





Best Web Hosting Provider In India 2024

ప్రభాస్ ది రాజా సాబ్ 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబడుతుంది.. బెట్టు కట్టిన డైరెక్టర్ మారుతి.. ఎందుకంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జోనర్లో ది రాజా సాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. ఈ ఏడాదే విడుదల కానున్న ది రాజా సాబ్ రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబడుతుందని డైరెక్టర్ మారుతి నమ్మకంగా చెప్పారు. అందుకు గల కారణాలపై ఓ లుక్కేద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో అలరించిన ప్రభాస్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే, ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చే సినిమా ది రాజా సాబ్.
హారర్ కామెడీ జోనర్
హారర్ కామెడీ జోనర్లో ది రాజా సాబ్ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. మొదటిసారిగా ఇలాంటి జోనర్లో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో కూడా ఇదే మొదటి సినిమా. ఇక రీసెంట్గా జూన్ 16న ది రాజా సాబ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఇంట్రెస్టింగ్ సమాధానాలు
ఇదిలా ఉంటే, ఇటీవల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు దర్శకుడు మారుతి. ఈ క్రమంలోనే “ప్రభాస్ మునుపటి సినిమాల స్థాయిని ది రాజా సాబ్ చేరుకుంటుందా? అని డైరెక్టర్‌ను మీడియా ప్రశ్నించింది.
ప్రభాస్ గత సినిమాల కలెక్షన్ల దృష్ట్యా మీడియా అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ మారుతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “బాహుబలి ఫ్రాంచైజీ, కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే, ఎలాంటి సందేహం లేకుండా ఈ సినిమా (ది రాజా సాబ్) కూడా రూ. 1000 కోట్లు దాటుతుంది” అని బెట్టు కట్టినట్లుగా నమ్మకంగా చెప్పారు డైరెక్టర్ మారుతి.
మారుతి కామెంట్స్ వైరల్
దీంతో సోషల్ మీడియాలో దర్శకుడు మారుతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, మారుతి చెప్పినట్లుగా ది రాజా సాబ్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్‌కు మంచి మార్కెట్ ఉంది. కాబట్టి, భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో ది రాజా సాబ్ మంచి వసూల్లు రాబట్టే ఛాన్సు ఉందంటున్నారు.
ఇక ది రాజా సాబ్ టీజర్ చూస్తే కామెడీ కచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఆయనకున్న క్రేజ్, మార్కెట్ ది రాజా సాబ్‌కు కలిసి రానుంది.
బాక్సాఫీస్ కారణాలు
ఇవే కాకుండా ది రాజా సాబ్ మూవీలో ముగ్గురు హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ సైతం అందాలతో అలరించనున్నారు. ఇలా చాలా అంశాలతో ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టడానికి కారణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.
సంబంధిత కథనం
టాపిక్