




Best Web Hosting Provider In India 2024

కమల్ హాసన్ కు భారీ షాక్.. థగ్ లైఫ్ వీకెండ్ కలెక్షన్లు ఢమాల్.. ఇలాగైతే కష్టమే!
థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్స్: మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోతోంది. ఆ మూవీకి షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు వచ్చాయి.
కమల్ హాసన్, సిలంబరసన్ టి.ఆర్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ చిత్రానికి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. జూన్ 5న రిలీజైన ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లలో తేలిపోయింది. ఇండియాలో శనివారం రూ.7.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన థగ్ లైఫ్.. ఆదివారం మాత్రం కేవలం రూ.5.24 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది.
నాలుగు రోజుల్లో
జూన్ 5న థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్ కు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్లు ఫర్వాలేదనిపించినా.. తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.35.64 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. థగ్ లైఫ్ గురువారం థియేటర్లలో విడుదలై తొలి రోజు ఇండియాలో రూ.15.5 కోట్ల నెట్ వసూలు చేసింది. శుక్రవారం ఈ చిత్రం రూ.7.15 కోట్లు రాబట్టింది.
ఇక కష్టమే
వీకెండ్ లో శని, ఆదివారాల్లో ఈ మూవీ వరుసగా రూ.7.75 కోట్లు, రూ.5.24 కోట్లు నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో నాలుగు రోజుల వసూళ్లు మొత్తం రూ.35.64 కోట్లకు చేరాయి. వీకెండ్ కూడా కలుపుకొని ఫస్ట్ నాలుగు రోజుల్లో కలెక్షన్లలో అంచనాలను అందుకోలేకపోయిన థగ్ లైఫ్.. ఇక రాబోయే వీక్ డేస్ లో పుంజుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ కాకపోవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది.
ఆ సినిమాల కంటే తక్కువే
థగ్ లైఫ్ ఫస్ట్ నాలుగు రోజుల కలెక్షన్లు.. కమల్ హాసన్ గత చిత్రం ఇండియన్ 2, మణిరత్నం లాస్ట్ సినిమా పొన్నియన్ సెల్వన్ 2 కంటే తక్కువ కావడం గమనార్హం. ఇండియన్ 2 మూవీ నాలుగు రోజుల్లో రూ .62.15 కోట్లు వసూలు చేసింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన చివరి రెండు చిత్రాలు.. పొన్నియన్ సెల్వన్ 1, 2 వరుసగా రూ.120.15 కోట్లు, రూ.103.75 కోట్లు రాబట్టాయి.
థగ్ లైఫ్ లో కమల్.. శక్తివేల్ అలియాస్ శక్తిగా, అతని దత్తపుత్రుడు అమర్ గా సిలంబరసన్ నటించారు. అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేశారు. కల్ట్ క్లాసిక్ గా పరిగణించే 1987లో వచ్చిన హిట్ సినిమా నాయకన్ తరువాత కమల్ హాసన్, మణిరత్నం తొలి చిత్రం థగ్ లైఫ్.
సంబంధిత కథనం