నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 18: బయటకు గెంటేస్తుంది.. చంద్రకళకు విరాట్ వార్నింగ్.. శ్యామల ప్రశ్నలతో టెన్షన్

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 18: బయటకు గెంటేస్తుంది.. చంద్రకళకు విరాట్ వార్నింగ్.. శ్యామల ప్రశ్నలతో టెన్షన్

నిన్ను కోరి సీరియల్ జూన్ 18 ఎపిసోడ్ లో రఘురాం యాక్సిడెంట్ గురించి తెలిసి శ్యామల ఫైర్ అవుతుంది. చంద్రకళ కుటుంబ సభ్యుల గురించి ప్రశ్నలు వేస్తుంది. మరోవైపు చంద్రకళకు విరాట్ వార్నింగ్ ఇస్తాడు. మధ్యలో వచ్చి జగదీశ్వరి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

నిన్ను కోరి సీరియల్ జూన్ 18 ఎపిసోడ్ (jiohotstar)

నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కావాలని యాక్సిడెంట్ చేయడం ఏంటీ అని శ్యామల కోపంతో ఊగిపోతూ గిరిజతో అంటుంది. అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని శ్యామల ఫైర్ అవుతుంది. ఏదో దాస్తున్నారని శ్యామల అంటే.. అలాంటిదేమీ లేదని జగదీశ్వరీ చెప్తుంది. మీ అన్న వరదరాజులు పనే కదూ అంటూ శ్యామల ఆగ్రహంతో రగిలిపోతుంది. అత్తయ్య ఆవేశపడకు అని విరాట్ కంట్రోల్ చేయాలని చూస్తాడు.

చంద్రకళకు టెన్షన్

చంద్రకళ నీ తల్లిదండ్రులు అలాంటి వాళ్లు కాదు కదా అని శ్యామల అనే సరికి అందరూ తెగ టెన్షన్ పడతారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి ఎక్కడ బయటపడుతుందో అని చంద్ర వణికిపోతుంది. నీ అత్త పడ్డ కష్టం అంతా ఇంతా కాదు చంద్రకళ.. మా అన్నను చంపడానికి చాలా సార్లు ప్రయత్నించారని శ్యామల ఎమోషనల్ అవుతుంది. నీకు అలాంటి పరిస్థితి రాకూడదని చంద్రకళతో చెబుతుంది శ్యామల.

నీకు ఆ సమస్య రానివ్వను అని చంద్రకళతో అంటుంది శ్యామల. సమయం చూసుకునే నేనే మీ అమ్మానాన్నతో మాట్లాడతాను, అందరినీ ఒక్కటి చేస్తాను అనే సరికి చంద్రకళ, విరాట్ టెన్షన్ లో మునిగిపోతారు.

ఈ ట్విస్ట్ ఏంటీ?

ఇదేంటీ శ్యామల పిన్ని ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు. ఆమెనే నాకు బలం అనుకున్నా. కానీ నేను జగదీశ్వరి అత్తయ్య సొంత అన్నయ్య కూతుర్ని అని తెలిస్తే ఆవిడే నాకు శత్రువులా మారిపోతుంది. ఆవిడే నన్ను బావను విడదీస్తుంది. నా ఆశలన్నీ అఘాతంలోకి నెట్టేస్తారని అనుకోలేదు. శ్యామల పిన్నీకి నా మీద అభిమానం కంటే నా పుట్టింటి మీద ద్వేషమే ఎక్కువ ఉందని అర్థమైంది. ఇప్పుడు ఈ సమస్యను ఎలా దాటాలి? ఎన్ని రోజులని దాచగలం? కామాక్షీ వాళ్లు ఈ విషయాన్ని బయటపెడితే ఎలా? అంటూ తనతో తాను మాట్లాడుకుంటుంది చంద్రకళ.

