





Best Web Hosting Provider In India 2024

డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న బాలీవుడ్ రొొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్విస్ట్ లతో సాగే లవ్ స్టోరీ
బాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సినిమా లో ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల జోడీని ఎంటర్ టైనింగ్ గా చూపించనున్నారు. ఆ మూవీ ఏంటో? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
ఓటీటీల్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అనే భాషాభేధాలు ఉండవు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మూవీ అయినా ఓటీటీలో మిగతా భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ కారణంగా ఇతర భాషల సినిమాలనూ తెలుగులో మన ఆడియన్స్ చూసేస్తున్నారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ వస్తున్న ఆ మూవీ పేరు ‘ఆప్ జైసా కోయి’. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రాబోతోంది.
డైరెక్ట్ ఓటీటీలోకి
బాలీవుడ్ మూవీ ‘ఆప్ జైసా కోయి’ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది డిజిటల్ బాట పడుతోంది. ఈ ఆప్ జైసా కోయి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ మంగళవారం (జూన్ 17) అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
అయిదు భాషల్లో
ఆప్ జైసా కోయి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలోకి రానుంది. ఒరిజినల్ హిందీ లాంగ్వేజ్ లో ఉన్నప్పటికీ ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి వివేక్ సోని డైరెక్టర్. కరణ్ జోహార్ తో పాటు సోమెన్ మిశ్రా, అపూర్వ మెహ్తా ప్రొడ్యూసర్లు.
ఇద్దరి రొమాంటిక్ కథ
రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఆప్ జైసా కోయి తెరకెక్కింది. హాయిగా చూసేలా, మనసుకు హత్తుకునేలా ఈ మూవీని వివేక్ సోని రెడీ చేశారు. రెండు వేర్వేరు ప్రపంచాలు కలిగిన ఓ ఆడ, మగ కలిసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్లు సాగించే జీవితమే ఈ సినిమా. శ్రీరేణు (ఫాతిమా) ఏమో సంప్రదాయబద్ధంగా జీవించే అమ్మాయి. మధు బోస్ (మాధవన్) ఏమో సారీ చెప్పేందుకు ఇష్టపడని అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్, లవ్, కోపాలు, ఆధిపత్యం కలగలిపిన స్టోరీనే ఈ సినిమా.
ఈ దంపతుల ప్రయాణంలో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తోంది. గుండెను బరువెక్కించే సన్నివేశాలకూ కొదవ ఉండదని టాక్. ఇక కామెడీకి ఎలాంటి లోటు లేదు. ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియో చూస్తేనే అది అర్థమవుతుంది. మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ కామెడీ మూవీ చూడాలనుకునే వాళ్లకు ఆప్ జైసా కోయి నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.
సంబంధిత కథనం