





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో ట్రెండింగ్ లోకి దూసుకొచ్చిన సమంత హారర్ మూవీ.. మీరు చూశారా?
ప్రొడ్యూసర్ గా మారి సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ ‘శుభం’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. జియోహాట్స్టార్లో అదరగొడుతోంది ఈ సినిమా. కామెడీ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పిస్తోంది.
థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించి.. ఓటీటీలోకి దూసుకొచ్చిన శుభం మూవీ అదరగొడుతోంది. రిలీజైన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది. ప్రొడ్యూసర్ గా సమంత తొలి అడుగును అందరూ ప్రశంసిస్తున్నారు.
ఆ ఓటీటీలోకి
థియేటర్లలో మే 9న రిలీజైన శుభం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ లైన్, కొత్త యాక్టర్ల యాక్టింగ్ ఆడియన్స్ ను అలరించింది. కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శుభం మూవీ జూన్ 13న ఓటీటీలో అడుగుపెట్టింది. జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుభం మూవీ ఓటీటీలో అలరిస్తోంది.
ట్రెండింగ్ నంబర్ వన్
జియోహాట్స్టార్ ఓటీటీలో శుభం ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. తెలుగులో టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది. నవ్విస్తూనే భయపెట్టే ఈ మూవీ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తెలుగులో చూసుకుంటే శుభం తర్వాత జియోహాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డ్యానీ సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఆ భాషల్లో అలా
కన్నడ భాషలో శుభం మూవీ టాప్-2 ట్రెండింగ్ లో ఉంది. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తర్వాత శుభం సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక తమిళం, మలయాళం, హిందీ భాషల్లో శుభం మూవీ టాప్-5లో ఉంది. ఈ మూడు భాషల్లోనూ ఈ సినిమా ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది. స్టార్ నటి సమంత ప్రొడ్యూసర్ గా మారి తీసిన ఫస్ట్ సినిమా శుభం. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ స్థాపించిన సమంత తొలి ప్రయత్నం అందిరినీ ఆకట్టుకుంటోంది.
కథ ఇదే
శుభం సినిమా ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చింది. సీరియల్స్ చూస్తూ దెయ్యాల్లాగా ప్రవర్తించే భార్యలతో భర్తలు పడే తిప్పలు.. దాని వెనుక ఉండే కథ.. ఇలా సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఓ గ్రామంలో రాత్రి 9 అయిందంటే చాలు మగవాళ్లు భయపడే పరిస్థితి వస్తుంది. ఓ సీరియల్ చూస్తూ ఆడవాళ్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో భయపడే భర్తల పరిస్థితి నవ్వులు తెప్పిస్తోంది.
మరి ఆ సీరియల్ చూస్తూ మహిళలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటీ? మాతాజీగా స్పెషల్ క్యారెక్టర్ లో సమంత ఏం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా కథ.
సంబంధిత కథనం