బ్రహ్మముడి జూన్ 14 ఎపిసోడ్: ఫొటోలతో పంతులును బెదిరించిన ఇందిరాదేవి- ఆఖర్లో ప్లేట్ తిప్పిన శాస్త్రి- పస్తులున్న రుద్రాణి!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 14 ఎపిసోడ్: ఫొటోలతో పంతులును బెదిరించిన ఇందిరాదేవి- ఆఖర్లో ప్లేట్ తిప్పిన శాస్త్రి- పస్తులున్న రుద్రాణి!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 14 ఎపిసోడ్‌లో కనకాంబరం అనే వీక్‌నెస్‌తో పంతులును గదిలోకి తీసుకెళ్లి యామిని పెళ్లి ఆపేయాలని చెబుతారు ఇందిరాదేవి, కనకం, అపర్ణ. కానీ, పంతులు వినకపోవడంతో ఫొటోలు తీసి ఇందిరాదేవి భయపడినట్లు చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇక గదిలో స్వప్నకు ఖైదీలుగా రాహుల్, రుద్రాణి ఉంటారు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 14వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దోషం పోవడానికి దుర్గమ్మ పూజకోసం శాస్త్రి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు. తన శిష్యుడుకి ఏం తెలియదని తిడుతుంటాడు. ఆ శాస్త్రి పంతులును కనకంకు అపర్ణ, ఇందిరాదేవి చూపిస్తారు. ఆ పంతులు నాకెందుకు తెలియదు. వాడికి ఒక వీక్‌నెస్ ఉందమ్మా. మనం దానిమీద దెబ్బకొడితే చచ్చినట్లు మన దారికి వస్తాడు అని కనకం అంటుంది.

కనకాంబరం వీక్‌నెస్

ఇంతకీ ఏంటా వీక్‌నెస్ అని అపర్ణ అడుగుతుంది. కనకాంబరం.. తన వీక్‌నెస్ పేరు కనకాంబరం. మీరు తన దగ్గరికి వెళ్లి మీకోసం కనకాంబరం ఎదురుచూస్తుందని గదిలోకి తీసుకురండి. అక్కడ ఆడిద్దాం తనతో కబాడి అని కనకం అంటుంది. అన్నట్లుగానే పంతులుతో మీకోసం కనకాంబరం ఎదురుచూస్తుందని, పైకి వెళ్లండని చెబుతారు అపర్ణ, ఇందిరాదేవి.

చాలా థ్యాంక్స్ అని పంతులు పైకి వెళ్తాడు. ఒసెయ్ కనకాంబరం నువ్వెందుకు వచ్చి చచ్చావే నన్ను ఇరికించడానికి కాకపోతేను అని తిడతాడు పంతులు. కనకంను చూసి షాక్ అవుతాడు పంతులు. నువ్వెవరు, నా కనకాంబరం ఎక్కడ అని పంతులు అంటాడు. ఇంతలో వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి మీ ఇంట్లోనే ఉందేమో అని అంటారు. ఏంటిదంతా అని పంతులు అడుగుతాడు.

సీక్రెట్స్ అందరూ వినకూడదుగా. ఈ పెళ్లి మీరు ఆపించేయాలి. మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని ఇందిరాదేవి, కనకం అంటారు. ఏంటీ ఈ పెళ్లి ఆపేయలా. ఈ పేరు శాస్త్రికే పేరాశ చూపిస్తున్నారా. మీ పప్పులు ఉడకవు. ఈ పేరు శాస్త్రి డబ్బులకు లొంగడు అని రివర్స్ అవుతాడు పంతులు. మరి ఎవరైనా ఏదైనా కారణం చేత మీరు పెట్టిన ముహుర్తాన్ని అడ్డుకోవాలని చూస్తే అని ఇందిరాదేవి అడుగుతుంది.

డీల్‌కు ఒప్పుకోనంటారు

అలా ఎవరైనా చేస్తే నా ఆగ్రహానికి గురి చేస్తాను. అవసరం అయితే చంపేస్తాను అని కోప్పడతాడు పంతులు. పంతులు మాట్లాడటాన్ని కనకం ఫొటోలు తీస్తుంది. మరి సజావుగా జరగాలని చూస్తే అని ఇందిరాదేవి అడిగితే.. వారికి నా ఆశీర్వాదాలు ఇస్తాను అని పంతులు అంటాడు. మీ ముహుర్తాన్ని డిస్టర్బ్ చేయొద్దంటారు. మా డీల్‌కు ఒప్పుకోను అంటారు అని ఇందిరాదేవి అంటుంది.

అవును అని పంతులు అంటాడు. కనకం ఓసారి తీసిన ఫొటోలు చూపించు అని చెబుతుంది ఇందిరాదేవి. ఏంటండి నేను మిమ్మల్ని బెదిరించినట్లు అలా భయపడ్డారేంటండి అని పంతులు అనుమానంగా అడుగుతాడు. నన్ను మీరు చంపాలని బెదిరించారని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను అని ఇందిరాదేవి అంటుంది. అది ఎవరు నమ్మరు. కావాలంటే వెళ్లండి అని పంతులు అంటాడు.

పోలీసులు నమ్మరు. కానీ, కనకాంబరం నమ్ముతుంది కదా. అప్పుడు కహానీ అంతా చెప్పేస్తాను అని ఇందిరాదేవి అంటుంది. తనకు విషయం తెలిస్తే నా పని గోవిందా. ఇక ఏం చేయాలో చెప్పండి. పెళ్లి ఆపితే ఆ యామిని చంపేస్తుంది. ఎలా ఆపాలో మీరే చెప్పండి అని పంతులు అంటాడు. అది ఎలాగో మీరే చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. ముగ్గురుని దగ్గరికి పిలిచి పెళ్లి ఆపేందుకు ప్లాన్ చెబుతాడు పంతులు.

