ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ – మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

Best Web Hosting Provider In India 2024

ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ – మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమలోని పలు ప్రాంతాల్లో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు వానలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. హెచ్చరికలను కూడా జారీ చేసింది.

బలహీనపడిన ద్రోణి, ఆవర్తనం…

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. అంతేకాకుండా ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో…. రెండు మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి.

ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 40 – 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండనున్నాయి.

దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు. అంతేకాకుండా…కొన్నిచోట్ల వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉండొచ్చు.

రాయలసీమలో ఇవాళ, రేపు ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 30 – 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు.ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో వర్షాలు – హెచ్చరికలు జారీ…

తెలంగాణలో నాలుగైదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(జూన్ 8) ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరి,ిల్ల, భూపాలపల్లి, ములుగు, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 30- 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

గత వారం వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే ఇటీవలే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు కనిపించాయి. మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల ప్రభావంతో రాబోయే రోజుల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

WeatherImdAp RainsTelangana NewsTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024