంది. వస్తే మీరు చేసే పనులు తెలుస్తాయని శివన్నారాయణ అంటాడు. నీ పని చెబుతా ఉండు అనుకొని.. నువ్వే కాదు అందరూ వచ్చేయండని కార్తీక్ చెబుతాడు. అందరినీ అంటున్నావ్.. నా వాళ్లనా అని శివన్నారాయణ అంటే.. మనవాళ్లు అని కార్తీక్ చెబుతాడు. వచ్చేది నీ కూతురు, నా కూతురు అని, త్వరలోనే మనవాళ్లు ఎవరో తెలుస్తుందని తనలో తాను అనుకుంటాడు కార్తీక్.
నాన్న మనల్ని ఇంటికి రమ్మన్నాడని కాంచనతో శౌర్య చెబుతుంది. ఆటోలో త్వరగా వెళదాం పదా అని చెబుతుంది. ఆ ఇంటికి ఏం వెళతాం అని అనసూయతో కాంచన అంటుంది. కార్తీక్ బాబే చెప్పాడు కదా.. వెళదాం అని అనసూయ అంటుంది. సరేనంటుంది కాంచన.
కాశీని బుట్టులో వేసుకునేందుకు శ్రీధర్ ప్లాన్
అల్లుడు కాశీని తన దారిలోకి తెచ్చుకునేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తాడు. నా పెళ్లాం నీరు, నీ పెళ్లాం నోరు మూయించాలంటే.. నిన్ను నాలో తయారు చేయాలని శ్రీధధర్ అనుకుంటాడు. అల్లుడు అని శ్రీధర్ ప్రేమగా పిలువడంతో కాశీ ఆశ్చర్యపోతాడు. మందు తాగడం, పేకాట, పబ్‌కు వెళ్లే అలవాట్లు ఉన్నాయా అని శ్రీధర్ అడుగుతాడు. తనకు అలాంటి అలవాట్లు లేవని కాశీ అంటాడు.
నీకు కొంచెమైనా బుద్ధి ఉందా..
నీకు మందు, సిగరెట్, పేకాట లాంటి అభిరుచుల్లో నీకు అరంగేట్రం చేయిస్తా, పెళ్లానికి బయపడే వాడు మగాడే కాదని కాశీతో శ్రీధర్ చెబుతాడు. ఈ మాటలను వెనుక నుంచి వింటారు స్వప్న, కావేరి రోజూ గొడవ పడుతుందని, తాను రోజూ పబ్‌కు వెళ్లి మందు తాగి పేకాడతాననేలా శ్రీధర్ అంటాడు. ఇంట్లో కూడా తాగుతానని, నా గదిలో మినీ బార్ ఉందని చెబుతాడు. తాగుదాం పదా అని అంటాడు.
నాన్న నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని కోపంగా అంటుంది స్వప్న. అల్లుడిని మామగారు తాగు అంటూ చెడగొడుతున్నాడని శ్రీధర్‌పై ఫైర్ అవుతుంది. కావేరి కూడా కోప్పడుతుంది. దాసు ఎక్కడ ఉన్నాడో వెతక్కుండా అత్తారింట్లో భోగం అనుభవించండి అని కాశీతో వెటకారంగా అంటాడు శ్రీధర్. దాసు మామయ్యను జాగ్రత్తగా చూసుకుంటానని కార్తీక్ అన్నయ్య చెప్పాడని స్వప్న చెబుతుంది. అయితే, దాసు ఎక్కడ ఉన్నాడో కార్తీక్‌కు తెలుసా అని శ్రీధర్ అంటాడు. ఎలా తెలుసుంది మామయ్య అని కాశీ అడుగుతాడు. అది నాకెలా తెలుస్తుందని శ్రీధర్ అంటే.. తెలియకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నారని కావేరి వారిస్తుంది. ఇంతకీ దాసు సంగతేంటి, కనిపెట్టాలి అని ఆలోచిస్తాడు శ్రీధర్.
దశరథ్ను పట్టుకున్న దీప.. నాన్న అంటూ..
ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగుతుంటాడు దశరథ్. ఇంతలో తూలి కింద పడబోతాడు. కాఫీ పట్టుకొని వస్తున్న దీప.. వెంటనే దశరథ్ను కిందపడకుండా పట్టుకుంటుంది. ‘నాన్న’ అని అంటుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పారిజాతం కూడా అవాక్కవుతుంది. “ఇలా చేసుకోకుండా దిగుతున్నావేంటి నాన్న.. పడిపోతే” అని దీప అంటుంది. దశరథ్.. కన్నతండ్రి అని దీపకు నిజం తెలిసిందా అని కంగారు పడుతుంది.
