





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 9: దీపకు సారీ చెప్పిన జ్యోత్స్న.. శౌర్యను ముద్దుచేసిన శివన్నారాయణ, సుమిత్ర.. షాకైన జ్యో
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 9: దశరథ్ను కాపాడిన దీపపై జ్యోత్స్న చేయి ఎత్తడం గురించి కార్తీక్ ఫైర్ అవుతాడు. సారీ చెప్పాల్సిందేనంటాడు. శివన్నారాయణ ఇంటికి కాంచన, అనసూయ, శౌర్య వస్తారు. శౌర్యను శివన్నారాయణ ప్రేమగా పలుకరించడంతో జ్యో అవాక్కవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.
కార్తీక దీపం 2 నేటి (జూన్ 9, 2025) ఎపిసోడ్లో.. దశరథ్ను నాన్న అని పిలిచినందుకు దీపపై జ్యోత్స్న ఆగ్రహిస్తుంది. కొట్టేందుకు చేయి ఎత్తిన జ్యోను అడ్డుకుంటాడు కార్తీక్. దశరథ్ను కిందపడకుండా కాపాడి, మంచి చేసిన దీపను తిడతారా అంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు. “నా భార్యను కూతురా అని మామయ్య అంటే.. నా భార్య తల్లి వచ్చి దీప నీకు పుట్టిందా అని అడిగితే నీకు ఎలా ఉంటుంది” అని సుమిత్రను కార్తీక్ ప్రశ్నిస్తాడు. లాగిపెట్టి కొట్టాలనిపిస్తుందని సుమిత్ర అంటే.. అయితే నీ కూతురిని కొట్టు, దవడపళ్లు రాలిపోవాలని అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యో అరిస్తే.. బావ కాదు డ్రైవర్ అని పిలువు అని బదులిస్తాడు కార్తీక్.
నిజం చెప్పబోయి ఆగిన కార్తీక్
నాన్న అని పిలిచినందుకు దీప పుట్టుకను నేనేం అవమానించలేదే అని జ్యోత్స్న అంటుంది. జన్మనిస్తేనే నాన్న అని పిలవాలని అన్నావ్ కదా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఎవరుపడితే వాళ్లు వరుసలు పెట్టి పిలవకూడదని జ్యోకే శివన్నారాయణ సపోర్ట్ చేస్తాడు. “ఎవరు పడితే వాళ్లు కాదు. దీప నీ..” అని కార్తీక్ ఆగిపోతాడు. దీప నీ సొంత మనవరాలు అని నిజం చెప్పబోయి మాట ఆపేస్తాడు. ఎలా పిలిచిందన్న విషయం పక్కన పెడితే చేసిన మంచి గుర్తించరా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ కాఫీ కప్ చూడండి ఎలా పగిలిందో.. దీప మామయ్యను పట్టుకోకపోయి ఉంటే ఆ కాఫీ కప్ ప్లేస్లో మామయ్య ఉండే వాడు అని కార్తీక్ అంటాడు. అప్పుడు వినోదం చూసేవారా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.
దీపకు జ్యోత్స్న సారీ
ప్రమాదం జరిగకుండా కాపాడింది ఎవరైనా సరే వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని శివన్నారాయణ అంటాడు. అందుకే ఆవేశంగా చేయి ఎత్తిన జ్యోత్స్న నా భార్య దీపకు సారీ చెప్పాల్సిందేనని కార్తీక్ అడుగుతాడు. నేను సారీ చెప్పనని జ్యో అంటుంది. కాస్త నోరు మూస్తారా అని శివన్నారాయణ అరుస్తాడు. కాపాడాలనే కంగారులో నాన్న అని దీప పిలిచింది, దాన్ని క్షమించవచ్చు అని చెబుతాడు. అలాగే దీప చేసిన మంచి పనిని గుర్తించకుండా జ్యోత్స్న చేయి ఎత్తడం తప్పే అని అంటాడు. ఇంతలో తాత అని అడ్డుకుంటుంది జ్యో. తాత ఆగ్రహిస్తే సారీ అంటుంది జ్యో.
నాకు కాదు.. దీపకు సారీ చెప్పు అని జ్యోత్స్నకు శివన్నారాయణ కోపంగా చెబుతాడు. సారీ చెప్పండి ఓనర్ గారు అని కార్తీక్ అంటాడు. దీపకు నువ్వు క్షమాపణ చెప్పి తీరాలని దశరథ్ కూడా చెబుతాడు. ‘సారీ దీప’ అని జ్యోత్స్న అంటుంది. టాప్ పగిలిపోయేలా అరిచారే ఆ టోన్లో చెప్పండని కార్తీక్ అంటాడు. సారీ.. చాలా అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఇంటి పెద్దరికాన్ని ఇంకోసారి ప్రశ్నించకు అని శివన్నారాయణ అంటాడు.
కూతురు లాంటి దానివే..
