ప్రభాస్ నాకోసం చేయలేదు.. ఈ ప్రయాణం నన్ను చాలా మార్చింది.. హీరో మంచు విష్ణు కామెంట్స్.. 50 ఏళ్ల తర్వాత అంటూ!

Best Web Hosting Provider In India 2024

ప్రభాస్ నాకోసం చేయలేదు.. ఈ ప్రయాణం నన్ను చాలా మార్చింది.. హీరో మంచు విష్ణు కామెంట్స్.. 50 ఏళ్ల తర్వాత అంటూ!

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్స్ కలిసి నటించిన సినిమా కన్నప్ప. రీసెంట్‌గా గుంటూరులో జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రభాస్ నాకోసం చేయలేదు.. ఈ ప్రయాణం నన్ను చాలా మార్చింది.. హీరో మంచు విష్ణు కామెంట్స్.. 50 ఏళ్ల తర్వాత అంటూ!

తెలుగు హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న థియేటర్లలో కన్నప్ప విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కన్నప్ప ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మా నాన్న దేవుడు

మంచు విష్ణు మాట్లాడుతూ .. “కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి, నేను ఇక్కడ నిలబడటానికి చాలామంది సాయం చేసారు. నాకు మా నాన్న దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి” అని అన్నాడు.

“ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకూ కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది.. ధైర్యంగా ఉండమని ప్రతీ నిమిషం చెబుతూ వచ్చారు” అని మంచు విష్ణు తెలిపాడు.

పనులన్నీ మానుకుని

ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ చూసారు. ఆయన పనులన్నీ మానుకొని కన్నప్ప సినిమాకి మూడు పాటలు చేయాల్సిన అవసరం లేదు. అయినా మా కోసం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ముఖేష్ రిషి, శివ బాలాజీ, రఘుబాబు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్” అని విష్ణు మంచు వెల్లడించాడు.

“డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా ‘కన్నప్ప’ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే 2017లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది” అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

నాకోసం చేయలేదు

“నా మిత్రుడు ప్రభాస్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం.. నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం. నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేసారు కానీ, నాకోసం చేయలేదు. అతనికి ఈ క్యారక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం, స్నేహానికి విలువ ఉందనడానికి ప్రభాస్ ఒక ఉదాహరణ. మీరందరూ అతని స్టార్‌డమ్‌ని కాదు, అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి” అని మంచు విష్ణు పేర్కొన్నాడు.

మోహన్ లాల్ ఒక మహా నటుడు. జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప సినిమా కూడా అంతే. ఈ ప్రయాణం ఒక వ్యక్తిగా నన్ను చాలా మార్చింది” అని మంచు విష్ణు అన్నాడు.

50 ఏళ్ల తర్వాత

“దాదాపు 50 ఏళ్ల తర్వాత కన్నప్ప కథను చిత్రీకరించాం. యాభై ఏళ్ల తర్వాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నా. కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నాం. జూన్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మంచు విష్ణు తన స్పీచ్ ముగించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024