




Best Web Hosting Provider In India 2024
కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు- ఒళ్లు గగుర్పొడిచే లైవ్ వీడియో..
కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు జరిగాయి. ఓ రాజకీయ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొలంబియాలోని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగ్యుల్ ఉరిబె టర్బేపై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. బొగోటాలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఉరిబెని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
బొగోటా ఫాంటిబోన్ జిల్లాలోని మోడెలియా పరిసరాల్లోని ఎల్ గోల్ఫిటో పార్క్‌లో అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు జరిగాయి. మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ సెంటర్ పార్టీ అభ్యర్థి అయిన ఉరిబె మద్దతుదారులను కలుస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పలు ధృవీకరించని వీడియో ప్రకారం.. ఉరిబె ఒక చెట్టు కింద తన మద్దతుదారులతో మాట్లాడుతున్నారు. ముందు నుంచి కొందరు వీడియోలు తీస్తున్నారు. తొలుత అంతా ప్రశాంతంగానే ఉంది. కాన్నీ కొన్ని క్షణాల్లోనే కాల్పుల మోత మోగింది. ఉరిబె తలవైపు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆయన కిందపడిపోయారు. ఆయన శరీరం నుంచి రక్తం కారింది.
మరోవైపు కాల్పుల శబ్దాలు వినిపించిన వెంటనే కొందరు ప్రజలు అక్కడి నుంచి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ప్రజలు కేకలు వేయడం, సహాయం కోసం పిలవడం, గాయపడిన రాజకీయ నాయకుడిని తమ చేతుల్లోకి ఎత్తుకోవడం ఈ క్లిప్స్‌లో చూడవచ్చు.
తల, వీపుపై రక్తంతో కనిపించిన ఉరిబేను బొగోటాలోని మెడికల్ సెంటర్‌కి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :
షూటర్ అరెస్ట్..
ఈ సంఘటన తరువాత, బొగోటా మేయర్ కార్లోస్ ఫెర్నాండో గాలన్ ఉరిబెకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని, షూటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ధృవీకరించారు.
“ఈ మధ్యాహ్నం ఫాంటిబోన్లో జరిగిన దాడిలో గాయపడిన సెనేటర్ మిగ్యుల్ యురిబెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ ఆయనను బదిలీ చేయాల్సి వస్తే మొత్తం బొగోటా ఆసుపత్రి నెట్వర్క్ అప్రమత్తమైంది. సెనెటర్ మిగ్యుల్ ఉరిబె, అతని కుటుంబానికి నా సంపూర్ణ సంఘీభావం. కాల్పులు జరిపిన వ్యక్తి పట్టుబడ్డాడు,” అని గాలన్ ఎక్స్‌లో మేయర్ ఒక పోస్ట్‌లో రాశారు.
డెమొక్రటిక్ సెంటర్ పార్టీ ప్రకటన ప్రకారం.. సెనేటర్ మిగ్యుల్ ఉరిబె శనివారం బొగోటా ఫాంటిబోన్ పరిసరాల్లోని పబ్లిక్ పార్కులో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా “సాయుధులు ఆయన వీపుపై కాల్పులు జరిపారు.” ఈ దాడిని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది తీవ్రమైనదని పేర్కొంది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నిర్దిష్ట సమాచారాన్ని ఇవ్వలేదు.
కొలంబియా అధ్యక్ష కార్యాలయం కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. హింసాత్మక సంఘటనను ప్రభుత్వం “స్పష్టంగా, బలంగా” ఖండించింది. ఏం జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు వివరించింది.
ఎవరు ఈ మిగ్యుల్ ఉరిబే టర్బే?
కొలంబియా అధ్యక్ష అభ్యర్థి మిగ్యుయెల్ ఉరిబే సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు, న్యాయవాది. 1986 జనవరి 28న బొగోటాలో జన్మించిన ఉరిబే మితవాద డెమొక్రటిక్ సెంటర్ పార్టీలో కీలక సభ్యుడు. మీడియా కథనం ప్రకారం ఉరిబే తల్లి, జర్నలిస్ట్ డయానా టర్బే.. 1991 లో మాదకద్రవ్యాల వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ నేతృత్వంలోని మెడెలిన్ కార్టెల్ చేత కిడ్నాప్‌కు గైర, తరువాత రెస్క్యూ ఆపరేషన్ సమయంలో మరణించింది.
ఉరిబే చిన్న వయసులోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2012 నుంచి 2015 వరకు బొగోటా సిటీ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈ పాత్రను నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. 2014లో మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link