గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: అప్పు చేసిన మీనా- ప్రభావతి గొడవ- మౌనిక నోము- బ్యూటి పార్లర్ పేరు చూసేసిన మనోజ్!

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: అప్పు చేసిన మీనా- ప్రభావతి గొడవ- మౌనిక నోము- బ్యూటి పార్లర్ పేరు చూసేసిన మనోజ్!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూన్ 9 ఎపిసోడ్‌లో బాలుకు రిటర్న్ సర్‌ప్రైజ్ కింద కారు కొనివ్వాలని మీనా అనుకుంటుంది. బాలు కారు కోసం వడ్డీ వ్యాపారి దగ్గర మీనా అప్పు చేస్తుంది. వడ్డీ వ్యాపారితో ప్రభావతి గొడవ పడుతుంది. రోహిణి దగ్గరికి వచ్చిన మనోజ్ బ్యూటి పార్లర్ బోర్డ్ చూసి తన తల్లి పేరు లేదని షాక్ అవుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 12 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్లు రాజేష్‌తో అంటుంది మీనా. నేను గౌరవంగా బతికేలా చేశారు. ఆయనకు ఇప్పుడు ఆయన గౌరవం పోయేలా ఉందని మీనా అంటుంది. కొత్త కారు అంటే పది లక్షలు అవుతుంది. సెకండ్ హ్యాండ్ అయితే తక్కువలో దొరుకుతుంది అని రాజేష్, అతని ఫ్రెండ్ అంటారు.

3 లక్షలు అవుతుంది

బాలు ఆటో తీసుకోకముందు ఒక కారు చూశాడు. దానికి 3 లక్షలు అవుతుంది. డబ్బుల్లేక ఆగిపోయాడు. ముందు లక్షనర కట్టి మిగతాది ఈఎమ్ఐ కడితే సరిపోతుంది అని రాజేష్ అంటాడు. సరే, ఇది ఆయనకు చెప్పకు అని మీనా అంటే.. బాలుకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నావా అని రాజేష్ అంటాడు. నాకు పూలకొట్టు పెట్టి ఇచ్చినట్లు రిటర్న్‌గా సర్‌ప్రైజ్ ఇస్తా అని మీనా అంటుంది.

మీనా, రాజేష్ వాళ్లు వెళ్లి కారు చూస్తారు. కారు మూడు లక్షలు డౌన్ పేమెంట్ 80 వేలు కట్టమంటాడు ఓనర్. కారు మేమే తీసుకుంటాం. డబ్బు అరేంజ్ చేసుకుని వస్తా అని మీనా అంటుంది. అంత డబ్బు లేదా అని రాజేష్ అడుగుతాడు. ఆర్డర్ పూర్తి చేస్తే 50 వేలు మిగులుతుంది. పూలకొట్టులో నుంచి పొదుపు చేసింది పది వేలు ఉన్నాయి. మిగతాది ఎలాగైనా అరెంజ్ చేసి కాల్ చేస్తాను అని మీనా అంటుంది.

దాంతో అంతా వెళ్లిపోతారు. తర్వాత రాత్రి బాలు, మీనా ఇద్దరు కష్టాల గురించి మాట్లాడుకుంటారు. బాలు ఒళ్లు పడుతుంది మీనా. ఇంతలో పై నుంచి ప్రభావతి మీనా అనుకుంటు పిలుస్తూ వస్తుంది. అమ్మో అని తిరుగుతాడు బాలు. దాంతో మీనా, బాలు ఒకరినొకరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. అది చూసి ప్రభావతి కళ్లు మూసుకుంటుంది.

గొంతు విని కంగారుపడింది

అయ్యో దేవుడా.. కర్మ కర్మ. ఇది హాల్ అని గుర్తుపెట్టుకోకుంటే ఎలా అని రావచ్చా అని అడుగుతుంది ప్రభావతి. తర్వాత వచ్చి ఇది ఇల్లు అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా అని ప్రభావతి అంటుంది. అదేం లేదు ఒళ్లు పడుతుంది. నీ గొంతు విని కంగారుపడి మీద పడింది అని బాలు అంటాడు. ఇంతలో సత్యం వచ్చి మీ అమ్మ ఇబ్బందిపడుతుంది మీరు రూమ్‌లో పడుకోండి. నేను మీ అమ్మ హాల్లో పడుకుంటాం అని అంటాడు.

దాంతో షాక్ అయిన ప్రభావతి మళ్లీ మీరు దుమ్ము, ధూలి అని ఇబ్బందిపడతారా అని అంటుంది. నాన్నా మాకు రూమ్ అవసరం లేదులే. మీ ఆరోగ్యం కుదుటపడని అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి, సత్యం వెళ్లిపోతారు. ఛ అత్తయ్య గారే చూడాలా సిగ్గుతో చచ్చిపోయాను అని మీనా అంటుంది. ఇలా పట్టుకో అని మళ్లీ రొమాంటిక్‌గా చూసుకుంటారు బాలు, మీనా.

మరోవైపు మౌనిక పూజ చేసి సువర్ణకు హారతి ఇస్తుంది. నోము నోస్తే ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుందన్నారు. అందుకో నోము నోస్తున్నాను. ఇవాళ పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటున్నా. కానీ, ఆయన అరుస్తారు. ఆయనను మీరు కొంచెం కంట్రోల్ చేయగలరా అని మౌనిక అంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటా అని సువర్ణ అంటుంది.