కిందపడకుండా పట్టుకునే తొందరలో నాన్న అని పిలిచానని, క్షమించండి అని దశరథ్తో దీప అంటుంది. నువ్వు నా కూతురు లాంటి దానివేనని దశరథ్ అంటాడు. దశరథే తన సొంత తండ్రి అని తెలిసినా దీప చెప్పలేని స్థితిలో ఉంటుంది. నా భర్తను కాపాడితే.. రేపు పడబోయే శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనలు ఉన్నాయేమో నీకు అని దీపతో కఠినంగా మాట్లాడుతుంది సుమిత్ర. కాస్తైనా నవ్వొచ్చుగా అంటూ దీపతో సరదాగా మాట్లాడతాడు కార్తీక్.
శివన్నారాయణ ఇంటికి కాంచన, శౌర్య
శివన్నారాయణ ఇంటికి కాంచన, శౌర్య, అనసూయ వస్తారు. వీళ్లెందుకు వచ్చారని పారిజాతం, జ్యోత్స్న అనుకుంటారు. హాయ్ జ్యో.. మా అమ్మతో మాట్లాడుతుంటే కాల్ ఎందుకు కట్ అయిందని శౌర్య అడుగుతుంది. అది సిగ్నల్ ప్రాబ్లం అని కార్తీక్ అంటాడు. హాయ్ నాన్న, అమ్మ అంటూ కార్తీక్, దీపను శౌర్య పలుకరిస్తుంది. తాతయ్య ఎలా ఉన్నావంటూ దశరథ్ను అడుగుతుంది. సంతోషంగా మాట్లాడతాడు దశరథ్.
వీళ్లు రావడం మంచిదైందని, శౌర్యను అమ్మ చూసినా, తాత చూసిన ఛీ కొడతారని జ్యో అంటుంది. రా చెల్లెమ్మ అంటూ కాంచనను ప్రేమగా పలుకరిస్తాడు దశరథ్. హాయ్ ముద్దుల తాత అంటూ శివన్నారాయణ దగ్గరికి పరుగెత్తుకొని వెళుతుంది శౌర్య. ఆపాలని కార్తీక్ అంటే.. మనవరాలి కూతురిగా ఎప్పటికైనా దగ్గరికి వెళ్లాల్సిందేనని కార్తీక్ అంటాడు. భయపడొద్దని చెబుతాడు.
ముత్తాతకు నారింజ మిఠాయి తినిపించిన శౌర్య
హాయ్ ముద్దుల తాతయ్య ఎలా ఉన్నావ్ అని శివన్నారాయణను శౌర్య అడుగుతుంది. తాత రియాక్ట్ అయితే ఈ పిల్ల పారిపోతుందని పారుతో గుసగుసలాడుతుంది జ్యోత్స్న. నీ కోసం నారింజ మిఠాయి తెచ్చా.. తీసుకో అని ముత్తాత శివన్నారాయణతో శౌర్య అంటుంది. కసిరితే శౌర్య భయపడుతుందని దీప కంగారు పడుతుంది. జ్యోత్స్న ఏదో మాట్లాడబోతుంటే పిల్లల ముందు ఏం మాట్లాడుకోవాలో.. అవే మాట్లాడుకోవాలని శివన్నారాయణ అడ్డుకుంటాడు. పెద్దవాళ్ల మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించాల్సిన అవసరం లేదంటాడు.
శౌర్య తెచ్చిన నారింజ మిఠాయిని శివన్నారాయణ నవ్వుతూ తీసుకుంటాడు. దీన్నే ఇద్దరం తిందామని చెబుతాడు. శౌర్య ఆ నారింజ మిఠాయిని నోటితో విరిస్తుంది. నువ్వు నా కంటే తెలివైన దానివే అంటూ.. శౌర్యను నారింజ మిఠాయి తినిపిస్తాడు శివన్నారాణ. ముత్తాతకు నారింజ మిఠాయి పెడుతుంది శౌర్య. నాన్న అని కాంచన పలుకరిస్తే.. పలుకరించకుండా వెళ్లిపోతాడు శివన్నారాయణ.
శౌర్యను ముద్దుచేసిన సుమిత్ర.. జ్యోకు ఝలక్
హాయ్ అమ్మమ్మ అని సుమిత్రను శౌర్య పలుకరిస్తుంది. మమ్మీ దగ్గరికి కూడా రానివ్వదని జ్యో అనుకుంటుంది. సుమిత్రమ్మ ఏమంటారో అని దీప అంటే.. మనుషులు ఎలాంటి వారో తెలుసుకనే టైమ్ ఇదేనని కార్తీక్ చెబుతాడు. ఎలా ఉన్నావ్ అమ్మమ్మ అని శౌర్య అడిగితే.. బాగున్నానే, నువ్వు ఎలా ఉన్నావని నవ్వుతూ బదులిస్తుంది సుమిత్ర. మమ్మీ శౌర్య అని జ్యో అడ్డుకోబోతే.. పిల్లలు పెద్దల ఆస్తులకు వారసులు, తప్పులకు కాదు అని సుమిత్ర అంటుంది. శౌర్య తెచ్చిన నారింజ మిఠాయిలను సుమిత్ర, దశరథ్ తింటారు. కార్తీక్, దీప సంతోషిస్తారు. మీ బావ మామూలోడు కాదు.. యుద్ధం చేయకుండానే గెలిచేశాడని కాంచన అంటుంది.
