తెలంగాణ పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ పాలిసెట్ – 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.జూన్ 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 2 విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ – 2025

పాలిసెట్ – 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఈ ఏడాది జరిగిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని… సీట్లు పొందాల్సి ఉంటుంది. ఈసారి కొత్తగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ 2025 – ముఖ్య తేదీలు:

  • జూన్ 24 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 28తో గడువు ముగుస్తుంది.
  • జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక జూలై 1వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి.
  • జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి.
  • సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
  • ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది.
  • జూలై 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
  • జూలై 11వ తేదీ నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు.
  • జూలై 15వ తేదీన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది.
  • జూలై 18వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి:

  1. టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది.
  5. ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ts PolycetAdmissionsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024