





Best Web Hosting Provider In India 2024

సైన్స్‌కు సమాధానం దొరకనప్పుడు మూఢనమ్మకం అంటుంది- ఆది సాయి కుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల టీజర్ అదుర్స్- విజువల్స్ హైలెట్!
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన న్యూ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల. ఏ మిస్టిక్ వరల్డ్ అనేది క్యాప్షన్. యుగంధన్ ముని దర్శకత్వం వహించిన శంబాల టీజర్ జూన్ 7న రిలీజ్ అయింది. హారర్ ఎలిమెంట్స్‌తో శంబాల టీజర్ అదిరిపోయేలా ఉంది. టీజర్‌లోని విజువల్స్ అయితే హైలెట్‌గా నిలిచాయి.
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన న్యూ తెలుగు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
శంబాల నటీనటులు
శంబాల సినిమాలో ఆది సాయి కుమార్‌తోపాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, ఇంద్రనీల్ వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.
మేకింగ్ వీడియోతో
రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. జూన్ 7న శంబాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మూవీపై మరింతగా అంచానాలను పెంచేసింది.
అంతుపట్టని రహస్యాలెన్నో
శంబాల టీజర్ విషయానికొస్తే ‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలెన్నో ఉన్నాయి.. సైన్స్‌కి సమాధానం దొరకనప్పుడు మూఢ నమ్మకం అంటుంది.. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పదనం అంటుంది’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.
పంచ భూతాలని శాసిస్తోందంటే
అలాగే, ‘పంచ భూతాలని శాసిస్తోందంటే ఇది సాధారణమైనది కాదు.. దీని ప్రభావం వల్ల మనం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం’.. ‘ఇప్పుడు ఈ రక్కసి క్రీడను ఆపాలంటే’.. అంటూ వచ్చిన వాయిస్ ఓవర్.. చూపించిన డైలాగ్స్‌తో సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థం అవుతోంది.
విజువల్స్-బీజీఎమ్ హైలెట్
శంబాల టీజర్లో ప్రవీణ్ కే బంగారి అందించిన విజువల్స్ హైలెట్‌గా నిలిచాయి. ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ కలిగేలా ఆ విజువల్స్ అదిరిపోయాయి. ఇక శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజీఎమ్ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉంది. పాన్ ఇండియన్ మూవీకి సరిపడా సబ్జెక్ట్, కంటెంట్ ఉందని ఈ టీజర్ చెప్పకనే చెప్పేస్తోంది.
అతీంద్రియ శక్తి గల ఉల్క
టీజర్లో అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం.. ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో శంబాలను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
రిలీజ్ డేట్
ఇక ఈ టీజర్‌తో శంబాల మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే శంబాల రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.
సంబంధిత కథనం