





Best Web Hosting Provider In India 2024

నెల రోజుల్లోపే ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళ క్రైమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి
ఓటీటీలోకి నెల రోజుల్లోపే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో ఏకంగా 8.9 రేటింగ్ ఉన్న ఈ సినిమా పేరు ది వర్డిక్ట్. ఈ మూవీ విశేషాలు, స్ట్రీమింగ్ డేట్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా ది వర్డిక్ట్ (The Verdict). మే 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సుహాసినిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉంది. ఈ మూవీ జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ది వర్డిక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్
కొత్త దర్శకుడు కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ది వర్డిక్ట్. శ్రుతి హరిహరన్, వరలక్ష్మి శరత్‌కుమార్, సుహాసిని మణిరత్నం, ప్రకాష్ మోహన్‌దాస్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ‘ది వర్డిక్ట్’ మూవీ మే 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే షూట్ చేయడం విశేషం.
ఈ మూవీని జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఓ హత్య, ఎంతో మంది అనుమానితులు, కోర్టు రూమ్ లో వాదనల చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ‘ది వర్డిక్ట్’ థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తోంది.
ది వర్డిక్ట్ మూవీ గురించి..
ది వర్డిక్ట్ మూవీని కృష్ణ శంకర్ డైరెక్ట్ చేశాడు. ఓ ధనవంతురాలైన ఓ అమెరికన్ మహిళను హత్య చేసినట్లుగా ఓ ఇండియన్ మహిళపై ఆరోపణలు వస్తాయి. ఆమెను ఎంతగానో ప్రేమించే భర్త.. తన భార్యను ఈ కేసు నుండి బయటపడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో నమ్రత అనే ఇండియన్ మహిళ పాత్రలో శృతి హరహరన్ నటించింది.
ఇక హత్యకు గురయ్యే అమెరికన్ మహిళ ఎలిజాగా సుహాసిని కనిపించింది. నమ్రత తరఫున కోర్టులో వాదించే లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ఓ కోర్ట్ రూమ్ డ్రామానే కాదు.. ఇందులో ఓ లవ్ స్టోరీ, రివేంజ్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉన్నాయని రిలీజ్ కు ముందు శృతి చెప్పింది.
ది వర్డిక్ట్ కథేంటంటే?
ది వర్డిక్ట్ మూవీలో నమ్రత, ఎలిజా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఎలిజా తన వీలునామాను నమ్రతకు కూడా భారీ లబ్ధి చేకూరేలా రూపొందిస్తుంది. దీంతో ఎలిజా హత్యలో నమ్రతే ప్రధాన అనుమానితురాలిగా ఉంటుంది. మరి ఆమె నిజంగానే తన ఫ్రెండ్ ను చంపిందా లేదా అన్నదే ఈ ది వర్డిక్ట్ మూవీ కథ. అడ్వొకేట్ మాయ పాత్రలో వరలక్ష్మి నటించింది.
ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కథకు తగినట్లుగా నిర్మాణ విలువలు లేనట్లుగా కొందరు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. మరి జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం