




Best Web Hosting Provider In India 2024

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు కుటుంబాల ‘పల్లె వంట’
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన 350 కి పైగా తెలుగు కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లె వంట కార్యక్రమం నిర్వహించాయి.
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన 350 కి పైగా తెలుగు కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఉల్లాసభరిత పల్లెవంట కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం కొనసాగింది.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ 11వ వార్షికోత్సవం
ఈ వేడుక ద్వారా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ 11వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దలంతా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా జీటిఏ యూఎస్ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి మాట్లాడుతూ, “ఈ వేడుక కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, మన విలువలు,పరస్పర గౌరవం మనలో ఐక్యతను కలిగిస్తాయని గుర్తుచేసే సందర్భం” అని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే తెలుగు జానపద గీతాల సంగీత ప్రదర్శనలు, పిల్లల కోసం ఉల్లాసభరితమైన గేమ్స్, మహిళల కోసం లెమన్-స్పూన్ రేస్, మ్యూజికల్ చెయిర్స్ వంటి పోటీలు ప్రేక్షకులను అలరించాయి. 10 ఏళ్ల లోపు పిల్లల కోసం జరిగిన పరుగుపందెం ఎంతో హుషారుగా సాగింది. పల్లెవంట లో వడ్డించిన తెలంగాణా వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్ కూర, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు,మటన్ కూర, రోటి పచ్చళ్ళు, పెరుగన్నం, బీట్‌రూట్ రాయితా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు అన్నీ రుచిగా కుదిరాయి. వాటిలో కొన్ని పార్క్ లోనే వండటంతో వచ్చినవారిని ఆ ఘుమఘుమలు ఆకట్టుకున్నాయి.
శియావాసీ నది పక్కన
ప్రక్కనే పారతున్న శియావాసీ నది పాయను తిలకిస్తూ, ఆ ప్రకృతిలో ఒదిగి ఫోటోలు తీసుకుంటూ ఎంతో మంది ఆనందించారు. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్‌ను పూల తోటలా మార్చారు. కార్యక్రమంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం, అందులో డెట్రాయిట్‌లోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు సేవలందించడం విశేషం. యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ మరియు ఫ్యాషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
జీటిఏ డెట్రాయిట్ బోర్డు సభ్యుల కృషి
వేడుక విజయవంతం కావడానికి 50 మందికి పైగా జీటిఏ డెట్రాయిట్ బోర్డు సభ్యులు, జీటిఏ వనితా టీం కృషి కీలకమైంది. ఈ సంఘటిత కృషి సమాజ బంధాలను బలోపేతం చేయడంలో సంఘీభావం ఎంత ముఖ్యమో చాటింది. “ఇలాంటి వేడుకలు మన కమ్యూనిటీని ఒక కుటుంబంలా మార్చుతాయి. ఒకరినొకరు కలిసి నవ్వుకోవడం, డాన్స్ చేయడం, కథలు చెప్పుకోవడం చూస్తుంటే మనసు పులకిస్తుంది,” అని డెట్రాయిట్‌లో తన కుమార్తె, కుమారుడి వద్దకు వచ్చిన నివేదితా బిట్లా తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్