





Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 19 ఎపిసోడ్: సాక్ష్యాలతో దొరికిపోయిన యామిని- కిల్లర్‌కు కోటి రూపాయలు ఇచ్చిన వీడియో- కావ్యకు కన్నీళ్లు!
బ్రహ్మముడి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్‌లో యామిని-రాజ్ సంగీత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ డ్యాన్స్ చేస్తుంటే యామినికి కిల్లర్ రౌడీ రఘ నుంచి కాల్ రావడంతో వెళ్లిపోతుంది. కిల్లర్‌కు కోటి రూపాయలు యామిని ఇస్తుంది. దాన్ని అప్పు వాళ్లు వీడియో తీస్తారు. అప్పు వాళ్లను చూసిని యామిని తెగ భయపడిపోతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కనకం వచ్చి కావ్య గురించి కొన్ని విషయాలు డీప్‌గా చెప్పారు. ఆల్రెడీ పడిపోయాను అని కళావతికి రాజ్ చెబుతాడు. అసలే మీ పెళ్లి ఉంది కదా. మూతిపళ్లు రాలిపోతే ఫొటోలో కోతిలా ఉంటారు అని కావ్య కౌంటర్ ఇస్తుంది. మా అమ్మ మాటలు ఎక్కువగా నమ్మకండి. ఆవిడ ఎక్కువగా అబద్ధాలు చెబుతుందని కావ్య అంటుంది.
నీ నుంచి తీసుకెళ్తున్నందుకు
మీరు అబద్ధం కాదు కదా. అసలు నేను చెప్పేది ఏంటంటే అని రాజ్ అంటుండగా యామిని బావ అంటూ వస్తుంది. ప్రతిసారి యామిని కరెక్ట్ టైమ్‌కు వస్తుంది అని రాజ్ అంటాడు. సంగీత్ ఉంది కదా పదా బావా అని చెప్పిన యామిని నీ నుంచి బావను తీసుకెళ్తుందన్నందుకు సారీ అని చెబుతుంది. ఎంతదూరం తీసుకెళ్తావ్. ఇవాళ ఒక్కరోజుకు సంతోషించు అని కావ్య అంటుంది.
మరోవైపు రాహుల్, రుద్రాణిని స్వప్న చూసి పలకరిస్తుంది. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లిపోయారు అని స్వప్న అడుగుతుంది. చాలులే. మేం రాకుండా ఇంట్లో గడియ పెట్టింది నువ్వే అని తెలుసు అని రుద్రాణి, రాహుల్ అంటారు. చాలా గొప్ప విషయం కనిపెట్టారు కంగ్రాట్స్ అని స్వప్న కౌంటర్స్ వేస్తుంది. వచ్చామా తిన్నామా వెళ్లామా అన్నట్లు ఉండాలి. తోకలు జాడిస్తే కట్ చేస్తే అని స్వప్న అంటుంది.
సంగీత్‌లో డ్యాన్సులు
టైమ్ వచ్చినప్పుడు మేమే నిన్ను చంపేస్తామే అని రుద్రాణి అంటుంది. మరోవైపు ప్లాన్ అంతా రెడీగా ఉంది. ఆ రఘు ఒక్కడు కాల్ చేయడమే ఉందని అప్పు చెబుతుంటే రఘు కాల్ చేస్తాడు. అప్రూవల్‌గా మారిన ఆ కిల్లర్ రౌడీకి ఏమేం చేయాలో చెబుతుంది అప్పు. ప్రకాశం, ధాన్యలక్ష్మీ సంగీత్ స్టార్ట్ చేస్తారు. తర్వాత కల్యాణ్, అప్పు లవ్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తారు.
యామినికి రఘు కాల్ చేస్తాడు. దాంతో యామిని కంగారుపడుతూ డబ్బు రెడీ అయిందా అని తండ్రి రఘురందన్‌ను అడుగుతుంది. కాల్ లిఫ్ట్ చేసి ఇంకా డబ్బు రాలేదని యామిని చెబుతుంది. ఇప్పుడు రామ్, యామిని డ్యాన్స్ చేస్తారు అని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ కూర్చుంటే దొరికిపోతాను అని యామిని అనుకుంటుంది.
అర్జంట్‌గా వెళ్లాలి
తర్వాత డ్యాన్స్ చేస్తాను అని యామిని చెబితే అప్పు తీసుకొస్తుంది. అర్జంట్‌గా వెళ్లాలి. లేడిస్ ప్రాబ్లమ్ అని తప్పించుకుని వెళ్తుంది యామిని. అది చూసి అపర్ణ, ఇందిరాదేవి నవ్వుతారు. ఇప్పుడు రామ్ ఒక్కడే డ్యాన్స్ ఎలా చేస్తాడు అని స్వప్న అంటే.. నా మనవరాలు కావ్య ఉందిగా అని ఇందిరాదేవి అంటుంది. పరాయి మగాడితో నేను డ్యాన్స్ చేయడం ఏంటీ అని కావ్య అంటుంది.
తర్వాత స్వప్న కావ్యను తీసుకెళ్తుంది. యామిని సంగీత్‌లో రాజ్, కావ్య డ్యాన్స్ చేస్తారు. వారితోపాటు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా డ్యాన్స్ చేస్తుంది. అప్పు, కల్యాణ్ బయటకు వెళ్తారు. రఘునందన్‌కు ఒకరు డబ్బు తీసుకొచ్చి ఇస్తారు. వాటిని యామిని తీసుకొస్తుంది. కోటి రూపాయలు తీసుకొచ్చి రఘుకు యామిని ఇస్తుంది. అదంతా కల్యాణ్ వీడియో తీస్తాడు. అలా యామిని సాక్ష్యాలతో అప్పు వాళ్లకు దొరికిపోతుంది.
తప్పు చేసినట్లుగా
నాకు కావాల్సింది వచ్చాకా ఇంకెందుకు డిస్టర్బ్ చేస్తాను అని కిల్లర్ రౌడీ రఘు వెళ్లిపోతాడు. ఇంతలో అప్పు, కల్యాణ్, స్వప్నను యామిని చూసి తెగ షాక్ అవుతుంది. ఏంటీ ఎప్పుడు వచ్చారు అని యామిని అడిగితే.. ఏదో తప్పు చేసినట్లు అలా భయపడిపోతున్నారు. మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి. మా అప్పు పోలీసే. దొంగపనులు చేసేవాళ్ల మక్కిలి ఇరగ్గొడుతుంది అని స్వప్న అంటుంది.
నాకేం ప్రాబ్లమ్ లేదు. మీ సహాయం ఏం అవసరం లేదు అని యామిని కంగారుగా వెళ్లిపోతుంది. మరోవైపు కావ్యతో రాజ్ ఒంటరిగా మాట్లాడుతుంటాడు. తెల్లవారితో నా పక్కన ఉండే మనిషి మారిపోతుంది. యామినితో పెళ్లి కాబోతుంది. మీకు దూరం కాబోతున్నానే బాధగా ఉంది. బరువు మోస్తున్నట్లుగా ఉంది అని రాజ్ చెబుతుంటాడు. ఆ మాటలకు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్