జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి స్పెషల్ స్పై థ్రిల్లర్.. కమింగ్ సూన్ అంటూ వీడియో.. హాట్ బ్యూటీ మౌనీ రాయ్ యాక్షన్

Best Web Hosting Provider In India 2024

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి స్పెషల్ స్పై థ్రిల్లర్.. కమింగ్ సూన్ అంటూ వీడియో.. హాట్ బ్యూటీ మౌనీ రాయ్ యాక్షన్

జియోహాట్‌స్టార్‌ ఓటీటీ మరో స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ను ఫ్యాన్స్ కోసం తీసుకొస్తుంది. ఆడియన్స్ కు థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

జియోహాట్ స్టార్ ఓటీటీలో స్పై థ్రిల్లర్ (x/JioHotstar)

థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఓటీటీ స్పెషల్ కంటెంట్ తోనూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది జియోహాట్‌స్టార్‌. డిఫరెంట్ జోనర్లో ఆ ఓటీటీ స్పెషల్ సినిమా, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు స్పై థ్రిల్లర్ ను తీసుకొస్తుంది జియోహాట్‌స్టార్‌. మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ స్పై ఫిల్మ్ ఉంటుందని జియోహాట్‌స్టార్‌ ఓటీటీ చెప్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.

సలకార్ పేరుతో

సలకార్ పేరుతో స్పెషల్ ఫిల్మ్ ను తీసుకురాబోతోంది జియోహాట్‌స్టార్‌ ఓటీటీ. ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పై థ్రిల్లర్ గా దీన్ని రెడీ చేస్తోంది. బుధవారం (జూన్ 18) సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన జియోహాట్‌స్టార్‌ ఈ స్పెషల్ ఫిల్మ్ టైటిల్ ను రివీల్ చేసింది. ‘‘దేశ భద్రత కోసం అత్యున్నత అంకితభావంతో పని చేసే అసాధారణ స్పై మాస్టర్ ను చూడండి. హాట్ స్టార్ స్పెషల్స్ సలకార్ త్వరలోనే జియో హాట్ స్టార్ లోకి వస్తుంది’’ అని వీడియోను పోస్టు చేసింది.

లెజెండ్

జియోహాట్‌స్టార్‌ స్పెషల్ సలకార్ ఫిల్మ్ ను టాప్ లెవల్ గా తీర్చిదిద్దినట్లు తెలిసింది. సలకార్ టైటిల్ కు ‘ది లెజెండ్ ఆఫ్ ఆన్ ఎక్స్ ట్రార్డినరీ ఇండియన్ స్పై’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఇప్పటివరకూ వచ్చిన స్పై సినిమాల కంటే ఇది బెటర్ గా ఉంటుందని ఈ ఓటీటీ చెప్తోంది. ఈ జియోహాట్‌స్టార్‌ స్పెషల్ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు.

హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ఈ సలకార్ ఫిల్మ్ లో యాక్ట్ చేసినట్లు సమాచారం. అందంతో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆమె అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ మౌనీ రాయ్ ట్రెండింగ్ లోనే ఉండే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇండియన్ ఏజెంట్ కబీర్ గా అయాన్ లాల్ నటించారని సమాచారం. ఈ జియోహాట్‌స్టార్‌ స్పెషల్ ఫిల్మ్ కు ఫారుక్ కబీర్ డైరెక్టర్. సురాగ్ బ్రహ్మభట్ ప్రొడ్యూసర్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024