





Best Web Hosting Provider In India 2024

ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫేక్ ఐడీతో ఫాలో అవుతున్నా.. దర్శకుడు కథ చెప్పకుండా వెళ్లిపోయాడు.. నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్
ప్రియదర్శి, రాక్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మిత్ర మండలి. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న మంత్రి మండలి టీజర్‌ను జూన్ 12న విడుదల చేశారు. మిత్ర మండలి టీజర్ రిలీజ్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నూతన దర్శకుడితో మూవీ
మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
మిత్ర మండలి టీజర్ లాంచ్
మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న గురువారం (జూన్ 12) ఉదయం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిత్ర మండలి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
మొదటి సినిమాగా
మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్‌ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని అన్నారు.
యంగ్ స్టర్స్‌తో ఎక్కువ టైమ్
“నేను యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్లిపోయాడు” అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
అది తెలిసిన మనిషి
“నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్‌గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు” అని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు.
మంచి అనుభవం ఉంది
“సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మాయిని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. ఫేక్ ఐడెంటిటీతో. నువ్ చాలా స్పీడ్ ఇన్‌స్టాలో. ఒరిజినల్ ఐడీతో ఫాలో అవుతో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతారు. అదంతా ఎందుకనీ. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. మిత్ర మండలి టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం