సీఎం రేవంత్ ముందే తగ్గేదేలే డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024

సీఎం రేవంత్ ముందే తగ్గేదేలే డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి సారి ప్రతిష్ఠాత్మకం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అవార్డు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పడం వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్, బాల‌కృష్ణ‌, రేవంత్ రెడ్డి (x/Congress for Telangana)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం (జూన్ 14) రాత్రి హైదరాబాద్ లో హైటెక్స్ లో ఈ ఈవెంట్ కన్నుల పండుగగా సాగింది. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలతో కార్యక్రమం అదిరిపోయింది. అవార్డులు గెలుచుకున్నవాళ్లకు షీల్డ్ తో పాటు నగదు బహుమతి అందించారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ గా మారింది.

గద్దర్ పేరుతో

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలెట్టింది. గతంలో ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఇచ్చేవాళ్లు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అవార్డులు ఊసే లేకుండా పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తోంది.

ఉత్తమ నటుడు

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024కు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు. పుష్ప 2 సినిమాలో ఆయన యాక్టింగ్ ఈ అవార్డు దక్కింది. శనివారం జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి అల్లు అర్జున్ స్వయంగా హాజరై అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ వైరల్ గా మారింది.

స్పీచ్ ఇదే

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దిల్ రాజు, వేదికపై ఉన్న పెద్దలందరికీ థ్యాంక్యూ సో మచ్. మా లవ్ లీ డైరెక్టర్ సుకుమార్ లేకుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు. డార్లింగ్ థ్యాంక్యూ సో మచ్. ఐ లవ్ యూ. పుష్ప 2 సినిమాకు గెలిచిన మొదటి అవార్డు ఇది. దీన్ని ఫ్యాన్స్ కే అంకితం చేస్తున్నా’’ అని అల్లు అర్జున్ చెప్పారు.

ఆ డైలాగ్ వైరల్

ఇది ఫిల్మ్ అవార్డు కాబట్టి సరదాగా ఒక డైలాగ్.. అని రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని పుష్ప 2లోని డైలాగ్ చెప్పాడు అల్లు అర్జున్. ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా కొండ గంగమ్మ తల్లి జాతరలో యాట తలను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కణ్ని. పుష్ఫ.. పుష్ప రాజ్. అస్సలు తగ్గేదేలే’’ అని డైలాగ్ చెప్పాడు ఐకాన్ స్టార్. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అప్పుడు విమర్శలు

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ను విమర్శించారు. బయట పరిస్థితి బాలేదని చెప్పినా లోపల సినిమా చూస్తూ కూర్చున్నారని, ఇప్పటివరకూ బాధిత కుటుంబాన్ని కలవలేదని అల్లు అర్జున్ పై రేవంత్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేవంత్ చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడమే కాకుండా డైలాగ్ కూడా చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ జోరుమీదున్నారు. వీడియోలు తెగ షేర్ చేస్తున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024