స్టీవ్ స్మిత్ సంచలనం.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు.. లార్డ్స్ లో అదుర్స్.. కానీ కోహ్లి వెనకాలే!

Best Web Hosting Provider In India 2024


స్టీవ్ స్మిత్ సంచలనం.. డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు.. లార్డ్స్ లో అదుర్స్.. కానీ కోహ్లి వెనకాలే!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అదరగొట్టాడు. లార్డ్స్ లో సంచలనం నమోదు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో హిస్టరీ క్రియేట్ చేశాడు. డాన్ బ్రాడ్ మన్ రికార్డును బ్రేక్ చేశాడు.

స్టీవ్ స్మిత్ (Action Images via Reuters)

లార్డ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సత్తాచాటాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మ్యాచ్ లో తొలి రోజు స్మిత్ మెరిశాడు. బుధవారం (జూన్ 11) ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 36 ఏళ్ల స్మిత్ 112 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తన టీమ్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో స్మిత్ క్రీజులోకి వచ్చి ఆదుకున్నాడు. అతను 10 బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలోనే చరిత్ర నెలకొల్పాడు.

ఆ దిగ్గజాలను దాటి

డాన్ బ్రాడ్‌మన్, గ్యారీఫీల్డ్ సోబర్స్, వారెన్ బ్రాడ్స్‌లీ వంటి లెజెండ్‌లను దాటి స్మిత్ చిరస్మరణీయమైన రికార్డును నెలకొల్పాడు. లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా నిలిచాడు. స్మిత్ ఇప్పుడు లార్డ్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 591 పరుగులు చేశాడు. ఈ కుడిచేతి బ్యాటర్ లార్డ్స్‌లో 59.10 సగటుతో మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు బాదాడు. ఇక్కడ అతని అత్యధిక స్కోరు 215.

లార్ట్స్ రికార్డులు

బుధవారం స్మిత్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి.. లార్డ్స్‌లో (విదేశీ బ్యాటర్లలో) అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను అవుటయ్యే సమయానికి, ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ బార్డ్స్‌లీ (5 మ్యాచ్‌లలో 575 పరుగులు), వెస్టిండీస్‌కు చెందిన గ్యారీఫీల్డ్ సోబర్స్ (5 మ్యాచ్‌లలో 571 పరుగులు), ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మన్ (4 మ్యాచ్‌లలో 551 పరుగులు)ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు

స్టీవ్ స్మిత్ లెజెండరీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించి, ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్లలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ ఈవెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇది స్మిత్ ఏడవ యాభై ప్లస్ స్కోరు. సచిన్ 15 మ్యాచ్‌లలో 682 పరుగులు చేసి 48.71 సగటుతో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.

కింగ్ దే జోరు

కానీ విరాట్ కోహ్లి రికార్డుకు స్మిత్ చాలా దూరంలో ఉన్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లకు తిరుగులేని రాజుగా కొనసాగుతున్నాడు కింగ్ కోహ్లి. అతను ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో 1,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. 24 ఇన్నింగ్స్‌లలో 51.20 సగటుతో 1,024 పరుగులు చేశాడు. 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 117 అత్యుత్తమ స్కోరు సాధించాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link