





Best Web Hosting Provider In India 2024

బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. తెలుగు, తమిళంలో ఒక నిమిషం మాత్రమే తేడా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించిన సినిమా కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఎన్నో బ్యూటిపుల్ సినిమాలు అందించిన ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందించిన కుబేర మూవీలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్
అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్‌తో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా కుబేర విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి?
–మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
ఎమోషనల్ థ్రిల్లర్
-నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది మెల్లగా ఎవాల్వ్ అయిన ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. అక్కడ నుంచి డెవలప్ చేయడం జరిగింది. తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.
డెఫినెట్‌గా చెప్పాలి
– ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, కథలు వస్తున్నాయి. కానీ, ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్‌గా చెప్పబడాలి. ఈ కథ అవేర్నెస్‌ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్ పాయింట్.
రెండు భాషల్లో షూట్
–కుబేర సినిమాని తెలుగు, తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు. కానీ, లెంత్‌లో ఒక నిమిషం తేడా ఉంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతిది విడివిడిగా తీశాం. టెక్నికల్‌గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింది.
ఇలాంటి ఒక ఐడియాలజీ ఎవరినైనా నొప్పించేలా ఉంటుందా?
-లేదండి. ఇది ఐడియాలాజికల్ బాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక రెండు ప్రపంచాలు ఉన్నాయనే అవేర్నెస్ వస్తుంది.
సంబంధిత కథనం