అత్తా కోడళ్ల సీరియల్‌తో స్టార్ట్ చేయాల్సింది.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఓ తెలివి తక్కువ వాడు: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

అత్తా కోడళ్ల సీరియల్‌తో స్టార్ట్ చేయాల్సింది.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఓ తెలివి తక్కువ వాడు: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ పై తీవ్రంగా మండిపడ్డాడు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ను సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ తో కాకుండా మరో షోతో చేయాల్సిందన్న ఆయన అభిప్రాయాన్ని తప్పుబట్టాడు.

అత్తా కోడళ్ల సీరియల్‌తో స్టార్ట్ చేయాల్సింది.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఓ తెలివి తక్కువ వాడు: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ ఇటీవల నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని ‘సేక్రెడ్ గేమ్స్’, ‘హీరామండి’ నుండి ‘సీఐడీ’, ‘కపిల్ శర్మ షో’ వరకు పలు విషయాలపై మాట్లాడారు. అయితే, ‘సేక్రెడ్ గేమ్స్’ గురించి ఆయన చేసిన ఒక వ్యాఖ్య, ఆ షో క్రియేటర్ అనురాగ్ కశ్యప్‌కు నచ్చలేదు. సరండోస్ వ్యాఖ్యలను “తెలివి తక్కువ” అని పేర్కొంటూ కశ్యప్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు.

అనురాగ్ కశ్యప్ తీవ్ర విమర్శలు

నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రోగ్రామింగ్‌ను ‘సేక్రెడ్ గేమ్స్’తో ప్రారంభించాలనే ఆలోచన సరైనదేనా అని తాను కచ్చితంగా చెప్పలేనని సరండోస్ అన్నారు. దానికి బదులుగా మరింత ‘పాపులిస్ట్’ (ప్రజాదరణ పొందిన) కంటెంట్‌తో ప్రారంభించి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

సరండోస్ వ్యాఖ్యలపై వచ్చిన ఒక న్యూస్ క్లిప్ ను పంచుకుంటూ.. అనురాగ్ కశ్యప్ థ్రెడ్స్‌లో ఇలా పోస్ట్ చేశాడు. “అతను అత్తా కోడళ్ల సీరియల్ తో ప్రారంభించి ఉండాల్సింది. అది బాగా చేసేవాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. స్టోరీ టెల్లింగ్ విషయంలో టెక్ నిపుణులు తెలివి తక్కువ వారని నాకు ఎప్పుడూ తెలుసు. కానీ టెడ్‌ సరండోస్ తెలివి తక్కువతనానికి నిర్వచనం అని నాకు తెలియదు. అది తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి” అని అనురాగ్ పోస్ట్ చేయడం గమనార్హం.

‘సేక్రెడ్ గేమ్స్’ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఇండియన్ ఒరిజినల్ సిరీస్. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ షోలో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. 2018లో విడుదలైనప్పుడు దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో సీజన్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో షోని అక్కడితో ఆపేశారు.

టెడ్ సరండోస్ ఏమన్నారంటే..

పాడ్‌కాస్ట్‌లో సరండోస్ మాట్లాడుతూ.. ఇండియన్ మార్కెట్‌లో సరైన పద్ధతిని తెలుసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌కు కొన్ని సంవత్సరాలు పట్టిందని అంగీకరించారు. “మా మొదటి భారతీయ ఒరిజినల్ షో ‘సేక్రెడ్ గేమ్స్’. ఇది చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాను. భారతదేశంలో ప్రజలు సినిమాలను ఇష్టపడతారు. ఇది ఒక సినిమా అంత పెద్దగా అనిపించే టీవీ షో. ఇందులో సినిమా స్టార్లు ఉన్నారు. దీని గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది చాలా కొత్తగా ఉంది. కానీ ఇండియాలాంటి పెద్ద దేశంలో మేము సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తున్నామని నేను అర్థం చేసుకోలేదు” అని ఆయన అన్నారు.

“ఒకవేళ నేను మళ్లీ అలా చేసే అవకాశం వస్తే.. ‘సేక్రెడ్ గేమ్స్’ను రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసి.. మరింత ప్రజాదరణ పొందిన కంటెంట్‌ను (దానికి బదులుగా) చేసి ఉండేవాడినా? చేసి ఉండొచ్చు. ఇండియాలో రాబోయే కొన్ని సంవత్సరాల్లో మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024