ఎక్కువ కాలం జీవించాలంటే.. హార్ట్ సర్జన్ చెప్పిన రహస్యం

Best Web Hosting Provider In India 2024

ఎక్కువ కాలం జీవించాలంటే.. హార్ట్ సర్జన్ చెప్పిన రహస్యం

HT Telugu Desk HT Telugu

రోజువారీ పనులు సులభంగా చేసుకోవడానికి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కండర ద్రవ్యరాశిని (Muscle Mass) కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ నొక్కి చెప్పారు. కండర ద్రవ్యరాశి మన శరీర ధర్మశాస్త్రాన్ని ఎలా మారుస్తుందో ఆయన వివరించారు.

కండర ద్రవ్యరాశి బాగుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని వైద్యుల మాట

మీరు జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలు (strength training) చేసినప్పుడు, కేవలం కండరాల ద్రవ్యరాశిని పెంచుకోవం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా దీర్ఘాయువు రహస్యాన్ని కూడా తెలుసుకుంటారని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ అంటున్నారు. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం జీవించడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం. కండరాలను పెంచుకోవడం దీనికి ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చునని చెబుతున్నారు.

దీర్ఘాయువుకు కండరాలు ఎందుకు అంత ముఖ్యం?

జూన్ 17న షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కండరాలు దీర్ఘాయువుకు ఎందుకు ముఖ్యమైన అవయవమో డాక్టర్ జెరెమీ వివరించారు. ‘మనం వయసు పెరిగే కొద్దీ పురుషులు, స్త్రీలు ఇద్దరూ కండర ద్రవ్యరాశిని కోల్పోతారు. వృద్ధాప్యంలో బలహీనంగా మారకుండా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం..’ అని వివరించారు.

మరి కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడం మొదలుపెడితే ఏం జరుగుతుంది? ‘‘మీరు కండర ద్రవ్యరాశిని కాపాడుకుంటే రోజువారీ సాధారణ పనులను మరింత సులభంగా చేయగలరు. నేలమీద కూర్చుని లేవడం, కారులోంచి దిగడం లేదా మెట్లు ఎక్కడం, దిగడం వంటివి స్థిరత్వంతో చేయవచ్చు’’ అని ఆయన వివరించారు.

‘కండర ద్రవ్యరాశి మన శరీర ధర్మాన్ని మారుస్తుంది’

కండర ద్రవ్యరాశిని పెంచుకోవడం మన శరీర ధర్మాన్ని (physiology) ఎలా మారుస్తుందో డాక్టర్ వివరించారు. “ఇది మన శరీరంలో గ్లూకోజ్‌కు ఒక తొట్టి వంటిది. దీర్ఘకాలికంగా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తాయని మనకు తెలుసు. ఇవి గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాలు. కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడం ద్వారా మనం అన్ని కారణాల వల్ల వచ్చే మరణాల రేటును తగ్గించుకోవచ్చు” అని ఆయన వివరించారు.

దీన్ని ఎలా సాధించాలి?

మీ వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా ఆహారంలో తగినంత ప్రోటీన్‌ను చేర్చుకోవాలని డాక్టర్ సూచించారు. “అలాగే నాణ్యతతో కూడిన రెసిస్టెన్స్ ప్రోగ్రామ్ మీకు అవసరం” అని ఆయన స్పష్టం చేశారు.

మీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో స్థిరంగా ఉండటానికి మీరు ఇష్టపడే దానితో ప్రారంభించాలని, వ్యాయామం చేసేటప్పుడు గాయాలు కాకుండా చూసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అంత సులభం కానప్పటికీ, ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మీ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని, నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని ఆయన తెలిపారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024