ఇంట్లో నుంచి గెంటేస్తుంది

విరాట్ చంద్రకళతో శ్యామల పిన్నికి నీ గురించి తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని చెప్తాడు. మా నాన్న రక్తాన్ని కళ్లజూసింది మీ వాళ్లేనని, ఆ విషయాన్ని మా దగ్గర దాచేందుకు ప్రయత్నించావని తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండగలవా చంద్రా.. అత్తయ్య నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది అని చంద్రను విరాట్ భయపెడతాడు. నేనే అత్తయ్యకు చెప్పేయొచ్చు అని కంగారు పెడతారు. కానీ అమ్మకు నాపై ద్వేషం పెరిగే పని ఇంకా చేయనని విరాట్ ఊరుకుంటాడు.

గిలిగింతలు పెట్టేసి

నిజం ఎక్కువ రోజులు దాగదు, అది బయటపడ్డప్పుడు నీ నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను అని విరాట్ అంటాడు. సరే బావా, నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తానని చంద్రకళ చెప్తుంది. కానీ ఆ రోజు లోపు శ్యామల పిన్నీకే కాదు నీకు, అత్తయ్యకు కూడా నా తప్పు లేదని నిరూపిస్తాను అని చంద్ర అంటుంది. నిజంగా నీ తప్పు లేకపోయింటే ఈ రోజు మా అమ్మ, నాన్నతో కలిసి పెళ్లి జరిపించి ఉండేది. కానీ అందుకు నీకు శిక్ష తప్పదు. అదే ఈ తాళి. తాళి ఉంటుంది కానీ నేను నీతో ఉండను. కానీ విరాట్ కు గిలిగింతలు పెట్టిస్తూ నవ్వేస్తోంది చంద్ర.

ఫ్యామిలీ బయటపెట్టాలని

వరదరాజు కుటుంబం గురించి శ్యామల మాట్లాడగానే చంద్రకళ వణికిపోయిందని దుష్ట త్రయం మాట్లాడుకున్నారు. చంద్ర గురించి శ్యామలకు చెప్తే పంపిచేస్తారు కదా అని శ్రుతి అంటుంది. కానీ తాళికి గౌరవం ఇచ్చి జగదీశ్వరి ఊరుకుంటారని శాలిని చెప్తుంది. బయటకు పంపిస్తే ఆ చంద్ర పంచాయతీ పెడ్తానని చెప్పింది కదా అని కామాక్షి అంటుంది. అది తెలిస్తే ఇంటి పరువు పోతుందని జగదీశ్వరి అనుకుంటుంది. కానీ మనం ఇది వాడుకుని చంద్ర అంతు చూడాలని ఈ దుష్ట త్రయం అనుకుంటుంది.

మేడ్ ఫర్ ఈచ్ అదర్

చంద్రకళ పడిపోబోతుంటే విరాట్ పట్టుకుంటాడు. అది చూసి ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని శ్యామల పోగొడుతుంది. హీరో పట్టుకున్నాడు కదా కరెంట్ పాస్ అవుతుందని శ్యామల అంటుంది. బావా నీకు నా ప్రేమనంతా రంగరించి స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను అని చంద్ర అంటుంది. చూడచక్కనైనా జంట అని శ్యామల అంటే.. జంట అందంగానే ఉంది కానీ ఆ ఒక్క లోటు లేకుంటే బాగుండేది అని కామాక్షి పుల్ల పెడుతుంది. సొంతింటివాళ్ల గురించి తెలుసుకోవాలని శ్యామల అంటుంది.

శ్యామల ప్రశ్నలు

నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ ఉంటారు? అని చంద్రకళను శ్యామల అడగడంతో ట్విస్ట్ నెలకొంటుంది. ప్రాబ్లెం తెలిస్తే పరిష్కారం గురించి ఆలోచించొచ్చు కదా అని శ్యామల అంటుంది. ఇంతలోనే జగదీశ్వరి వచ్చి ఆ వివరాలను వదిలేయాలని అంటుంది. కామాక్షి పుట్టింటి వాళ్ల గురించి అడగొద్దని ఎన్ని సార్లు చెప్పానని జగదీశ్వరి అంటుంది. చంద్రకళ ఇంట్లోవాళ్ల టాపిక్ తీసుకొచ్చి చంద్రకళను ఇబ్బంది పెడదామని అనుకున్నావా అంటూ కామాక్షి పైనే రివర్స్ లో మండిపడుతుంది శ్యామల. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని శ్యామల అనడంతో ఈ రోజు నిన్ను కోరి ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024