దీపపై చేయి ఎత్తిన జ్యో.. అడ్డుకున్న కార్తీక్
ఈ ఇంటి పని మనిషివి.. మా నాన్నను నువ్వు నాన్న అని పిలుస్తువా అని దీపపై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. దీపను కొట్టేందుకు చేయి ఎత్తుతుంది. ఇంతలో జ్యోత్స్న చేయి పట్టుకొని అడ్డుకుంటాడు కార్తీక్. ఎందుకు నా మనవరాలి చేయి పట్టుకున్నావని శివన్నారాయణ అంటాడు. ఆ చేయి పట్టుకోకపోతే జ్యో చేయి దీప చెంపపై ఉండేదని కార్తీక్ అంటాడు. ఏం జరిగిందని సుమిత్ర అడిగితే.. పడిపోబోతే దీప నన్ను పట్టుకుందని దశరథ్ చెబుతాడు.
నీ దవడ పగులగొట్టి నిజం చెప్పాలనుంది
దశరథ్ను పట్టుకొని కన్నతండ్రి అయినట్టు నాన్న అని దీప పిలుస్తోందని పారిజాతం అంటుంది. పిలిస్తే ఏమవుతుందని కార్తీక్ అడుగుతాడు. నీ కూతురు వేరేవాళ్లను నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుందని జ్యోత్స్న అడుగుతుంది. దానికీదీనికి సంబంధం ఏంటి అని కార్తీక్ బదులిస్తాడు. నా కళ్ల ముందే నా తండ్రిని నాన్న అని పిలిస్తే నాకు ఎలా ఉంటుందని జ్యో అంటుంది. తండ్రి వయసులో ఉన్న మనిషి కాబట్టే నాన్న అని దీప పిలిచిందని కవర్ చేస్తాడు కార్తీక్. కానీ జ్యో వినకుండా నానా మాటలు అంటుంది. జన్మనిచ్చిన వాళ్లనే అమ్మానాన్న అని పిలవాలని మాట్లాడుతుంది. “దీపను కన్నారు, జన్మనిచ్చారు కాబట్టే పిలిచింది. నీ దవడ పగులగొట్టి దీపే అసలైన కూతురు అని చెప్పాలనంత కోపంగా ఉంది. కానీ ఇప్పుడు చెప్పలేను” అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
దశరథ్ను నాన్న అని ఎందుకు పిలిచావని దీపపై జ్యోత్స్న కోప్పడుతుంది. అయ్యగారు, సార్ అని పిలువాలని కదా అని అంటుంది. నా తండ్రి నాకు మాత్రమే తండ్రి, ఏ అనామకురాలికో కాదు అని చెబుతుంది. పనివాళ్లకు ఇంట్లో చోటిచ్చింది ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు, బంధాలు కలుపుకునేందుకు కాదు అని జ్యో అంటుంది. కరెక్టుగానే మాట్లాడావంటూ శివ్ననారాయణ కూడా వత్తాసు పలుకుతాడు.
కౌంటర్లు వేసిన కార్తీక్.. కొట్టాలనిపిస్తుందన్న సుమిత్ర
శభాష్ శివన్నారాయణ గారు అంటూ వెటకారంగా చప్పట్లు కొడతాడు కార్తీక్. కాళ్లను కడిగి నీళ్లు చల్లుకుంటానని చెబుతాడు. అంత వెటకారం వద్దని పారిజాతం అంటే.. ఒళ్లు మండుతోంది ఇక్కడ అని కార్తీక్ అంటాడు. మామయ్యను దీప పట్టుకోకపోతే కిందపడి దెబ్బ తగిలేది కదా అని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. తగిలేదని సుమిత్ర చెబుతుంది. మామయ్య ప్లేస్‌లో దీప ఉంటే.. కూతురా అని మామయ్య పట్టుకుంటే తప్పా అని అడుగుతాడు. అప్పుడు నీ కూతురు వచ్చి దీప నీకు పుట్టిందా అని మామయ్యను అడిగితే నీకు ఎలా ఉంటుందని సుమిత్రను ఆవేశంగా అడుగుతాడు కార్తీక్. లాగిపెట్టి కొట్టాలని అనిపిస్తుంది సుమిత్ర సమాధానమిస్తుంది. అయితే, కొట్టు నీ కూతురిని అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 7) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం