





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు: నల్లపూసల వేడుకకు బాలు రాకూడదు- ప్రభావతికి శ్రుతి తల్లి కండిషన్- ఒప్పుకున్న సత్యం- మీనాకు షాక్!
గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శ్రుతి నల్లపూసల వేడుకకు బాలు రాకూడదని ప్రభావతికి శ్రుతి తల్లి శోభన కండిషన్ పెడుతుంది. అదే విషయం ఇంట్లో చెబితే మొదట సత్యం ఒప్పుకుంటాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. అందరితోపాటుబాలు, మీనా వస్తేనే ఫంక్షన్ జరుగుతుందని శ్రుతి చెబుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో హల్వా, మల్లెపూలు తీసుకొచ్చి మీనాతో ఫస్ట్ నైట్ చేసుకొందామని బాలు అనుకుంటాడు. కానీ, హాల్లోకి ఎవరో ఒకరు ఏదో ఒక కారణంతో రావడంతో బాలు మీనాలకు డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేకాకుండా హల్వాను మనోజ్ రోహిణి తినేసి వెళ్లిపోతారు.
విజిల్ కొట్టుకుంటూ
తిన్న బిర్యానీ అరగక అవస్థతో ప్రభావతి హాల్లోకి వస్తుంది. అప్పుడే మూడ్లోకి వచ్చిన బాలు ప్రభావతి విజిల్ కొట్టుకుంటూ రావడంతో ఆగిపోతాడు. ఇక హాల్లో ప్రభావతి నడుస్తూ ఉంటుంది. దాంతో మొత్తానికి బాలు మీనా ఫస్ట్ నైట్ ప్లాన్ చెడిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ప్రభావతి ఇంటికి శ్రుతి తల్లి శోభన వస్తుంది.
ఇంటికి వచ్చి శ్రుతికి నల్లపూసల కార్యక్రమం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. శ్రుతికి పెళ్లి అయి ఇంతకాలం అయినా మీరైన నల్ల పూసలు గుచ్చి పుస్తెలతాడు వేయలేదు. ఆ నల్లపూసలు గుచ్చే వేడుకనే గ్రాండ్గా అందరిని పిలిచి చేయాలని అనుకుంటున్నాం అని శోభన చెబుతుంది. దాంతో ప్రభావతి తెగ సంతోషిస్తుంది. మీరు అంత గ్రాండ్గా చేస్తానంటే మేమెందుకు కాదంటాం అని ప్రభావతి అంటుంది.
రోహిణికి కూడా
ఇంతలో రోహిణి వస్తుంది. శ్రుతితోపాటు రోహిణి నల్లపూసలు గుచ్చి ఇస్తే బాగుంటుందేమో అని ప్రభావతి అంటుంది. ఇద్దరికి ఒకేసారి ఆ వేడుక జరిపించేద్దాం అని శోభన అంటుంది. శ్రుతితోపాటు రోహిణికి కూడా తల్లిలా శోభన నల్లపూసల వేడుక చేయిస్తానని చెబుతుంది. అనంతరం మరోసారి ఇంటికి వచ్చిన శోభన బాలు ఈ ఫంక్షన్కు రాకూడదు అని చెబుతుంది.
దాంతో ప్రభావతి కాస్తా షాక్ అవుతుంది. బాలు ఫంక్షన్కు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక మీదే. అతను వస్తే ఏదో గొడవ జరుగుతుంది. అందుకే వద్దంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతుంది శోభన. అనంతరం ఇంట్లో ఇదే విషయంపై ప్రభావతి మాట్లాడుతుంది. బాలు ఫంక్షన్కు రాకూడదు అని వాళ్లు చెప్పారని మీనా, సత్యంతో ప్రభావతి అంటుంది.
వాళ్ల పరువు పోతుంది
బాలు ఎందుకు రాకూడదు అని సత్యం అడుగుతాడు. బాలు గాడు వచ్చి గొడవ చేస్తాడు. వాళ్ల పరువు కూడా పోతుంది. అందరిలో మన పరువు పోతుంది అని ప్రభావతి చెబుతుంటుంది. ఇంతలో బాలు వస్తాడు. ఏంటీ నాన్న అమ్మ ఏదో పరువు గురించి, గౌరవం గురించి మాట్లాడుతుంది అని బాలు అడుగుతాడు. శ్రుతి వాళ్ల ఫంక్షన్కు మీరు రాకూడదట అని మీనా చెబుతుంది.
మంచిది.. బాలు రాడు. సరేనా అని సత్యం ఒప్పుకుంటాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. మామయ్య ఇలా అన్నారేంటీ అని మీనా అనుకుంటుంది. బాలు కూడా దిగాలుగా మొహం పెడతాడు. కానీ, తర్వాత బాలును వద్దన్న చోటుకు నేను రాను అని సత్యం చెబుతాడు. దాంతో ప్రభావతి అవాక్కవుతుంది. నా భర్తను వద్దన్నచోటుకి నేను మాత్రం సిగ్గులేకుండా ఎలా వెళ్తాను అని మీనా అంటుంది.
బాలు మీనా వస్తేనే
దానికి కూడా ప్రభావతి షాక్ అవుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రుతి, రవికి ఈ విషయం తెలుస్తుంది. అందరితోపాటు బాలు, మీనా వస్తేనే ఫంక్షన్ జరుగుతుంది అని శ్రుతి తెగేసి చెబుతుంది. దాంతో ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్