రాజ్ రౌడీయిజం

సూపర్ అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు కావ్య వెంట రాజ్ పడతాడు. ఇందాక మీకు విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతాను అని రాజ్ అంటాడు. చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్లు నా వెంట పడుతున్నారు ఏంటండి. యామినితో పెళ్లికి ఒప్పుకున్నారు. అదేగా చెప్పేది అని కావ్య అంటుంది. కాదు. ఏదో యుద్ధం జరుగుతున్నట్లు అలా వెళ్లిపోతున్నారు. ఒక్కసారి వింటేనే కదా ఏం చెబుతున్నానో తెలిసేది అని కోపంగా అంటాడు రాజ్.

ఏంటండి రౌడీయిజం చేస్తున్నారు. వినకపోతే కొట్టేస్తారా ఏంటీ అని కావ్య అంటుంది. దాంతో కావ్య చేయి పట్టుకుని రాజ్ తన గుండెలపై పెట్టుకుని నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో విన్నారా. మీతో విషయం చెప్పకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. యామిని నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది కాబట్టి ఒప్పుకున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా వల్ల ఒక ప్రాణం పోతుందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నా అని రాజ్ చెబుతాడు.

చనిపోతాని బెదిరిస్తే పెళ్లికి ఒప్పుకుంటారా రామ్ గారు. రేపు మీ పెళ్లి అయిపోయాక ఇంకో అమ్మాయి వచ్చి చచ్చిపోతానంటే పెళ్లి చేసుకుంటారా. భయపడి కాదండి మనసుకు అనిపిస్తే పెళ్లి చేసుకోవాలి. ఆ మనిషి కళ్లముందు లేకపోతే మనం బ్రతకలేం అనిపిస్తే చేసుకోవాలి. అలా అనిపించే వ్యక్తి ఉన్నారా అని కావ్య అంటుంది. రాజ్ చెప్పబోతుంటే నాకు వద్దండి మీ అంతరాత్మకు చెప్పుకోండి. అది మీ మనసును అడిగి తెలుసుకోండి అని కావ్య వెళ్లిపోతుంది.

అడుక్కున్న రాహుల్

మరోవైపు గదిలో రాహుల్, రుద్రాణి బంధించి ఉంటారు. పొద్దున్నుంచి వాటర్ లేదు ఏం లేదు. ఆకలి అవుతుందని రాహుల్ కోప్పడతాడు. డోర్ దగ్గరికి వెళ్లి స్వప్న డోర్ తీయి.. ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నాకు బాగా ఆకలి అవుతుందే అని అడుక్కుంటాడు రాహుల్. ఎంట్రా అలా అడుక్కుంటున్నావ్. ఒక్కపూట తినకుంటే చస్తావా అని రుద్రాణి అంటుంది.

ఇంతలో రుద్రాణికి యామిని కాల్ చేస్తుంది. యామినిని ఇక్కడికి రమ్మని మనల్ని తీసుకెళ్లమని చెబుతాడు రాహుల్. అలా చేస్తే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోనివాళ్లం దానికెలా హెల్ప్ చేస్తామనుకుంటుంది అని రుద్రాణి అంటుంది. నీ ప్లాన్ సైలెంట్‌లో ఉందా. ఈ పెళ్లి ఆగకుండా చూసుకుంటా అన్నావ్. అసలు వచ్చావా పెళ్లికి అని యామిని అంటుంది.

పక్కనే ఉన్నా. టైమ్ చూసుకుని ఎంట్రీ అవుదామని చూస్తున్నా అని రుద్రాణి అంటుంది. మరోవైపు హ్యాపీగా యాపిల్ తింటూ ఉన్న స్వప్న ఆహా వీళ్లిద్దరిని ఇలా జైలులో ఖైదీల్లా బంధిస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో ఇలా చేసేదాన్ని. రోజంతా వీళ్లను ఇలాగే పస్తులు ఉంచితే దెబ్బకు కొవ్వంతా కరిగిపోతుంది అని స్వప్న అనుకుంటుంది.

కావ్య అనుమానం

పంతులుతో ఇందిరాదేవి, అపర్ణ, కనకం రావడం చూసి కావ్య చూస్తుంది. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. మీరు పంతులును బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నారా అని కావ్య అంటుంది. మాకేం పని లేదా అని ఇందిరాదేవి అంటుంది. పంతులును కావ్య అడిగితే కనకం కవర్ చేస్తుంది. దాంతో అంతా వెళ్లిపోతారు. మా అమ్మ ఏదో చేస్తుంది అని కావ్య అనుకుంటుంది.

తర్వాత పూజ స్టార్ట్ చేస్తాడు పంతులు. యామినిని తీసుకురమ్మంటే యామిని వస్తుంది. పంతులు పూజ చేస్తాడు. దాంతో కావ్యవైపు ఏదో సాధించినట్లుగా యామిని చూస్తుంది. తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వమని యామినికి చెబుతాడు పంతులు. యామిని హారతి ఇస్తుంటే కూలర్ గాలి పెట్టి ఆరిపోయేలా చేస్తుంది కనకం. దాంతో అరిష్టం అని అపర్ణ అంటుంది.

ఏం జరిగిన ఈ పెళ్లి ఆగదు అని పంతులు అంటాడు. దాంతో అపర్ణ, ఇందిరాదేవి, కనకం షాక్ అవుతారు. పెళ్లి ఆపేస్తానని ప్లాన్ చేసి పంతులు ఆఖరిలో ఇలా ప్లేట్ తిప్పి రివర్స్ అయ్యాడేంటని అవాక్కవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024