





Best Web Hosting Provider In India 2024

హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్న ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు ఇక్కడ చూసేయండి.. తెలుగులోనే!
ఇవాళ (జూన్ 15) ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. నాన్న గురించి, నాన్న ప్రేమ గురించి చెప్పే తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నేడు ఫాదర్స్ డే సందర్భంగా ది బెస్ట్ 5 సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇవాళ ఆదివారం (జూన్ 15) ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే 2025. ప్రతి ఒక్కరు తమ నాన్నకు ప్రేమతో విషెస్ తెలియజేస్తారు. ఇక తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. నాన్న ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, అనురాగం, ఎమోషన్ గురించి చెప్పడానికి ఎన్నో కథలు, ఉదాహారణలు ఉన్నాయి.
నిజమైన హీరో తండ్రి
ఒక కొడుకుకు నిజమైన హీరో తండ్రి మాత్రమే. అందుకే ఆ తండ్రి హీరోయిజం గురించి చెప్పేలా ఎన్నో సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చాయి. వాటిలో ఒకటి తక్కువ, మరోటి ఎక్కువ అని చెప్పలేం. కానీ, చూసేందుకు వీలుగా ఉండే కొన్ని బెస్ట్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. తండ్రి ప్రేమ ఏంటో చూపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.
అనగనగా ఓటీటీ
రీసెంట్గా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనగనగా. ఈటీవీ విన్లో తెలుగులో అనగనగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వ్యాస్, అతని కుటుంబం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. కొడుకు కోసం తండ్రిగా, టీచర్‌గా వ్యాస్ చేసే ప్రయత్నం చాలా ఎమోషనల్‌గా హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం వచ్చాయి.
హాయ్ నాన్న ఓటీటీ
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కూతురిని కాపాడుకునే ఓ తండ్రి పడే ఆవేదనతో తెరకెక్కిన సినిమానే హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హాయ్ నాన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
జెర్సీ ఓటీటీ
ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడితే చనిపోతానని తెలిసి కేవలం కొడుకు తనను హీరోగా చూడాలనే ఆశతో ఓ నాన్న ఆడే గేమే జెర్సీ. ఇది కూడా నేచురల్ స్టార్ నాని కెరీర్లో సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లోనే జెర్సీ ఓటీటీ రిలీజ్ అయింది.
నాన్న ఓటీటీ
చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి తండ్రిగా మారితే ఎలా ఉంటుంది, తన కూతురు కోసం ఆ తండ్రి ఏం చేశాడు అనేదే విక్రమ్ నటించిన నాన్న మూవీ. ఈ సినిమా చూసి ఎమోషనల్ అవ్వని వారుండరు. అలాంటి నాన్న యూట్యూబ్‌లో తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఫైండింగ్ నీమో ఓటీటీ
ఫైండింగ్ నీమో యానిమేషన్ మూవీ అయినప్పటికీ తండ్రి ప్రేమను చాలా బాగా చూపించారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే ధైర్యసాహాసాలను చేపలతో చూపించిన సినిమా ఇది. కామెడీతోపాటు మోటివేషన్ ఇచ్చేలా ఈ మూవీ ఉంటుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగులో ఫైండింగ్ నీమో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం