




Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 12 ఎపిసోడ్: చుక్కలు చూపించిన శ్యామల- విలవిల్లాడిన శ్రుతి- కళ్లు ఆర్పిన రఘురాం- చంద్రకళ చీప్ ట్రిక్స్!
నిన్ను కోరి సీరియల్ జూన్ 12 ఎపిసోడ్లో కామాక్షి గదిలో పడుకోడానికి శ్యామల వస్తుంది. రాత్రంతా తల్లీకూతుళ్లకు చుక్కలు చూపిస్తుంది శ్యామల. ఉదయం రఘురాం కళ్లు ఆర్పుతాడు. అది ఇంట్లో అందరికి చెబుతుంది చంద్రకళ. శాలిని ఫిట్టింగ్ పెట్టి అదంతా అబద్ధం అని చెబుతుంది. దాంతో అంతా చంద్రకళను నిందిస్తారు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అత్తయ్య తన మీద ఎంతో కొంత ప్రేమ దాచుకున్నారు. దాన్ని బయటకు తీసుకొస్తాను అని చంద్రకళ అంటుంది. అదంతా నిజం కాదు. నిన్ను అత్తయ్య కోసం భరిస్తుంది. నిన్ను ఇంట్లో ఉండనివ్వడం అనేది నీ మీద జాలితో నా మీద ఉన్న కోపంతో. అది అమ్మ నాకు వేసిన శిక్ష. అమ్మ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. నన్ను శత్రువులా చూస్తుంది. నా ఇంట్లో నేను పరాయివాడిలా ఉన్నాను. ఇదే కదా నీకు సంతోషాన్నిస్తుంది అని విరాట్ అంటాడు.
ఒక్క క్షణంలో మాయం
నన్ను నా ఓపికను పరీక్షించకు అని వార్నింగ్ ఇచ్చి పడుకుంటాడు విరాట్. రోజంతా పొందిన ఆనందాన్ని ఒక్క క్షణంలో మాయం చేశావుగా బావ. నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావ్ అని బాధపడుతుంది చంద్రకళ. మరోవైపు చంద్రకళ గురించి శ్రుతి, కామాక్షి మాట్లాడుకుంటారు. ఇంతలో వాళ్ల గదికి శ్యామల వస్తుంది. పక్కకు జరిగే అని శ్రుతిని కామాక్షివైపు తోస్తుంది శ్యామల.
దాంతో తల్లిపై కూతురు పడుతుంది. తన రూమ్‌లో ఏసీ పని చేయట్లేదని ఇక్కడ పడుకోడానికి వచ్చినట్లు శ్యామల చెబుతుంది. బెడ్ మీద స్థలం సరిపోదని శ్యామల శ్రుతి కలిసి పడుకుంటామని, సోఫాలో కామాక్షిని పడుకోమంటుంది శ్యామల. దాంతో శ్యామల బెడ్‌పై పడుకుని శ్రుతిని కాళ్లు పట్టమంటుంది. దాంతో శ్రుతి కాళ్లు పట్టినట్లే చేసి గట్టిగా ప్రెస్ చేస్తుంది. నొప్పితో అరుస్తుందని శ్రుతి అనుకుంటుంది.
కానీ, ఏంటే ఆ కాళ్లు నొక్కడం ఇంకా బలంగా నొక్కు అంటుంది శ్యామల. దాంతో శ్రుతి షాక్ అవుతుంది. రాత్రంతా కాళ్లు పట్టిన శ్రుతి కాసేపటికి నిద్రపోతుంది. నిద్రలో అమ్మా నేను కదల్లేకుండా పోతున్నానే అని శ్రుతి బాధగా చెబుతుంది. అది స్లీప్ పెరాల్సిస్ అంటారు అని కామాక్షి అంటుంది. ఇది అలా లేదు. హార్ట్ ఎటాక్‌లా ఉంది. గుండె పట్టేసినట్లుందని, ఊపిరి ఆడట్లేదని శ్రుతి చెబుతుంది.
ఊపిరాడక కొట్టుకున్న శ్రుతి
కామాక్షి లేచి చూస్తే శ్రుతి గుండెలపై శ్యామల చేయి ఉంటుంది. శ్రుతి ఊపిరి ఆడకుండా గిలగిల కొట్టుకుంటుంది. శ్యామల చేయి తీయవే అని బలంగా తీస్తుంది. ఆ ఫోర్స్‌కు గోడకు వెళ్లి గుద్దుకుంటుంది కామాక్షి. ఇది నన్ను చంపేసేలా ఉందే నేను ఇక్కడే పడుకుంటానే అని సోఫాలో తల్లి ఒడిలో కూర్చొంటుంది శ్రుతి. కాసేపటికి శ్యామల పెద్దగా గురక పెడుతుంది.
