ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ తెలుగు హారర్ కామెడీకి సూపర్ రెస్పాన్స్.. నాలుగు రోజుల్లోనే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ తెలుగు హారర్ కామెడీకి సూపర్ రెస్పాన్స్.. నాలుగు రోజుల్లోనే..

Hari Prasad S HT Telugu

తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. సమంత నిర్మించిన ఈ సినిమాకు జియోహాట్‌స్టార్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గత వారమే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.

ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ తెలుగు హారర్ కామెడీకి సూపర్ రెస్పాన్స్.. నాలుగు రోజుల్లోనే..

స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా శుభం. ఆడవాళ్లకు ఉండే సీరియల్స్ పిచ్చి ఆధారంగా రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.

శుభం ఓటీటీ స్ట్రీమింగ్

మే 9న థియేటర్లలో రిలీజైన మూవీ శుభం.. నెల రోజుల తర్వాత జూన్ 13 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే 150 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు ఆ ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. అసలు పెద్దగా స్టార్లు ఎవరూ లేకుండా, చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ మామూలు విషయం కాదు.

థియేటర్లలోనూ బాక్సాఫీస్ దగ్గర మూవీ లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఊహించినట్లే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చచ్చినా చూడాల్సిందే అంటూ సీరియల్స్ ముగియకుండానే చనిపోయే వాళ్లు ఆత్మలుగా వచ్చి టీవీల ముందు కూర్చోవడం అన్న భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.

శుభం ఓటీటీ హక్కులు

నిజానికి శుభం మూవీకి తొలి రోజు థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆ సినిమా ఓటీటీ హక్కులపై దాని ప్రభావం కనిపించింది. మొదట జీ5 ఓటీటీ ఈ హక్కులను సొంతం చేసుకున్నా.. తర్వాత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత జియోహాట్‌స్టార్ ఏకంగా రూ.3 కోట్లకు దక్కించుకుంది.

ఈ డీల్ వల్ల సమంతకు మంచి లాభాలే వచ్చాయి. ఆమె మొదలుపెట్టిన ట్రాలాలా సంస్థే ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ జానర్లో శుభం సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులు తెరకెక్కించినా.. చివర్లో దీనిద్వారా ఇచ్చిన సందేశం మాత్రం మహిళా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది.

భీమునిపట్నం ఊళ్లో జరిగే స్టోరీ ఇది. అక్కడి ఊళ్లోని ఆడవాళ్లందరూ రాత్రి 9 అయిందంటే చాలు వింతగా ప్రవర్తిస్తుంటారు. టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ సమయంలో వాళ్లకు అడ్డుగా వచ్చే భర్తలను కూడా చితగ్గొడుతుంటారు. అసలు వాళ్లకు ఏమైంది? దీనికి ఆ ఊళ్లోని మగవాళ్లు కనుగొనే పరిష్కారం ఏంటి అన్నదే శుభం మూవీ స్టోరీ. ఇందులో సమంత కూడా ఓ చిన్న పాత్ర చేసింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024