యోగా దినోత్సవం 2025: బిజీగా ఉండే ఉద్యోగుల కోసం 4 డెస్క్ యోగా స్ట్రెచ్‌లు

Best Web Hosting Provider In India 2024

యోగా దినోత్సవం 2025: బిజీగా ఉండే ఉద్యోగుల కోసం 4 డెస్క్ యోగా స్ట్రెచ్‌లు

HT Telugu Desk HT Telugu

యోగా దినోత్సవం 2025 సందర్భంగా, జూన్ 21న, మనం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా ఆఫీసులో కూడా యోగాను ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం. సాధారణంగా యోగా అంటే మ్యాట్‌లు, తోటల్లో చేసేదిగానే చాలామంది అనుకుంటారు. డెస్క్ యోగా స్ట్రెచ్‌లతో దీన్ని మన రోజువారీ ఆఫీసు పనిలో దీనిని సులభంగా కలిపేసుకోవచ్చు.

డెస్క్ వద్దే యోగాసనాలు (Shutterstock)

యోగా దినోత్సవం 2025 సందర్భంగా, జూన్ 21న, మనం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా ఆఫీసులో కూడా యోగాను ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం. సాధారణంగా యోగా అంటే మ్యాట్‌లు, తోటల్లో చేసేదిగానే చాలామంది అనుకుంటారు. దీనివల్ల బిజీ షెడ్యూల్స్ ఉన్నవాళ్ళు యోగా చేయడానికి సమయం దొరకక ఇబ్బంది పడుతుంటారు. కానీ యోగా అనేది చాలా సరళమైనది, సులభంగా మార్చుకోదగినది. డెస్క్ యోగా స్ట్రెచ్‌లతో దీన్ని మన రోజువారీ ఆఫీసు పనిలో సులభంగా కలిపేసుకోవచ్చు. ఇలా చేస్తే, ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేసినా ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉండొచ్చు.

హిమాలయన్ సిద్ధా అక్షర్ యోగా కేంద్ర స్థాపకులు, యోగా నిపుణుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ ఉద్యోగుల కోసం 4 డెస్క్ యోగా స్ట్రెచ్‌లను, వాటిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించారు.

1. గ్రీవ సంచాలన క్రియ (మెడ తిప్పడం):

ఎలా చేయాలి: డెస్క్ వద్ద కూర్చుని, వీపును నిటారుగా ఉంచండి. మెడను నెమ్మదిగా సవ్యదిశలో (క్లాక్‌వైజ్) తిప్పండి. పైకి వెళ్లేటప్పుడు శ్వాస తీసుకోండి. క్రిందకు వచ్చేటప్పుడు శ్వాస వదలండి. ఇలా 5-8 సార్లు చేయండి. తర్వాత అపసవ్యదిశలో (యాంటీ-క్లాక్‌వైజ్) మళ్ళీ చేయండి.

ప్రయోజనాలు: మెడ, భుజాలపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును స్థిమితంగా ఉంచుతుంది.

సింపుల్ ఆసనాలతో డెస్క్ వద్దే మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు
సింపుల్ ఆసనాలతో డెస్క్ వద్దే మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు (Shutterstock)

2. తాడాసనం:

ఎలా చేయాలి: డెస్క్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నిలబడండి. చేతి వేళ్ళను ఒకదానితో ఒకటి కలిపి, చేతులను తల పైన పూర్తిగా పైకి చాచండి. మీ శరీర బరువును కాలివేళ్లపై ఉంచి, మొత్తం శరీరాన్ని సాగదీయండి. ఇలా 5 సార్లు చేయండి.

ప్రయోజనాలు: శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండర వ్యవస్థకు తక్షణమే శక్తినిస్తుంది. శరీరాన్ని తిరిగి సరైన స్థితికి తీసుకువస్తుంది.

3. పరివృత్త సుఖాసనం (ట్విస్టెడ్ ఈజీ పోజ్):

ఎలా చేయాలి: కుర్చీలో నిటారుగా, సౌకర్యవంతంగా కూర్చోండి. ఎడమ చేతిని కుడి మోకాలిపై ఉంచండి. శరీరం పై భాగాన్ని కుడి వైపుకు తిప్పుతూ, కుడి చేతితో కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. ఛాతీని ముందుకు ఉంచి, వెన్నెముకను నిటారుగా సాగదీయండి.

ప్రయోజనాలు: శ్వాస లోతుగా తీసుకుంటూ 5-8 సెకన్ల పాటు అలాగే ఉంచండి. ఇరువైపులా 3-5 సార్లు పునరావృతం చేయండి. ఇది వెన్నెముకపై ఉన్న ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల వైపు శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. శరీర పై భాగాన్ని సరైన స్థితికి తెచ్చి, విశ్రాంతినిస్తుంది.

4. నాసికాగ్రహ దృష్టి (ముక్కు చివర దృష్టి):

ఎలా చేయాలి: సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని, కనురెప్పలు వాల్చకుండా ముక్కు చివరను ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడడానికి ప్రయత్నించండి.

ప్రయోజనాలు: ఇది పూర్తయిన తర్వాత కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు, లేదా అరచేతులను వేడి చేసి కళ్ళపై ఉంచుకోవచ్చు (వార్మ్ పాల్మింగ్). ఈ టెక్నిక్ మానసిక స్పష్టత, స్థిరత్వం, ఏకాగ్రతను పెంచుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది, కళ్ళ ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024