ఆ సౌండ్ వినలకే బయటకు వెళ్లాలనుకుంటారు తల్లీకూతుళ్లు. కానీ, డోర్ లాక్ వేసి ఉంటుంది. అలా బయటకు వెళ్లలేక గురక సౌండ్ భరించలేక ఉండిపోతారు కామాక్షి, శ్రుతి. అలా రాత్రంతా తల్లీకూతుళ్లకు చుక్కలు చూపిస్తుంది శ్యామల. మరుసటి రోజు ఉదయం శ్యామల లేచి వెళ్లిపోతుంది. శ్రుతి ఏడుస్తుంటుంది. మరోవైపు బావ తన ఆనందానికి అడ్డు కట్ట వేశాడని దేవుడికి మొరపెట్టుకుంటుంది చంద్ర.
రఘురాంకు హారతి ఇచ్చి బొట్టుపెడుతుంది చంద్రకళ. మావయ్య మీరు కోలుకుంటే తప్ప నేను నిర్దోషిని నిరూపించుకోలేను. అలాగే, అత్తయ్య గారు మీకోసం చాలా బాధపడుతున్నారు. మీరు అర్థమవుతుంది కదా అని చంద్రకళ అంటే.. రఘురాం కనురెప్పలు ఆడిస్తాడు. దాంతో సంతోషించిన చంద్రకళ క్రాంతి మావయ్య కనురెప్పలు వాల్చారు అని చెబుతుంది.
శాలినిని తిట్టిన శ్యామల
అందరిని పిలుస్తుంది. అంతా వస్తే మావయ్య కళ్లు ఆర్పారు అని చెబుతుంది. మావయ్య కోలుకుంటున్నారు అని చెబుతుంది. జగదీశ్వరి సంతోషంగా కళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్యను ఇంప్రెస్ చేయడానికి నువ్ కావాలనే అంటున్నావా అని శాలిని అంటుంది. దాంతో శాలినిని శ్యామల తిడుతుంది. కామాక్షి కూడా ఎవరు చూడలేదు కదా అని అంటుంది.
నిజమే చెబుతున్నా. మళ్లీ చూపిస్తా అని నాకోసం కళ్లు ఆర్పరా అని రఘురాంను వేడుకుంటుంది చంద్రకళ. కానీ, రఘురాం కళ్లు ఆర్పడు. నువ్వేదో భ్రమ పడి ఉంటావని శ్రుతి అంటుంది. చంద్రకళ నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నా. ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని శ్యామల అంటుంది. ఆయన కోలుకుంటే మంచిదేగా అని జగదీశ్వరి అంటుంది.
ఈ పిల్లకు చంద్ర అంటే ఏదో ఈర్శ్య ఉన్నట్లుంది. చెబుతా దీని సంగతి అని శాలిని గురించి అనుకుంటు వెళ్లిపోతుంది శ్యామల. నేను చెబుతుంది నిజమే అత్తయ్య అని చంద్రకళ అంటే.. నేను శ్యామలను కాదు. గుడ్డిగా నమ్మేయడానికి. నా ఫీలింగ్స్‌తో ఆడుకోకు. నా తాళిని ఎగతాళి చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జగదీశ్వరి. విరాట్ కూడా చీదరించుకుని వెళ్తాడు.
సిగ్గుండాలంటూ
ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి సిగ్గుండాలి అని చంద్రకళను అనేసి వెళ్లిపోతుంది శాలిని. మరోవైపు ఈ చంద్రవళ్ల ఉదయం లేవడం లేట్ అవుతుంది. బోర్డ్ మీటింగ్‌కు కావాల్సిన ఫైల్స్ డిస్ ఆర్డర్లో ఉన్నాయి. సెట్ చేయాలి అని అన్ని పరుస్తాడు విరాట్. ఇంతలో ఫ్యాన్ గాలికి అన్ని ఎగిరిపోతే ఫ్యాన్ ఆపుతాడు విరాట్. ఇంతలో చంద్ర వచ్చి రఘురాం కళ్లు ఆర్పడం గురించి చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్