యువతి దారుణ హత్య- రొమ్ములను ‘ట్రోఫీ’గా దాచుకున్న రాక్షసుడు! నెట్​ఫ్లిక్స్​ సిరీస్​ చూసి..

Best Web Hosting Provider In India 2024


యువతి దారుణ హత్య- రొమ్ములను ‘ట్రోఫీ’గా దాచుకున్న రాక్షసుడు! నెట్​ఫ్లిక్స్​ సిరీస్​ చూసి..

Sharath Chitturi HT Telugu

అమెరికాలో గతేడాది జరిగిన ఒక యువతి హత్య కేసులో ఒక వ్యక్తి తాజాగా దోషిగా తేలాడు. అతని ఫొన్​లోని ఫొటోలు కేసులో కీలకంగా మారాయి. కొన్ని ఫొటోల్లో అతను కట్​ చేసి ఉన్న ఆ యువతి రొమ్ములను పట్టుకుని కనిపించాడు.

నిందితుడు మ్యాక్స్​వెల్​ ఆండర్సన్​ (AP)

అమెరికాలో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, ఆమె రొమ్ములను ‘ట్రోఫీ’గా దాచుకున్న ఒక వ్యక్తి తాజాగా దోషిగా తేలాడు. అతని ఫోన్​లో కనిపించిన ఫొటోలు చూసి కోర్టులో ఉన్న వారు షాక్​ అయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.

అసలేం జరిగింది?

అమెరికా విస్కాన్సిన్​లో 2024 ఏప్రిల్​లో జరిగింది ఈ ఘటన. 34ఏళ్ల మ్యాక్స్​వెల్​ ఆండర్సన్​కు 19ఏళ్ల సాడె కర్లీనా రాబిన్​సన్​తో​ పరిచయం ఏర్పడింది. తొలిసారి వారిద్దరు డేట్​కి వెళ్లారు. రెస్టారెంట్​లో కొంత సమయం గడిపారు. ఆ తర్వాత ఆండర్సన్​, ఆ యువతిని.. మిల్వాకీలోని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె అతని ఇంటికి వెళ్లింది.

కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆమె ఎవరికి కనిపించలేదు!

యువతి పిజ్జా స్టోర్​లో పనిచేస్తూ, క్రిమినల్​ జస్టిస్​ చదువుకుంటోంది. మరుసటి రోజు ఆమె పనికి రాకపోవడంతో అనుమానం వచ్చి సంబంధిత వర్గాలు మిస్సంగ్​ కేసు పెట్టాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి, యువతి ఇంటిని తనిఖీ చేశారు. ఆమె కనిపించలేదు.

కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక ప్రదేశంలో ఒక కాలు కనిపించింది. ఆ తర్వాత నగరం వ్యాప్తంగా మనిషి చర్మం, పాదాలు సహా ఇతర అవయవాలు కనిపించాయి. వాటిని పరీక్షించగా.. రాబిన్​సన్​ డీఎన్​ఏతో అవి మ్యాచ్​ అయ్యాయి.

దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్​ చేశారు. చివరికి ఆండర్సన్​ని అరెస్ట్​ చేశారు. అతని ఫోన్​లో పలు షాకింగ్​ ఫొటోలు కీలక ఆధారాలుగా మారాయి.

ఈ కేసులో ఇటీవలే కోర్టు విచారణ జరిగింది. ఆండర్సన్​ ఫోన్​లోని ఫొటోలను జ్యూరీకి డిస్​ప్లే చేశారు. కొన్ని ఫొటోల్లో అతను.. కట్​ చేసి ఉన్న రాబిన్​సన్​ రొమ్ములను పట్టుకుని కనిపించాడు. రొమ్ములను అతను తన ట్రోఫీగా దాచుకున్నాడు.

ఫోన్​లో ఉన్న ఫొటోలు కోర్టురూమ్​లోని వారిని షేక్​ చేసేశాయి. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

“హత్య జరిగిన రోజు రాత్రి.. నిందితుడు- బాధితురాలు కలిసి లవ్​, డెత్​ అండ్​ రోబోట్స్​ అనే నెట్​ఫ్లిక్స్​ డాక్యుమెంటరీ చూశారు. ఈ సిరీస్​లోని ఒక ఎపిసోడ్​లో మృతదేహన్ని ముక్కలు, ముక్కలు చేస్తారు. అవి బీచ్​లో కనిపిస్తాయి,” అని అధికారులు జ్యూరీకి వివరించారు.

అంతేకాదు, ఆండర్సన్​ ఇంటి కింద భాగంలో “సె* రూమ్​”ని కూడా పోలీసులు కనుగొన్నారు. హ్యాండ్​కఫ్​లు ఇతర అనుమానాస్పద వస్తువులు వాటిల్లో ఉన్నాయి.

హత్యను ఆండర్సన్​ నెలల పాటు ప్లాన్​ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. యువతిని హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని, ఆమె కారులోనే పెట్టి మిచిగాన్​ చెరువుకు సమీపంలోని పార్కుకు వెళ్లాడు. అక్కడే మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. కొన్ని అవయవాలను అక్కడ వదిలేశాడు. అనంతరం ఆమె కారుకు నిప్పంటించి, బస్సులో వెనక్కి వెళ్లిపోయాడు.

ఈ మొత్తం వివరాలను విన్న జ్యూరీకి తీర్పును ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ కేసులో ఆండర్సన్​ దోషి అని తేల్చారు. ఆగస్ట్​ 15న ఆండర్సన్​ శిక్ష ఖరారవుతుంది.

కాగా.. ఆండర్సన్​ ఇలా ఎందుకు చేశాడు? అన్న విషయం తెలియరాలేదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link