





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి నిన్న రిలీజ్ అయిన కుబేర.. కోట్లల్లో ఓటీటీ రైట్స్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి నిన్న (జూన్ 20) థియేటర్లలో విడుదలైన కుబేర మూవీ వచ్చేయనుంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించిన కుబేర ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న కుబేర ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వెనువెంటనే వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుబేర ఓటీటీలోకి వచ్చేయనుందని టాక్ జోరందుకుంది.
కుబేర ఓటీటీ రిలీజ్‌పై
అయితే, కుబేర మూవీ థియేటర్లలో నిన్న శుక్రవారం (జూన్ 2) విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుబేర ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కుబేర సినిమాకు పాపులర్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అంతేకాకుండా తనదైన మార్క్ స్టైల్‌తో కుబేర సినిమాను తెరకెక్కించారు.
పాజిటివ్ రెస్పాన్స్
కుబేర మూవీలో కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకరైన జిమ్ సర్బ్ కీ రోల్లో యాక్ట్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అన్ని చోట్ల ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది కుబేర.
ఎక్స్ట్రార్డినరీ అంటూ రివ్యూలు
శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్, నాగార్జున, రష్మికల యాక్టింగ్ ఎక్స్ట్రార్డినరీ అంటూ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా బిచ్చగాడిగా ధనుష్ నెక్ట్స్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చాడని తెగ చెబుతున్నారు. ధనుష్‌కు మరో నేషనల్ అవార్డ్ పక్కా అని అంటున్నారు. అలాగే, నాగార్జునను సరికొత్తగా చూశామని చెబుతున్నారు.
కుబేర ఓటీటీ రైట్స్
ఇలా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్న కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కుబేర ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. కుబేర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం.
5 భాషల్లో స్ట్రీమింగ్
సుమారు రూ. 47 కోట్లు ఖర్చు పెట్టి కుబేర ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనుక్కున్నట్లు డీల్ కుదుర్చుకుందని టాక్. అయితే, ఏకంగా ఐదు భాషల్లో కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి అంత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో కుబేర ఓటీటీ రిలీజ్ కానుంది.
బాక్సాఫీస్ కలెక్షన్స్
అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. సినిమా టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ వంటి అంశాల ప్రాతిపదికన కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్