సర్‌ప్రైజ్ ఇస్తున్నా

ఇంతలో సంజు వచ్చి బెడ్ కాఫీ ఇవ్వలేదని అరుస్తాడు. నోము, ఉపవాసం గురించి చెప్పిన సువర్ణ ఇవాళ నీకు ఏది కావాలన్న నన్ను అడుగు అని అంటుంది. మౌనిక విలువ గురించి చెబుతుంది. నోములు, ఉపవాసాలా చూస్తా ఎంతసేపు చేస్తావో అని సంజు అనుకుంటాడు. మీనాకు సుమతి కాల్ చేస్తే కారు కొంటున్నా. సర్‌ప్రైజ్ ఇస్తున్నా అని మీనా చెబుతుంది.

ఇంకా 20 వేలు కావాలని మీనా అంటుంది. చక్రపాణి అని ఒకతను వడ్డీకి ఇస్తాడు. కాకపోతే షూరిటీ కింద నీ పూలకొట్టు దగ్గరికి వచ్చి చూసి ఇస్తాడు ఓకేనా అని సుమతి అంటుంది. దాంతో మీనా ఓకే అంటుంది. తర్వాత ప్రభావతి ఇంటి గేట్ ముందు ఒకతను అటు ఇటు తిరుగుతాడు. అది చూసిన ప్రభావతి వెళ్లి మా ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తున్నావ్ అని అడుగుతుంది.

ఓ చెల్లి అక్క కోసం పంపించింది. ఆ చెల్లి పేరు సుమతి అని, అతని పేరు చక్రపాణి అని చెబుతాడు. తర్వాత పూలకొట్టు పేరు మీద ప్రభావతి అని చూసి అడుగుతాడు. ఇదేం చూశావ్ నా పెద్ద కోడలు పెట్టింది చూడు అని అంటుంది ప్రభావతి. ఓ కోడళ్లు సంపాదిస్తుంటే తిని కూర్చొంటున్నావా అని చక్రపాణి అంటాడు. నా ఇంటికి వచ్చే నన్నే అంటున్నావ్ అని అతనితో గొడవకు దిగుతుంది ప్రభావతి.

బస్తీ వాళ్లతో గొడవ

నా బస్తీ వాళ్లను పిలవనా. నా దగ్గర వడ్డీ తీసుకున్నారు. నేను పిలిస్తే వస్తారు అని చక్రపాణి అంటాడు. దాంతో ఇదివరకు బస్తీ వాళ్లతో అయిన గొడవ తలుచుకుని భయపడిపోతుంది ప్రభావతి. ఇంతలో మీనా వచ్చి చక్రపాణిని పక్కకు తీసుకెళ్తుంది. కొట్టు చూపించి కింద పేరు చూపిస్తుంది మీనా. మీ అత్త గారి పేరు కొట్టు మీద నుంచి తీసేయ్ అని అంటాడు చక్రపాణి.

అంత మాట అనొద్దులే అన్న అని అంటుంది మీనా. పేపర్ మీద సంతకం చేయించుకుని 20 వేల డబ్బు ఇస్తాడు చక్రపాణి. ఇదేం చేస్తుంది అని ప్రభావతి అనుమానంగా చూస్తుంది. సూర్యకాంతం లాంటి అత్తతో ఎలా వేగుతున్నావమ్మా అని చక్రపాణి అంటాడు. నా ఇల్లును చూపించి అప్పు తీసుకుంటున్నావా. నీ ఇల్లు అని చెప్పావా అని ప్రభావతి వచ్చి నిలదీస్తుంది.

గంట తర్వాత రమ్మని

ఆయన వచ్చింది షాపును చూడటానికి అని మీనా చెబుతుంది. అప్పు ఎందుకు తీసుకున్నావే అని ప్రభావతి అంటే.. బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని అని మీనా అంటుంది. నిజం చెప్పు మీ అమ్మకు దోచిపెట్టడానికేగా అని ప్రభావతి అంటుంది. మా అమ్మ కష్టపడి పని చేస్తుంది. ఇది నా బంగారం కోసం. ముందు ముందు తెలుస్తుంది. ఇది మా ఆయనకే తెలియదు మీకెందుకు చెబుతాను. ఎవరైనా వస్తే పూలు ఇవ్వండి. లేదా గంట తర్వాత రమ్మని చెప్పండి అని మీనా అంటుంది.

మరోవైపు మీనాకు వచ్చిన డబ్బుల గురించి రోహిణి తన ఫ్రెండ్‌కు చెబుతుంది. మరి నువ్ కూడా ఇది మానేసి మీ ఇంటి పక్కనే మరో పూలకొట్టు పెట్టుకోమని ఫ్రెండ్ సలహా ఇస్తుంది. ఏదో ఒకసారి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఊకే వస్తుందా. అంత డబ్బు వచ్చినా మా అత్తకు ఇచ్చిందా. ఇస్తే నాకు సమస్య అయ్యేది అని వివరంగా చెబుతుంది రోహిణి. ఇలా ఎంతకాలం ఇప్పటికే దినేష్ దగ్గర ఇరుక్కున్నావ్. వాడికి డబ్బు ఇస్తున్నావా అని ఫ్రెండ్ అడుగుతుంది.

బోర్డ్ మీద అత్త పేరు

అంతలో పార్లర్‌కు మనోజ్ వస్తాడు. అది తెలిసి బోర్డ్ మీద అత్త పేరు లేదని కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తుంది రోహిణి. బ్యూటీ పార్లర్‌ పేరు ప్రభావతి పేరు కాకుండా క్వీన్ అని ఉండేసరికి మనోజ్ చూసి షాక్ అవుతాడు. అలా మనోజ్‌కు రోహిణి నిజం తెలుస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024