




Best Web Hosting Provider In India 2024

ఏపీ ఎడ్సెట్ – 2025 ఫలితాలు విడుదల – ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఏపీ ఎడ్ సెట్ – 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి బీఈఈ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. cets.apsche.ap.gov.in/EDCET లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఏపీ ఎడ్ సెట్ 2025 ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి…
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఎడ్ సెట్ – 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
టాపిక్
Andhra Pradesh NewsAp EdcetEducationAdmissions