జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట..! విడుదలకు ఆదేశాలు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట..! విడుదలకు ఆదేశాలు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి ఊరట లభించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. కొమ్మినేని తరపున న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు ఆయన్ను విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు (AFP)

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు… బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం… కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని ప్రశ్నించింది. నవ్వితే మాత్రం అరెస్ట్ చేస్తారా..? అని వ్యాఖ్యానించింది. ఆయన 70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ జర్నలిస్ట్ అని గుర్తు చేసింది.

కొమ్మినేనిని వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన షరతులను ట్రయల్‌ కోర్టు విధిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేని జైలు నుంచి ఇవాళే విడుదలయ్యే అవకాశం ఉంది.

అసభ్యకర వ్యాఖ్యలను సమర్థించలేదు…!

విచారణ సందర్భంగా…. కొమ్మినేని తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. మూడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని గుర్తు చేశారు. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని… సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదన్నారు. లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని గెస్ట్ ను… యాంకర్ కొమ్మినేని నియంత్రించారని గుర్తు చేశారు. అలాంటి వ్యాఖ్యాలను ఆయన సమర్థించలేదన్నారు.

తెలంగాణలో అరెస్టు చేసి 331 కి.మీ దూరంలో ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదన్నారు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అని… ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ అని… స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదు వాదించారు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమన్నారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21, 22(1)ను ఉల్లంఘించారని చెప్పారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని…వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారని ప్రస్తావించారు. అక్రమ అరెస్టుతో ఆయన హక్కులకు భంగం కలిగిందన్నారు.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్త్ ధవే వాదనలు వినిపించారు.ఒక షో నిర్వహిస్తున్న జర్నలిస్ట్… వాటితో సంబంధం లేదనటం సరికాదన్నారు. ఈ చర్యలన్నీ ప్రేరేపితమే అని వ్యాఖ్యానించారు. డిబేట్ లో గెస్ట్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటాన్ని ప్రోత్సహించాడని..పైగా నవ్వుతున్నారని వాదించారు. కోర్టు కలగజేసుకుంటూ… కేసుల విచారణ సందర్భంగా పలు సందర్భాల్లో మనం కూడా నవ్వుకుంటాం కదా అని గుర్తు చేసింది. అయినా నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది. ఆయన 70 సంవత్సరాల వయస్సు గల సీనియర్ జర్నలిస్ట్ అని గుర్తు చేసింది.

ఇరువైపు వాదనలు విన్న జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో జూన్‌ 9వ తేదీన కొమ్మినేనిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Supreme CourtAp GovtAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024