నా రూమ్ క్లీన్ చేయాలి రా..
వదినా అని సుమిత్రను కాంచన పలుకరిస్తుంది. కాంచన మాత్రం బదులివ్వదు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయాలి కదా.. తాగడానికి ఏదో ఒకటి ఇవ్వు అని దీపతో సుమిత్ర అంటుంది. నువ్వు మమ్మల్ని ఎలా చూస్తే.. నిన్ను మేం అలానే చూస్తానని జ్యోత్స్న పొగరుగా అంటుంది. నా రూమ్లో దుమ్ము ఉంది క్లీన్ చేసేందుకు రా అని దీపను జ్యో పిలుస్తుంది. దీప మా ఇంట్లో పని మనిషి కదా.. పిలిస్తే రావాల్సిందేనని పారు అంటుంది. ఏంటి కార్తీక్ బాబు ఇది అని అనసూయ అంటే.. దీనికి కచ్చితంగా సమాధానం చెబుతానని కార్తీక్ అంటాడు. నాన్న దగ్గరికి వెళతానని దశరథ్తో కాంచన అంటుంది.
ఆలోగా దాసు వస్తే బాగుంటుంది
వీళ్లను ఇంటికి పిలిచి మంచి పని చేశావని దశరథ్ అంటాడు. దాసు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా.. జ్యోత్స్నకు పెళ్లి జరిగేలోపు వాడు వస్తే బాగుంటుందని దశరథ్ అంటాడు. వస్తాడు. వెతుకుదాం అని కార్తీక్ చెబుతాడు.
అమ్మ కోసం కలెక్టర్ అవుతా..
శౌర్యతో సుమిత్ర, దశరథ్ సరదాగా మాట్లాడి ముద్దు చేస్తారు. తాను బాగా చదువుతున్నానని శౌర్య అంటే.. కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సరిగ్గా సమాధానాలు ఇస్తుంది శౌర్య. అమ్మమ్మ.. పెద్దయ్యాక ఏమవుతావని సుమిత్ర అడిగితే.. పెద్దదాన్ని అవుతానని శౌర్య పంచ్ వేస్తుంది. దశరథ్ నవ్వుతాడు. నువ్వు బాగా చదివి.. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావని సుమిత్ర మళ్లీ అడుగుతుంది. నేను కలెక్టర్ అవుతానని శౌర్య చెబుతుంది. ఎందుకు అని సుమిత్ర అడిగితే.. అమ్మ కోసం అని బదులిస్తుంది శౌర్య.
అమ్మకు చిన్నప్పుడు కలెక్టర్ కావాలని ఉన్నా.. తాత (కుబేర) కోసం చదువు మానేసిందంట అని శౌర్య అంటుంది. అదే అమ్మను నువ్వు చిన్నప్పుడు చూసి ఉంటే.. చదువు మానేయకుండా చేసే వాడివి.. అమ్మ కలెక్టర్ అయ్యేది అని శౌర్య అంటుంది. నువ్వు కలెక్టర్ అయి అమ్మ కోరిక తీర్చు అని శౌర్యతో దశరథ్ చెబుతాడు.
బైక్ కోసం డబ్బు దాస్తున్నాడు
సింహం బొమ్మ చూసి సంబరపడుతుంది శౌర్య. ఇది జ్యోత్స్న చిన్నప్పటిది అని దశరథ్ చెబుతాడు. జ్యోత్స్న జ్ఞాపకాలను బీరువా పెట్టానని శౌర్యకు చూపిస్తుంది సుమిత్ర. అమ్మ బాబోయ్.. ఇన్ని బొమ్మలా అని శౌర్య ఆశ్చర్యపడుతుంది. అది వేలెత్తి చూపించిందల్లా మేం కాదనుకుండా కొనేవాళ్లం అని సుమిత్ర అంటుంది. మా అమ్మానాన్న కూడా అలాగే కొంటారు.. కానీ నేనే ఏమీ అడగను అని శౌర్య చెబుతుంది. ఎందుకు అని దశరథ్ అడుగుతాడు. “మా నాన్న బైక్ కొనడానికి డబ్బు దాస్తున్నాడు. బొమ్మలు కొంటే అయిపోతాయి కదా” అని శౌర్య చెబుతుంది. “ఒరేయ్ మేనల్లుడు నీకొచ్చిన కష్టానికి బాధపడాలో.. ఇంతలా అర్థం చేసుకునే కూతురు ఉన్నందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదురా” అని మనసులో బాధగా అనుకుంటాడు దశరథ్. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 9) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం