




Best Web Hosting Provider In India 2024
ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. సోషల్ మీడియాలో వైరల్గా వీడియో.. అసలు నిజమేంటీ?
పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడనే వార్త కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో నిజమేనా? అసలు ఏం జరిగింది? అనేది ఇక్కడ తెలుసుకోండి.
పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చనిపోయాడనే వార్త కలకలం రేపుతోంది. ఈ లెజండరీ ప్లేయర్ కన్నుమూశాడని, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇందులో నిజం లేదు. షాహిద్ అఫ్రిది బాగానే ఉన్నాడు. అతని చనిపోలేదనేది నిజం.
ఆ వైరల్ వీడియో
పాకిస్థాన్ లెజండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కన్నుమూశాడనే వార్త తెగ వైరల్ గా మారింది. ఈ న్యూస్ తో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోను ఇందుకు కారణం. ఈ వీడియోలో అఫ్రిది చనిపోయాడని, కరాచిలో అతని అంత్యక్రియలు జరిగాయని పేర్కొన్నారు. అంతే కాకుండా విజన్ గ్రూప్ ఛైర్మన్ తదితర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారని కూడా తెలిపారు.
అది ఫేక్
అయితే షాహిద్ అఫ్రిది మరణించాడనే వార్తల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్. అది ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసింది. షాహిద్ అఫ్రిది ప్రాణాలతోనే ఉన్నాడు. ఇటీవల అతను ఆపరేషన్ సిందూర్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో అఫ్రిదితో పాటు షోయబ్ అక్తర్ తదితర పాకిస్థాన్ ఆటగాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను భారత్ లో నిషేధించారు.
సిక్సర్ల రికార్డు
ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు షాహిద్ అఫ్రిది పేరు మీదే ఉంది. అతను 351 సిక్సర్లు కొట్టారు. సెకండ్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 344 సిక్సర్లు బాదాడు. అఫ్రిది రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఛాన్స్ దొరికితే చాలు భారత్ పై విషం చిమ్మే పాకిస్థాన్ ప్లేయర్లలో షాహిద్ అఫ్రిది కూడా ఒకడు.
కెరీర్ ఇలా
2017లో రిటైర్ అయిన 45 ఏళ్ల అఫ్రిది దాదాపు 20 ఏళ్ల కెరీర్ లో మూడు ఫార్మాట్లలో కలిపి 11 వేలకు పైగా పరుగులు చేశాడు. 500కు పైగా వికెట్లు పడగొట్టాడు. 27 టెస్టుల్లో 1716 పరుగులు చేసిన అఫ్రిది 48 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 398 వన్డేల్లో 8064 పరుగులు చేయడంతో పాటు 395 వికెట్లు తీసుకున్నాడు. 99 టీ20ల్లో 1416 పరుగులు, 98 వికెట్లు సాధించాడు. బిగ్ హిట్టర్ గా అఫ్రిది పేరు తెచ్చుకున్నాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link