జయం రవి గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంటా? ఆ వైరల్ ఫొటోపై స్పందించిన కెనిషా.. తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేదంటూ..

Best Web Hosting Provider In India 2024

జయం రవి గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంటా? ఆ వైరల్ ఫొటోపై స్పందించిన కెనిషా.. తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేదంటూ..

Hari Prasad S HT Telugu

తమిళ నటుడు జయం రవి గర్ల్‌ఫ్రెండ్ కెనిషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో వీటిపై కెనిషా స్పందించింది. తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేదంటూ ఆమె చెప్పడం విశేషం.

జయం రవి గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంటా? ఆ వైరల్ ఫొటోపై స్పందించిన కెనిషా.. తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేదంటూ..

నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియలో ఉన్నప్పటికీ.. మరోవైపు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సంబంధంలో ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా ఆమె గర్భవతి అని కూడా పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా రవి, ఆర్తిల మధ్య విభేదాలకు ఆమె కారణమని నిందించారు. ఈ విషయంపై బిహైండ్‌వుడ్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనిషా ఘాటుగా స్పందించింది.

నాకు సిక్స్ ప్యాక్ లేదు

జయం రవితో తన సంబంధంపై వస్తున్న అనేక వ్యాఖ్యలు, పుకార్ల గురించి కెనిషా మాట్లాడింది. ‘హోప్’ అంటూ ఒక నోట్‌తో తాను పోస్ట్ చేసిన ఒక స్టిల్ చూసి తాను గర్భవతిని అని తప్పుగా అర్థం చేసుకున్నట్లు కెనిషా వివరించింది. అది తన పాట అంద్రుమ్ ఇంద్రుమ్ లోని ఒక స్టిల్ అని, కొందరు పొరపాటున ప్రెగ్నెన్సీ అనుకున్నది వాస్తవానికి తన చేతులు అని స్పష్టం చేసింది. “చాలా మంది నేను గర్భవతి అని అంటున్నారు. నాకు సిక్స్ ప్యాక్ లేదు.. కానీ నేను గర్భవతిని కాదు. నా చేతులు కట్టుకోవడానికి కూడా నాకు అనుమతి కావాలా?” అని ఆమె అనడం గమనార్హం.

తన విమర్శకులను ఉద్దేశించి కూడా ఇదే ఇంటర్వ్యూలో కెనిషా మాట్లాదంది. “నేను దేవదూతను కాదు. కానీ నేను దెయ్యం కూడా కాదని మీకు హామీ ఇస్తున్నాను. ఇది ఒక రాబిట్ హోల్ లాంటిది. ఒక గాసిప్ మరొకదానికి దారితీస్తుంది. దీనిని పరిష్కరించడానికి సమయం ఉంది. నేను చేయగలను. కానీ చేయకూడదని నిర్ణయించుకున్నాను” అని ఆమె స్పష్టం చేసింది.

జయం రవి, కెనిషా పబ్లిగ్గానే..

రవి, ఆర్తిల విడాకులలో కెనిషా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె వార్తల్లో నిలిచింది. అయితే ఆ నటుడు తనకు కేవలం స్నేహితుడు, క్లయింట్ మాత్రమే అని.. తాను స్పిరిచువల్ డాక్టర్ ని అని ఆమె పేర్కొంది. మే నెలలో వీరిద్దరూ చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి హాజరయ్యారు.

అక్కడ వారు ఇద్దరూ గోల్డ్ రంగు దుస్తులలో కనిపించారు. ఆ తర్వాత, వారు వివాహ రిసెప్షన్‌కు కూడా కలిసి హాజరయ్యారు. ఇటీవల, కుండ్రాకుడి ఆలయాన్ని సందర్శించిన తర్వాత వారు మళ్లీ వార్తల్లో నిలిచారు. సాంప్రదాయ దుస్తులలో, మెడలో దండలతో ఉన్న వారి చిత్రాలు ఆన్‌లైన్‌లో వెలుగు చూశాయి.

రవి మోహన్, ఆర్తి రవి విడాకులు

గతేడాది సెప్టెంబర్‌లో రవి, తన భార్య ఆర్తి రవితో విడిపోయినట్లు వచ్చిన పుకార్లను ధృవీకరించాడు. ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రవి బహిరంగ ప్రకటనతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆర్తి పేర్కొంది.

కెనిషా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఆమె రవికి స్నేహితురాలు, హీలర్ అని స్పష్టం చేసింది. మే నెలలో, రవి కెనిషాతో బహిరంగంగా కనిపించిన తర్వాత.. రవి, ఆర్తి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వీళ్ల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆమె భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేస్తోందని కూడా వార్తలు వచ్చాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024